రాతలు – కోతలు

మే 19, 2009

పుస్తకాలు-ధరలు!

Filed under: నా రచనలు. — కస్తూరి మురళీకృష్ణ @ 2:45 ఉద.

పుస్తకం కనబడగానే ఆకర్షణీయంగా వుంటుంది. దాన్ని చేతిలోకి తీసుకుని చూస్తారు. పుస్తకం అటూ ఇటూ తిరగేస్తారు. ధర చూస్తారు. అమ్మో అని పక్కన పెట్టేస్తారు.

ఇది అనేక సందర్భాలలో జరుగుతుంది. ధర కొనేవాళ్ళను దూరం తరిమేస్తుంది. ఈ పుస్తకానికి అంత ధర ఎక్కువ అన్న ఆలోచన కొనేవాళ్ళలో కనిపిస్తుంది.

గమనిస్తే, వందలు పెట్టి ఇంగ్లీషు పుస్తకాలు కొనేవారు కూడా, 50/-, 60/- పెట్టి తెలుగు పుస్తకాన్ని కొనేందుకు ఇష్టపడరు.

ఇది తెలుగు రచయితల దురదృష్టం.

ఇందుకు కారణాలనేకం.

పుస్తకాల ధర ఎక్కువ అనేవారిని విమర్శిస్తూ, ann thwaite అనే రచయిత్రి
 i find myself often protesting when people complain of the price of books. i remember chiding a tory minister for the arts on this point, once, long ago, at a booker prize dinner. he had said how much he regretted that books were so expensive. why is it that people will cheerfully sign away a huge sum on a credit card for a meal or theatre tickets, but baulk at the cost of a book? twice recently i have paid the price of a fat biography for a theatre ticket and found myself craning round other peoples heads to see a disappointing play, with afterwards nothing to hold in ones hand to go through again to revisit the good bits and to try to decide why it was disappointing. అంటుంది.

ఇది నిజం కూడా. నలుగురు మితృలు కలసి కాఫీ తాగితే, 40 రూపాయలవుతాయి. ఒక కథల సంకలనం 40 రూపాయలు. నలుగురు హోటలు కెళ్తే 200 అవుతాయి. ఆ ధరకు, కనీసము మూడు నాలుగు కథల సంకలనాలు వస్తాయి. కానీ, డబ్బులు చెల్లించి హోటలు తిండి బాగాలేదనేందుకే ఇష్టపడతాము కానీ, పుస్తకం కొని బాగాలేదనాలంటే డబ్బులు అనవసరంగా ఖర్చు చేసిన భావన కలుగుతుంది.

ఇదీ తెలుగు పుస్తకాల దుస్థితి.

ఈనిజాన్ని ఒప్పుకోక తప్పదు. అయినా సరే పుస్తకాలు ప్రచురించక తప్పదు. కాబట్టి, ఇతరుల పుస్తకాలుకొనకున్నా, మన పుస్తకాలు మాత్రం కొంటారనుకుంటూ ధర నిర్ణయించాల్సివుంటుంది.

ప్రచురణ సంస్థలకయితే అమ్ముకునే పద్ధతులు తెలుసు. కాబట్టి వారు ధర గురించి అంతగా ఆలోచించరు.

కొందరు ధర 50 దాటనివ్వరు. కొనటానికి సులభంగా వుంటుందని వారి అభిప్రాయం.

కందుకూరి రమేష్ బాబు పుస్తకాల వెల పది రూపాయలే. అది ఆయనకెలా సాధ్యమవుతోందో ఆయనకే తెలియాలి.

అసిధార ప్రచురించినప్పుడు నాకు పుస్తకాల వెల నిర్ణయించటం గురించి ఏమీ తెలియదు.

500 కాపీలు అచ్చువేయాలనుకున్నాను. 20 వేలు ఖర్చు అవుతోంది. పుస్తకం వెల 60 రూపాయలుంచితే 30 వేలొస్తాయి. 10 వేలు లాభం. యాహూ, అని ఎగిరిగంతేసి 60 రూపాయలు ధరగా నిర్ణయించాను. నా మితృడు, 50 యితే అందరికీ కొనే వీలుంటుంది అన్నాడు. కానీ మరీ 5 వేలే లాభమా? అని ఆలోచించి 60 వుంచాను. ఈ నిర్ణయం వల్ల నష్టపోయాను. ఈ విషయం తరువాత చెప్తాను.

ఇక్కడ ధర నిర్ణయించేటప్పుడు నాకు తెలియని విషయాలు, పరిగణనలోకి తీసుకోని విషయాలు బోలెడన్ని వున్నాయి.

పుస్తకం అచ్చయిన తరువాత దాన్ని పుస్తకాల దుకాణాలలో వుంచాలి. అలా దుకాణాలలో వుంచి అమ్మేందుకు ఆ దుకాణాలవారికి 40 శాతం ఇవ్వాలి. 100 రూపాయల పుస్తకం ఒకటి అమ్మితే అందులో మనకు వచ్చేది 60 రూపాయలన్నమాట. కొందరు 50 శాతం అడుగుతారు. అంటే, అసిధార ఒకో పుస్తకానికి నాకు 35 రూపాయలే వస్తాయన్నమాట. లెక్క చూస్తే నాకు ఖర్చు 20 వేలయితే, 500 పుస్తకాలూ అమ్మితే, నా చేతికి వచ్చేది, 17500 మాత్రమే అన్నమాట. పుస్తకం ప్రచురించకముందే 2500 నష్టం!

నిజానికి 500 కాపీలూ అమ్ముడుపోవు.

మనము పుస్తకం ప్రచురించినట్టు, అది దుకాణాలలో దొరుకుతున్నట్టు ప్రజలకు తెలియాలంటే ప్రచారం అవసరము.

ఇంగ్లీషు పుస్తకాలు ప్రచురితమవుతున్నాయంటేనే వాటి గురించి పత్రికలలో వార్తలు వస్తాయి. టీవీల్లో చర్చలు జరుగుతాయి. పుస్తకాలు విడుదల అయినరోజు రచయిత సంతకంతో కొనేందుకు పాఠకులుంటారు. పుస్తకాన్ని ప్రచారంచేస్తూ రచయిత వూళ్ళు తిరుగుతాడు.

మనదగ్గర అలాంటి వ్యవస్థలేదు.

సభ చేయాలి. సభకెంతమంది వస్తారో తెలియదు. ఆవార్త పత్రికలలో రావాలి. కొన్ని పత్రికలు వేస్తాయి. కొన్ని వేయవు. తరువాత పత్రికలలో రివ్యూలు రావాలి.( రివ్యూల రాజకీయాలు తరువాత). రివ్యూలు రావాలంటే పత్రికలకు రెండేసి కాపీలు ఇవ్వాలి. అంటే, ఇక్కడే 50 కాపీలు ఫ్రీగా ఇవ్వాల్సివస్తోందన్నమాట.

ఇంకా, కొందరు ఆప్తులుంటారు. వారికి కాంప్లిమెంటరీలివ్వాలి. కొందరు ఇంటికి వచ్చి జబరదస్తీగా కాపీలి తీసుకెళ్తారు.

బంధువులుంటారు. కొనుక్కోమంటే కరచి, అరచి, పుస్తకం తీసుకెళ్తారు.

ఆఫీసులో కోలీగులుంటారు. నీ పుస్తకం కొని చదవటమేమిటని, అన్ని రకాల అర్ధాలొచ్చేట్టు వ్యాఖ్యానించి పుస్తకం లాక్కుపోతారు.

ఇలా లాక్కున్న పుస్తకాలు చదివితే అదో ఆనందం. ఎప్పుడడిగినా తీరిక చిక్కలేదంటారు. ఒకరోజు, ఎవరో పట్టుకెళ్ళారంటారు.

కొన్నవారు, చదవకపోయినా బాధలేదు. ఇలా తీసుకుని చదవకపోతే బాధ వర్ణనాతీతం.

అంటే, అచ్చేసిన 500 కాపీలూ అమ్ముడుపోవు. కాబట్టి, ధర నిర్ణయించటంలో, మనం దుకాణాలకిచ్చే 40 శాతమూ, ఫ్రీగా ఇచ్చే కాంప్లిమెంటరీలూ కలుపుకోవాలన్నమాట.

