రాతలు – కోతలు

జూలై 5, 2009

ఇది నా చివరి పోస్టు!

Filed under: నా రచనలు. — కస్తూరి మురళీకృష్ణ @ 5:08 ఉద.

అవును ఇది నా చివరి పోస్టు!

వివరాలు చెప్పేముందు, ఈవారం నా రచనల వివరాలు చెప్తాను.

ఈనెల విపుల మాస పత్రికలో నా కథ చట్టం దిద్దిన సంసారం వచ్చింది. నిజానికి ఈకథను మూడు సంవత్సరాల క్రితం నేను రాస్తూన్న వ్యంగ్యాస్త్రం శీర్షికలో ఒక అస్త్రం గా ఇచ్చాను. ఆ శీర్షిక ఆగిపోయినా వారి వద్ద రెండు అస్త్రాలు మిగిలిపోయాయి. అలా మిగిలిన వాటిలో ఒక అస్త్రం ఇది. అప్పుడే కొత్తగా ఏర్పరచిన గృహ హింస చట్టాన్ని వ్యంగ్యం చేస్తూ రాసిన కథ ఇది.

ఆదివారం వార్తలో కవర్ స్టోరీ మైకెల్ జాక్సన్ పైన నేను రాసిందే. కవర్ స్టోరీకి అనుబంధంగా బ్లాగ్ స్పాట్ లో కూడా జాక్సన్ కు సంబంధించిన బ్లాగులను పరిచయం చేశాను.

ఆంధ్రప్రభ సగటు మనిషి స్వగతంలో రేట్లు పెంచారని ప్రయివేట్ యాజమాన్యంతో పోరాడుతున్న తల్లితండృలను చూసి సగటుమనిషి ఆశ్చర్యపోయి ప్రత్యామ్నాయం సూచిస్తా
డు.

ఆంధ్రభూమిలో పవర్ పాలిటిక్స్ శీర్షికన ఉత్తర కొరియా రాజకీయాలాటల విశ్లేషణ వుంటుంది.
ఈనెల ఈభూమిలో నా రచనలు అక్షరాంజలి, రియల్ స్టోరీలపైన సమీక్షలు వచ్చాయి.
గురువారం చిత్రప్రభలో సినిమాలుగా మారిన నవలల చర్చ కొనసాగుతుంది.
ఇవీ ఈవారం నా రచనలు. చదివి మీ అభిప్రాయం చెప్పండి.

ఇక బ్లాగులో చివరి పోస్టు గురించి.

చావాకిరణ సహాయ సహకార సౌజన్యాలతో నేను ఒక వెబ్ సైటును ప్రారంభించాను. kasturimuralikrishna.com.

ఇక నుంచి నా రాతలు-కోతలన్నీ ఆ వెబ్ సైటులోనే జరుగుతాయి.

దాన్లో నా రచనలన్నిటినీ వుంచుతాను. అలాగే నా పుస్తకాల వివరాలన్నీ వుంటాయి. ఇవికాక నా రాతలెలాగో వుంటాయి.

నా బ్లాగును ఆదరించిన విధంగానే నా వెబ్ సైటునూ ఆదరిస్తారని ఆశిస్తున్నాను.

సెలవు

వెబ్ సైటులో కలుస్తూనేవుందాం!

ప్రకటనలు

జూలై 4, 2009

అంధేందుదయముల్, మహా బధిర శంఖారావముల్…..

Filed under: నా రచనలు. — కస్తూరి మురళీకృష్ణ @ 3:00 ఉద.

 

సగటు మనిషి స్వగతం

సగటు మనిషి స్వగతం

 

 

 

 

 

 

 

ఇది ఆంధ్రప్రభ 28.6.2009 ఆదివారం అనుబంధం లో సగటుమనిషి స్వగతం శీర్షికన ప్రచురితం.

జూలై 2, 2009

తప్పక చూడవలసిన సినిమా, నింగీ-నేలా, నాదే!

Filed under: సినెమా రివ్యూ — కస్తూరి మురళీకృష్ణ @ 10:59 ఉద.

iwngs2రేపు విడుదలవుతున్న నింగీ, నేలా, నాదే- అనే సినిమాను అందరూ, పిల్లలూ, పెద్దలూ, మొత్తం కుటుంబ సభ్యులూ అందరూ కలసి తప్పనిసరిగా చూడవలసిన సినిమా.

ఇది, చైనా సినిమా ఇన్విసిబుల్ వింగ్స్ కు తెలుగు తర్జుమా.

ఒక 15 ఏళ్ళ అమ్మాయి, ఓ దుర్ఘటనలో రెండు చేతులనూ కోల్పోతుంది. అయినా, అధైర్యపడక, అన్ని కష్టాలనూ ధైర్యంగా ఎదుర్కుని, తనకు ఎలాంటి ప్రత్యేక రాయితీలు అవసరంలేదని, ఆత్మశక్తితో ఆత్మగౌరవాన్ని నిలుపుకుంటుంది. అంగవైకల్యం శరీరానికేననీ, మనోశక్తితో అన్ని వైకల్యాలను అధిగమించి జీవితాన్ని సాఫల్యం చేసుకోవచ్చనీ నిరూపిస్తుంది.

iwingsఈసినిమా చూస్తూంటే ప్రతి చిన్న కష్టానికీ కృంగిపోతూ, న్యూనతాభావానికి గురవుతూ, ఆత్మహత్యలవైపు పరుగిడేవారందరికీ బుద్ధివచ్చి స్ఫూర్తి జాగృతమవుతుంది.

తాము వెనుకబడి వున్నాము కాబట్టి తమకు చేయూతలేనిదే నిలబడలేమని దీనాలాపాలు, ఆక్రందనలు చేసేవారందరికీ, ఆత్మశక్తి, ఇచ్చాశక్తి అనే పదాల అర్ధాలు బోధపడతాయి. మనస్సాక్షి జాగృతమయి సిగ్గిలుతుంది.

మనిషికి తనమీద తనకు నమ్మకం వుంటే, ఏదయినా సాధించాలన్న పట్టుదల వుంటే, అతని ఆత్మబలం తప్ప మరెవెరి చేయూత అవసరంలేదన్న నిజాన్ని నిక్కచ్చిగా చూపుతుందీ సినిమా.

ప్రతి ఒక్కరూ, ఒకతికి రెండుసార్లు చూసి స్ఫూర్తిని పొందవలసిన అద్భుతమయిన సినిమా ఇది.

iwngs3ఈ సినిమాను చలన చిత్రోత్సవంలో చూశాను. ఇప్పుడిది అనువాదమయి, పాటలు చేర్చుకుని వస్తోంది. చూడండి. ఇతరులకు చూపించండి. ఇలాంటి చిత్రాలను ఆదరిస్తే, మరిన్ని మంచి చిత్రాలు మనకందుతాయి. లేకపోతే, ఎవరూచూడరని. అవే ప్రేమలూ, అవే గెంతులు, పూబంతుల ప్రతీకల కుళ్ళు సినిమాలే మనకు గతి అవుతాయి.

తర్వాత పేజీ »

వర్డ్‌ప్రెస్.కామ్‌లో ఓ ఉచిత వెబ్‌సైటు లేదా బ్లాగును సృష్టించుకోండి.