రాతలు – కోతలు

జూన్ 18, 2008

కాళీపట్నం రామారావు యజ్ఞం-ఒక సమీక్ష.

Filed under: pustaka paricayamu — కస్తూరి మురళీకృష్ణ @ 8:07 ఉద.

కాళీపట్నం రామారావుగారనగానే గుర్తుకు వచ్చే కథ యజ్ఞం.కథకుడిగా ఆయన ఖ్యాత్ ఈ కథ పయినే ఆధారపడివుంది.ఇదిగాక ఇంకో కథ పేరు చెప్పమంటే చెప్పగలిగే వారు తక్కువ.ఈ స్థాయిలోఉన్న కథ కూడా మరొకటి లేకపోవటంతో కాళీపట్నం రామారావుగారిని కథకుడిగా నిలిపిన కథగా ఈ కథను భావించవచ్చు.
యజ్ఞం కథలోని అమ్షాలతో ఏకీభవించినా,ఏకీభవించకపోయినా యజ్ఞం అతి ప్రాచుర్యం పొందిన కథలలో ఒకటి అన్న విషయంలో ఎటువంటి భిన్నాభిప్రాయాలు లేవు.గాలివాన,ఒక పువ్వుపూసింది వంటి కథల సరసన నిలబడుతుందీ కథ.కథా రచయితలందరూ ఒక్కసారయినా తప్పకుండా చదవాల్సిన కథలజాబితాలో అగ్ర స్థానంలో వుంటుందీ కథ.
మూడేళ్ళ కిందట పుట్టి,మూడు నెల్లుగా ముడిపడి,మూడు రోజుల్నుంచీ నలుగుతున్న తగవు ఆ వేళ అటో ఇటో తేలిపోతుంది-ఆ భావం ఆ వూరి గాలిలో అలా అలా తేలుతోంది,అంటూ ఆరంభమవుతుంది కథ.
కథలో ప్రధాన పాత్రలు మూడు.అప్పల్రాముడు,గోపన్న,శ్రీ రాములు నాయుడు అనే ఈ మూడు పాత్రల చుట్టూ కథ తిరుగుతుంది.సుదీర్ఘమయిన ఈ కథను టూకీగా చెప్తాను.
గోపన్న ఒక మాజీ షావుకారు.ఒకప్పుడు ధనవంతుడే అయినా ఇప్పుడు చితికిపోయాడు.అతడు కొన్నాళ్ళక్రితం అప్పల్రాముడనే మాల కుల పెద్దకు రెండువేలు అప్పు ఇస్తాడు.అప్పల్రాముడు అప్పు తీర్చడు.అది వడ్డీతో సహా రెండువేల అయిదొందలవుతుంది.అప్పుతీర్చాలని గోపన్న తగవుకొస్తే,శ్రీరాములు నాయుడు పంచాయితీ వద్దని మధ్యస్థంగా తీర్పు చెప్తాడు.మూడేళ్ళ గడువు అడుగుతాడు అప్పల్రాముడు.అతడికి రెండెకరాల ముప్పై సెంట్ల మడిచెక్క వుంటుంది.అది అమ్మితేకానీ అప్పు తీర్చలేడు.అది అమ్మటం అతనికి ఇష్టం లేదు.అందుకే మూడేళ్ళ గడువు కోరతాడు.
మూడేళ్ళవుతుంది.అప్పల్రాముడు అప్పు తీర్చడు.దాంతో విషయం పంచాయితీకి వస్తుంది.ఇక్కడి నుంచీ కథ ఆరంభమవుతుంది.
అప్పు తీర్చలేనంటాడు అప్పల్రాముడు.తీర్చాలంటారు పెద్దలు.భూమి అమ్మితే తనకేమీ మిగలదంటాడు అప్పల్రాముడు.తీర్చక తప్పదంటారు పెద్దలు.చివరికి శ్రీరాములు కూడా తీర్చాలనటంతో అప్పల్రాముడు అందుకు ఒప్పుకుంటాడు.అయితే,అప్పల్రాముడి పెద్ద కొడుకు ఆవేశపరుడు.భూమి అమ్మటం అతనికి ఇష్టం వుండదు.అతడు వూరి పెద్దలను ఖాతరు చెయ్యడు.తండ్రి భూమి అమ్మి అప్పు తీరుస్తాననగానే ఇంటికి పరుగెత్తుతాడు.తన సంతానాన్ని నరికేస్తాడు.తన కొడుకు బానిస బ్రతుకు బ్రతకటం ఇష్టం లేక ఆపని చేస్తాడు.
ధర్మాన్నాలేంతవరకూ?అంతా నువ్వు చెప్పినట్టు వినేవరకూ.ఆ తరువాత!అని కథ ముగుస్తుంది.
మొదటీ నుంచీ కథ చదువుతూంటే ముగుంపు గురించిన ఒక ఊహ కలుగుతుంది.కానీ తన కొడుకునే,అతడు చంపేసుకోవటం(అప్పల్రాముడి పెద్దకొడుకు తన కొడుకుని చంపుకుంటాడు.)అనూహ్యమయిన ముగింపు.అది చదవగానే వొళ్ళు గగుర్పొడుస్తుంది.ఒక మనిషి,ఎంతగా అణచివేయబడితే,ఎంత దుర్భరమయిన నిరాషా నిస్పృహలకు గురయితే అంత ఘోరమయిన పని చేస్తాడో అన్న ఊహ కలుగుతుంది.ముఖ్యంగా తనలాగే తన సంతానం బానిసలా బ్రతకటం నచ్చని తండ్రి కొడుకును అలా చంపుకోవటం తీవ్ర మయిన అలజడిని మదిలో కలిగిస్తుంది.
ఆ అలజడి,ఆ వేశం తగ్గిన తరువాత ఆలోచన వస్తుంది.అప్పుడు కథను మళ్ళీ చదివితే,కథను ఒక్కొక్క అంశంగా విడతీసి విశ్లేషిస్తే యజ్ఞం అసలు రూపు తెలుస్తుంది.ఒక భావావేశ తీవ్ర కలిగించి రచయిత మన కళ్ళముందు నిలిపిన మాయా ప్రపంచం అర్ధమవుతుంది.ఇది రేపు.   

వ్యాఖ్యానించండి »

ఇంకా వ్యాఖ్యలు లేవు.

RSS feed for comments on this post. TrackBack URI

వ్యాఖ్యానించండి

వర్డ్‌ప్రెస్.కామ్‌లో బ్లాగండి.