మనకు పుస్తక ప్రచురణకయిన ఖర్చుకు ఆరు రేట్లు ఎక్కువ వేసుకుంటే మమచిది. కొందరు మూడు త్రెట్లు ఎక్కువ వేస్తారు.

ఎన్నిరెట్లు వేసినా కొనేవాడుంటే కదా, అనుకుంటే నష్టం లేదు. కనీసం ధర నిర్ణయించి లాభాల లెక్కలు చూసి ఆనందించవచ్చు.

ధర నిర్ణయం గురించి ఇంకా మరో సారి.

ప్రకటనలు

5 వ్యాఖ్యలు »

 1. చదువుతుంటే కాస్త బాధగా ఉంది. పదేళ్ళ తర్వాత తెలుగు పుస్తకాలకు కూడా మంచిరోజులు వస్తాయని నాకు ఇప్పటికీ నమ్మకం ఉంది. పుస్తకమంటే పేపరు పుస్తకం కాదు, ఈ-పుస్తకం అన్నమాట! ఒకసారి http://jeedipappu.blogspot.com/2009/02/blog-post_24.html చూడండి.

  వ్యాఖ్య ద్వారా జీడిపప్పు — మే 19, 2009 @ 3:42 ఉద. | స్పందించండి

 2. konnitiki ekkuvane anipistundandi…..suppose recent ga chitten raaju gari book 150 pages 150 anta entandi…………mareeeeeeeee over kaakapote..

  konni ante………….. alane prati okkaru pustakaalaki dabbu khrchu pettalani asinchadam tappu babu……………….kondariki vere habits vunty……….

  వ్యాఖ్య ద్వారా vinay chakravarthi — మే 19, 2009 @ 5:11 ఉద. | స్పందించండి

 3. http://parnashaala.blogspot.com/2009/05/vs.html

  ఈ విషయంపై నా టపా చూడండి.

  వ్యాఖ్య ద్వారా కె.మహేష్ కుమార్ — మే 19, 2009 @ 8:44 ఉద. | స్పందించండి

 4. @vinay: మీరు అలవాట్లు మార్చుకోనక్కర్లేదు; సమస్య రూపాలను చూసి,ప్రతి వారూ వాళ్లకి తోచినట్టు అనుకుంటారు.అనూహ్యంగా జీడిపప్పుగారు తమ ఆశావహమైన పోస్టును ఇక్కడ ఉదహరించారు చూడండి!. మీకు కిండిల్ కొనుక్కుందామని కోరిక పుడితే,పుస్తకం అందులో రావడం ఓ ఆలోచన కావచ్చు; లేదా, మీకు వేరే అలవాట్లు ఉన్నట్టు,పుస్తక పఠనాన్ని అలవాటు చేయించొచ్చు; లేక ఇదేదీ కాక,మరి కొన్ని ఆలోచనలు చేయొచ్చు.ఇప్పుడే ఇంకో బ్లాగులో చెప్పొచ్చాను-ఆలోచనలు ముఖ్యం; వాటికోసం ఎంతమందైనా తెగించి వస్తారు. మీరు హర్ట్ అవ్వకండి.గో టు బరిస్టా అండ్ ఐమాక్స్ యాజ్ యూజుయల్.వి హావ్ నో కంప్లైంట్స్ విత్ యూ.

  @మహేష్
  అండ్
  @జీడిపప్పు:
  చూసారా! మళ్ళీ ఆలోచించారు. కానీ ఏం చేశారు? అందులోనూ వేరేవారి ఆలోచననే అన్వయించారు;

  మహేష్ అంటారు : మార్కెటింగ్ వ్యవస్థ లేదు కాబట్టి, మనం అమ్ముకోలేం అంటాడు; అది నిజమే!కానీ అసలు “అలాంటి” మార్కెటింగ్ వ్యవస్థ మాత్రమే ఉండాలి అనుకోవడంలోనే ఉంది సమస్యంతా! జీడిపప్పు – కిండిల్ అంటారు;బానే ఉంది; కాని దాని సక్సస్ కారణాలు ఆయన పోస్టులోంచే రెండు :1.అది పుస్తకం లాంటి ఫీల్ ఇవ్వటం.2.అందులో చదువుకొను వీలున్న పుస్తకాలు అత్యధికంగా ఉండటం. అలాంటివే వేరే ప్రాడక్ట్స్ లో అంత మెటీరియల్ దొరకక పోవటం.

  సో,ఒకవేళ మెటీరియల్ దొరక్కపోతే, అది కిండిల్ అయినా అందులో జనాలు చదివేది ఇంగ్లీషేగానీ, తెలుగవ్వదు.అలాగే కిండిల్ కొనేవాడు వాడు మాత్రం నిజమైన తెలుగువాడు అవ్వడు.వాడికి తెలుగు నాస్టాల్జియా,లేక అభిమానం అంతే!. ఈ “మెటీరియల్” దొరికేలా ఎవరు చేయగలరో, వాళ్ళు చెప్పే భావాలు తప్పితే, తెలుగులో వేరే భావాలు “పుట్టవు”.

  దానికి కొన్ని కారణాలు వస్తాయి:ఉదా సౌమ్యగారి బ్లాగులో –
  User interface:computers,ipod and conventional mobiles లో ఉన్న ఓ కంక్లుజన్ ఏంటంటే :
  కన్వన్షెనల్ మొబైల్ల్లో వచ్చే క్వరీస్ లో పెద్దగా వైవిధ్యం లేదు కాబట్టి,దాన్ని వైవిద్ధ్యం తగ్గించి, రిచ్ యూజర్ ఎక్స్పీరియన్స్ ఇవ్వటం అని. ఇలా వైవిధ్యం తగ్గించిన మరుక్షణం, పై వర్గాలు మరింత పై పైకి వెళ్తాయి;కింద వర్గాలు మరింత కింద కిందకి వెళ్తాయి.

  “తెలుగులో ఇలాంటి సినిమాలే ఆడతాయి కాబట్టి ఇలాగే సినిమాలు తీయాలి” అనే నిర్ణయానికి ఎవరూ – తెలుగుని అణిచివేయడానికి చూసి చేసే నిర్ణయం కాదండి;ఇది వేరే! ఆలోచనల మీద జరుగుతున్న అప్రెషన్!-Oppression on thought!;అక్కడ్నించి అంతా పతనమే!ఆలోచించే ఒరిజినల్ థాట్స్ అన్నీ ఇంగ్లీషు ప్రపంచం లోనే!

  “సంస్కృతం తెలిసిన బ్రాహ్మణులు తమ అధికార దాహంతో మిగిలిన వారికి ఙ్ఞానం అందనివ్వక అణిచేశారు.”
  ఇదే వాక్యం ఇలా ఐతే:
  “ఇంగ్లీషు వచ్చిన Teleng వర్గాలు తమ అధికార దాహంతో మిగిలిన వారికి ఙ్ఞానం అందనివ్వక అణిచివేశారు.”

  ఏంటి తేడా! రెండు ఒకటేనే! అహా!అలా అనిపించదు.మనం ఎక్కడ కట్టడి చేస్తున్నాం?వాళ్ళు నేర్చుకోవచ్చు?; కానీ ఎక్కడికక్కడ – కిందనుండే వాడికి కొత్త ఆలోచనలు అందకుండా, ముందు మీరు అనుభవించి, సెలక్టివ్ గా మీరు అనువదించి తెలుగువాడికి ఇద్దరుగానిరి. వాడదే వేదం అనుకొని బతుకుతాడు. ఏదో ఓ రోజు లేచి నడ్డి విరగ్గొడతాడు- తిరగబడి;లేదూ నేనెందుకు తెలుగు నేర్చుకోవాలి? నేనూ ఇంగ్లీషే నేర్చుకుంటానంటాడు;నేర్చుకున్నా వాడు పై వర్గం అవ్వడు, అది వేరే విషయం; అలాగే ఈ Teleng అమెరికన్ బానిసత్వం ఏమిటో వాడికీ అర్ధం అవ్వదు.కానీ తెలుగు మాత్రం చచ్చిపోతుంది.అందులో ఇక ఆలోచనలు పుట్టాల్సిన అవసరం లేకుండా!అందులోకి అన్వయించాల్సిన అవసరం లేకుండా!ఆ తరువాత తెలుగు ఓ “సంస్కృతం” ఔతుంది.దాన్ని జీవభాష అనుకుంటే, ఇక నేను చేయగలిగేది ఏమీ లేదు.
  మీరిరువురు నాకు స్పందించ దలచుకుంటే, మీ బ్లాగులోనే చెప్పండి. ప్లీజ్.ఈ మెయిన్ థ్రెడ్ ఇక్కడ ఇలా కంటిన్యూ అవ్వనివ్వండి; ఆ సెపరేట్ థ్రెడ్స్ కి జస్ట్ ఇక్కడ లింకేసేయండి చాలు.ప్లీజ్!

  @మురళీకృష్ణగారు :
  క్షమించండి! నా ఆవేశం ఆపుకోలేక ఈ కామెంటేసేస్తున్నాను.ఇప్పటికైనా వారి ఆలోచనల “బానిసత్వం” వాళ్ళకి తెలుస్తుందేమోనని ఆశతో – ఇదే కాంటెక్స్టులో వేసేస్తున్నాను.

  నా అభ్యర్ధన మన్నించి ఈ పోస్టుల పరంపర వేస్తున్న మీకు నా హృదయపూర్వక ధన్యవాదలు మరోసారి తెలియజేసుకుంటున్నాను. మీరు మీ ప్రవాహంలోనే పోస్టులెయ్యండి.నన్ను క్షమించండి.

  వ్యాఖ్య ద్వారా rayraj — మే 19, 2009 @ 10:54 ఉద. | స్పందించండి

 5. నిజమే మనలో ఈ పుస్తకాలు కొనడం అనే అలవాటు తక్కువ. కొనే అలవాటు వున్నవాళ్ళే పక్కవాళ్ళకు అది అలవాటు చెయ్యచ్చు. కొంచెం కష్టమే కానీ ఆచరణ అసాధ్యం ఏం కాదు. నామటుకు నేనైతే కొనడం, చదవడం అలవాటు లేని మిత్రులకు కూడా గిఫ్టు రూపం లో పుస్తకాలు ఇచ్చేవాడిని. ఈ గ్రీటింగ్ కార్డులు పూల బొకేల బదులు. మెల్లిగా వాళ్ళకు కూడా అదే అలవాటయ్యింది(ఒక నాలుగేళ్ళు పట్టిందనుకోండి). మొదటిది పఠనాభిలాష పెరుగుతుంది. అది మొదలైతే ఆటోమాటిక్ గా కొనుగోలు కూడా పెరుగుతుంది కదా. ఒక పర్సెంట్ పెరిగినా పెరిగినట్టేగా! ట్రై చేసి చూడండి. నాక్కూడా పుస్తకాలు గిఫ్ట్ల రూపంలో రావడం మొదలయ్యాయి. మనమూ ఎంచెక్కా కొత్త పుస్తకాలు చదివెయ్యొచ్చు, ఒక గ్రూప్ ఏర్పాటు అయ్యాక మనలో మనం పుస్తకాలు ఎక్స్చేంజ్ కూడా చేసుకోవచ్చు. నేను తెలుగు పుస్తకాలగురించే మాట్లాడుతున్నా ఇక్కడ. కాకపోతే ఈపధ్ధతిలో ఒక చిన్న సూచన పుస్తకం ఇచ్చే ముందు పక్కవాడి అభిరుచిని బట్టి కామెడీ, మిస్టరీ, ఆధ్యాత్మికం ఇలా తగినట్టు ఇస్తే ఇది తప్పకుండా వర్కవుట్ అయ్యే చాన్స్ వుంది.

  వ్యాఖ్య ద్వారా Ravi — మే 19, 2009 @ 5:43 సా. | స్పందించండి


RSS feed for comments on this post. TrackBack URI

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s

వర్డ్‌ప్రెస్.కామ్‌లో ఓ ఉచిత వెబ్‌సైటు లేదా బ్లాగును సృష్టించుకోండి.

%d bloggers like this: