రాతలు – కోతలు

ఏప్రిల్ 13, 2009

ఏపాట నే రాయనూ!!!

Filed under: neerajanam — కస్తూరి మురళీకృష్ణ @ 4:10 సా.

ఈమధ్య అందరూ బ్లాగుల్లో  సినిమా పాటలు పెట్టేస్తున్నారు. పాటల గురించి వివరిస్తున్నారు. ఈ హఠాన్మార్పుకు ఆశ్చర్యం అకలిగినా ఆనందం కూడా కలిగింది. దాంతో, నేనూ ఏదయినా ఒక పాట గురించి రాయాలని నిశ్చయించుకున్నాను.

ఇప్పుడు వచ్చింది అసలు ప్రశ్న, ఏపాట గురించి రాయాలి? అని.

ఎందుకంటే, నాకు అడుగడుగునా పాటలే కనిపిస్తూంటాయి. ప్రతి నిముషం ఏదో ఒక పాట మదిలో మేదలుతూంటుంది. అనుక్షణం ఏదో గీతం ఎదలో ప్రతిధ్వనిస్తూంటుంది. అలాంటప్పుడు ఏదో ఒక్క పాటను ఎంచుకోవటం ఎలా?

సాధారణంగా, ఏదో ఒక పాట వెంటపడి వదలదు. ఆపాటను పరిచయం చేసేస్తాను. అంతే తప్ప ఇలా పాటను పరిచయంచేయాలని నిశ్చయించుకుని పాటను వెతకటం నాకిదే మొదటి సారి. అందుకని ఏపాటను పరిచయంచేయాలన్న సమస్య మొదతిసారి నాకు కలిగింది.

నేను అలా ఆలోచిస్తూండగానే, చేతులూపుకుంటూ నౌషాద్ వచ్చాడు.

నువ్వు రచయితవు కాబట్టి, గేయ రచయితలకే ప్రాధాన్యం ఇస్తావు. సంగీత దర్శకులను మమ్మల్ని ఎప్పుడఊ పరిచయం చేయలేదు. ఏం? నీదృష్టికి గేయ రచయితలు తప్ప సంగీత దర్శకులు కనబడరా? అన్నాడు.

నేను సమాధానం ఆలోచించేలోగా, బేకస్ పె కరం కీజియే సర్కారెమదీనే, అంటూ లతా గొంతుతో పాడటం మొదలుపెట్టాడు.

నేను ఆశ్చర్యం నుంచి తేరుకునేలోగా, ఒక వైపు నుంచి కళ్యాణ్ జీ ముఖేష్ గొంతుతో, హం కో ఐసా వైసా నా సంఝో హం బడే కాం కీ చీజ్, అంటూ నా ముందుకు దూకాడు.

నేను నోరిప్పేలోగా, ఆనంద్జీ మరో వైపునుంచి, నన్నే సీరియస్ గా చూస్తూ, తెరీ ఆంఖే మజ్బూర్ కరే జీనేకేలియే, జీవన్ సే భరీ, సాగర్ భీ తరస్తే రహతేహై ఫిర్ రూప్ క రస్ పీనేకేలియే, అంటూ వచ్చాడు.

ఆ మాధుర్యం నుంచి నేను తేరుకునేలోగా, కిత్నా హసీన్ హై మౌసం, కిత్నా హసీన్ సఫర్ హై, సాథీ హొ ఖూబ్ సూరత్, యే మౌసం కొ భీ ఖబర్ హై, అంటూ సీ రాంచంద్ర చిరునవ్వుతో వచ్చాడు.

నేను, నా ఆనందాన్ని వ్యక్త పరచేలోగా, ష్యామల్ ష్యామల్ బరన్ కోమల్ కోమల్ చరణ్, అని పాడటం మొదలుపెట్టాడు. అంతటితో ఆగలేదు, జబ్ దిల్ కొ సతావే గం, చేడ్ సఖీ సర్గమూ, అని మాధుర్యాంబుధిలో నన్ను ఓలలాడించాడు సీ రామచంద్ర.

అతడి పాట మాధుర్యం నుంచి తేరుకోనేలేదు, సలీల్ చౌధరీ రంగంలోకి దూకాడు.

ఆజారే మైతొ కబ్ సే ఖడీ ఇస్ పార్ యె అఖియా, థక్ గయి  పంఖ్ నిహార్ అని పాడాడు.

నేను వహ్వా అనేలోగా, బాణీ మార్చి, జానె మన్ జానెమన్ తెరే దో నయన్ చోరి చోరి లేకెగయె దెఖొ మేర మన్ , అని ఉర్రూతలూగించాడు.

నేను తేరుకునేలోగా, కహీ దూర్ జబ్ డిన్ ఢల్ జాయే సాంఝ్ కి దుళన్ బదన్ చురాయే చుప్కేసే ఆయే, మెరే ఖయాలోంకే ఆంగన్ మే కొయి సప్నోంకా దీప్ జలాయే, అన్నాడు.

ఇంతలో ఈ వైపునుంచి, ఆప్కే నజ్రోమ్నే సంఝా ప్యార్ కే కాబిల్ ముఝే, దిల్ కి ఏయ్ దఢ్కన్ ఠహెర్జా మిల్గయీ మంజిల్ ముఝే, అంటూ మదన్ మోహన్ మెలోడీ నడకలతో వచ్చాడు.

ఆ మాధుర్యం పరవశుడిని చేసింది.మళ్ళీ, తుంజో మిల్గయేహో, తొ యే లగ్తాహై కె జహా మిల్గయా, అన్నాడు.

ఇంతలో ఢోలక్ మోగిస్తూ ఓపీ నయ్యర్ వచ్చాడు, బహుత్ షుక్రియా బడీ మెహెర్ బానీ, మెరీ జిందగీమే హుజూర్ ఆప్ ఆయే అంటూ. ఆ రిథం కి ఊగిపోతూనేవున్నాను, గతి మార్చి, బాబూజీ ధీరే చల్నా, ప్యార్ మే జర సంభల్నా, అన్నాడు.

నాకయితే పిచ్చిపట్టినట్టుంది.

దీవాన హువా బాదల్ పాడాడు.

ఇంతలో పాము సంగీతం వాయిస్తూ, హేమంత్ కుమార్ వచ్చాడు.
మన్ డోలే, మెర తన్ డోలే, మెరె దిల్కా గయా కరార్ రే కౌన్ బజాయే బాసురియా…..నా మనసు తనువూ వూగిపోయాయి.

బేకరార్ కర్కె హమే యూనజాయియే, ఆప్కో హమారి కసం లౌట్ ఆయియే అనాలనుకున్నాను. తుం పుకార్లో, అనుకుంటూ వెళ్ళిపోయాడు.

దూర్ రహ కర్ న కరో బాత్ కరీబ్ ఆజావో, అంటూ సీ అర్జున్ వచ్చాడు. ఇంకా తేరుకోని నన్ను చూసి, జాగ్ దిలెదీవాన రుత్ జాగీ అన్నాడు.

జాదూ తరి నజర్, ఖుష్బూ తేరాబదన్ అంటూ షివ్ హరి లు వచ్చేశారు. అప్పుడే మీరొచ్చారేమిటి అనేలోగా, యేకహా ఆగయేహుం యూహి సాథ్ సాథ్ చల్తే, అని చెట్టాపట్టాలు వేసుకుని వెళ్ళిపోయారు.

పల్ దో పల్ కా సాథ్ హమారా, పల్ దో పల్ కా యారానేహై అంటూ వచ్చిన ఆర్డీ బర్మ, హఠాతుగా, బీబా తరతరతర అని గావుకేక పెట్టాడు. ఉలిక్కిపడ్డాను. కుచ్ నా కహో, కుచ్ భీ నా కహో అన్నాడు.

ఎందుకో అనుకున్నాను. సున్ మెరే బంధూరే సున్ మెరే మిత్వా, సున్ మెరే సాథీరే, అంటూ ఎస్డీ బర్మన్ వచ్చాడు. అతని వెంట ఎన్నిపాటలు వచ్చాయనుకున్నారు. ఆకాశంలో మేఘాలు చిత్రవిచిత్రాకృతులతో విన్యాసాలు చేసినట్టు ఆయన బాణీలు మధురమయిన గాన లహరులను సృజించాయి.

ఇది సరిపోదన్నట్టు, యె దిల్ ఔర్ ఉంకీ నిగాహోంకె సాయే అంటూ జయదేవ్ వచ్చాడు. అహా, అనేలోగా, తూ చందా, మై చాందినీ తూ తరువర్ మ్య్ షాఖ్ రే అనిపాడాడు. అంతలో ఏమనిపించిందో, సీనేమే జలన్, ఆంఖోమే తూఫాన్ స క్యూన్ హై, ఇస్ షహర్ మె హర్ షక్స్ పరేషాన్ స క్యూన్ హై, అని, జబ్ గమే ఇష్క్ సతాతాహై తొ హస్ లేతాహూ అనుకుంటూ వెళ్ళిపోయాడు.

ఇంతలో తాల్ మిలే నదీకె జల్మే, నదీ మిలే సాగర్ మే అంటూ రోషన్ వచ్చాడు. రోషన్ వెనకనే, మై హార్ట్ ఈస్ బీటింగ్ అంటూ రాజేష్ రోషన్ వచ్చాడు. అది చూసి, మిలేన ఫూల్ తొ కాంటోసె దోస్తీ కర్లీ అనుకుంటూ రోషన్ జారుకున్నాడు.

చాహూంగ మై తుఝె సాంఝ్ సవేరే, ఫిర్ భి కభీ అబ్ నాంకొ తెరె ఆవాజ్ మైన దూంగా అంటూ లక్ష్మీకాంత్ వచ్చాడు.అతనివెనకే, బిజ్లీ గిరానే మయ్హూ ఆయీ కహతేహై ముఝ్కో హవ హవాయీ అంటూ ప్యారేలాల్ వచ్చాడు. ఇద్దరూ కలసి, ఎక్ ప్యార్ క నగ్మాహై, మౌజోంకీ రవానీహై, జిందగీ ఔర్ కుచ్ భి నహీ, తేరి మేరి కహానీహై అనుకుంటూ వెళ్ళిపోయారు.

వారి వెనక చూసిన నా కళ్ళు తిరిగాయి. ఎందరో, ఎందరెందరో కళాకారులు బారులు తీరివున్నారు. నన్ను ఆనందింపచేసేందుకు తమ సుమధుర సంగీత రాగాలాలాపిస్తూన్నారు. వీరిలో ఎవరిని ఎంచుకోను. ఏపాటనేపాడను, అనుకుంటూంటే,

ఆవారాహూ, ఊం ఊం, అని అకార్డియన్ వాయిస్తూ శంకర్ వచ్చాడు. జిందగీ ఎక్ సఫర్ హై సుహానా అంటూ జైకిషన్ వచ్చాడు.

వాళ్ళిదారూ కలసి, హర్ దిల్ జో ప్యార్ కరేగా వో గానాగాయేగా, దీవానా సైకడోమె పహెచానాజాయేగా అనిపాడుతున్నారు.

నిజం, ఈ మహా సంగీత సాగరంలోంచి ఒక్క పాటనేరుకోవాలనుకున్న నేను దీవానానేకదా.

అందుకే, దీవానా ముఝ్స నహీ ఇస్ అంబర్ కే నీచే, ఆగే హై కాతిల్ మేరా ఔర్ మై పీచేపీచే, అని పాడుతూ వారిని అనుసరించాను.

చలేజా చలేజా చలేజా జహ ప్యార్ మిలే అంటూ వారు సాగిపోయారు.

ఎహెసాన్ మెరే దిల్కె తుమ్హారాహై దోస్తో, యే దిల్ తుమ్హార ప్యార్ క మారాహై దోస్తో వారివెంటే నేనూ పాటనయిపోయాను.

ప్రకటనలు

8 వ్యాఖ్యలు »

 1. Aren’t there any telugu songs
  or you don’t know telugu

  వ్యాఖ్య ద్వారా raman — ఏప్రిల్ 13, 2009 @ 11:01 సా. | స్పందించండి

 2. అబ్బ నీ తీయనీ దెబ్బ
  ఎంత కమ్మగా వుందిరో యబ్బ

  వ్యాఖ్య ద్వారా కస్తూరి మురళీకృష్ణ — ఏప్రిల్ 14, 2009 @ 12:49 ఉద. | స్పందించండి

 3. మీరు గొప్ప భావుకులు. ఇంతకు ముందు హిందీ పాటల్ని పరిచయం చేసినప్పుడే ఆ విషయం తెలిసింది. వాటిని నేను ప్రింట్స్ తీసి దాచుకున్ననంటే నమ్ముతారా? తెలుగు కంటే హిందీ కవుల్లో భావుకత ఎక్కువ.అందుకనే మీరు హిందీ పాటల గురించి రాస్తారనుకుంటాను. కానీ తెలుగులో మీకు నచ్చే పాటలే లేవా? మంచి తెలుగు పాటల్ని కూడా విశ్లేషిస్తూ పరిచయం చేయొచ్చు కదండి మురళీ కృష్ణ గారూ!

  వ్యాఖ్య ద్వారా సుజాత — ఏప్రిల్ 14, 2009 @ 2:26 ఉద. | స్పందించండి

 4. emandi sujatha gaaru…….mana valla prsakti lekundaaa hindi vaallanu praise cheyalera……….enduku compare chestaru meeku ala anipinchinata maatra andariki ala anipinchalani rool leduga…………..

  వ్యాఖ్య ద్వారా vinay chakravarthi — ఏప్రిల్ 14, 2009 @ 3:45 ఉద. | స్పందించండి

 5. హిందీ పాటల్ని తెలుగు లిపిలో చదవలేక చచ్చాను. ఏమి పాటలో..ఏమి పాట్లో!

  వ్యాఖ్య ద్వారా కె.మహేష్ కుమార్ — ఏప్రిల్ 14, 2009 @ 6:23 ఉద. | స్పందించండి

 6. ఎన్ని మంచి పాటలు !!! మీ పోష్టు చదువుతుంటే, ప్రతి పాటకు లత, రఫీ, ముఖేష్.. ఇలా అందరూ నా వెనకాల నిలబడి పాడుతున్నట్టుగా ఉండింది. thanks for making me remember these songs !!!

  వ్యాఖ్య ద్వారా Pradeep — ఏప్రిల్ 14, 2009 @ 7:28 ఉద. | స్పందించండి

 7. వినయ్ చక్రవర్తి గారు,
  నాకు అనిపించింది నేను చెప్పాను. నా కామెంట్ లో ఉండేది నా అభిప్రాయమేగా! మీ అందరినీ నేనెక్కడ రిప్రజెంట్ చేసాను?

  మహేష్ గారు,
  నాకు హిందీ చదవటం సరిగా రాదు.మాట్లాడ్డం వస్తుంది గానీ! హిందీలో రాస్తే (తెలుగు బ్లాగులో) మాలాంటి వారి పరిస్తితి ఏమిటి?

  వ్యాఖ్య ద్వారా సుజాత — ఏప్రిల్ 14, 2009 @ 7:45 ఉద. | స్పందించండి

 8. బాగుంది, మీ పాటల పరిచయం

  వ్యాఖ్య ద్వారా సూర్యుడు — ఏప్రిల్ 14, 2009 @ 8:22 ఉద. | స్పందించండి


RSS feed for comments on this post. TrackBack URI

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

వర్డ్‌ప్రెస్.కామ్‌లో బ్లాగండి.

%d bloggers like this: