రాతలు – కోతలు

మార్చి 12, 2009

జాషువా ఖండ కావ్యాలు-2

Filed under: పుస్తక పరిచయము — కస్తూరి మురళీకృష్ణ @ 2:21 సా.
Tags: ,

జాషువ ఖండ కావ్యాల సంకలనములో ఒక పెద్ద లోపమేమిటంటే, ఖండ కావ్యాలకు జాషువా రాసిన ముందుమాటల కాలాన్ని తెలపలేదు. ఈ ముందుమాటలలో రాను రాను భాష మారుతుంది. రచయిత మూడు మారుతుంది. తొలి ఖండ కావ్యానికి రాసిన ముందు మాటలోని ఆశాభావము రాను రాను సన్నగిల్లుతుంది. ముందుమాటలు ఎప్పుడు రాసినవో తెలిసివుంటే బాగుండేది.

అయితే, అన్ని ముందుమాటలలో ధనాభావంతో రచయిత బాధపడటము, దాతల అనుగ్రహంతో పుస్తకము అచ్చు కావటము మాత్రం మారదు.

సమకాలీనుల వాత్సల్యానికి గురవటం పట్ల కృతఙ్నతలు వ్యక్త పరచికొంటూ  ఇది ” ధనాభావమున నిరంతరము కుమిలిపోవు నా యాత్మకూరట కల్పించుకొనుచుందును” అంటాడు.

మొదటి ఖండానికి ముందుమాటలో ఇతరులు తన పద్యాలు, భావాలు వాడుకుంటున్నారని బాధపడతాడు కవి.

రెండో ఖండానికి ముందుమాటలో ” ఈ ఇరువదవ శతాబ్దమున కనులు తెరచిన నవయువకులీ కబ్బపుందు పానునబడి కలవరపడుచున్నారు.ప్రామాణ్యమేదని ప్రశ్నించుచున్నారు” అని బాధపడతాడు.

కావ్యాలు చదివే శక్తి సన్నగిల్లుతోందన్న బాధ నాలుగో ఖండిక ముందు మాటకు వచ్చేసరికి తన గీతాలు నిరాశాగీతాలయ్యాయని చెప్తూ, ” కులమతాల బురఖాలతో దుష్ట శక్తులు స్వేచ్చా విహారం చేస్తున్నాయి. సత్యాగ్రహ కాలం నాటి త్యాగదృష్టి, నిజాయితే, పరస్పర విశ్వాసం, సంఘీభావం మృగ్యమయింది” అంటూ సమాజంలో వస్తూన్న మార్పుల పట్ల ఆవేదన వ్యక్తపరుస్తాడు.

అయిదో ఖండానికి ముందుమాటలో నైరాశ్యం కన్నా ఆవేశం కనిపిస్తుంది. ” కవులకిది పరీఖాయుగం” అని ప్రకటించి ” హింసిత ప్రజల మూకీ భాష్పాలకు నోరిచ్చి రచ్చకెక్కించాలి కవి” అని ప్రకటించి ” దేశం చిమ్ముతూన్న కన్నీటి చెమ్మలే ఈ కావ్యం” అంటారు జాషువా.

ఇలా ఒకో ముందుమాటలో కవి మనసులోని మాటలు ,వేదనలు, నిరాశలు, ఆనందాలు మనకు తెలుస్తూంటాయి. గ్రంథ ప్రచురణ కాలం కనక తెలిస్తే పాఠకుడికి కవి మరింతగా అర్ధమయ్యేవాడు. కవి వేదనకు కారణాలూ బోధపడేవి.

ఎందుకనో, విశాలాంధ్ర సంపాదకులు ఈ ప్రాముఖ్యమయిన అంశాన్ని విస్మరించారు. ఎంతయినా మన భారతీయులకు తారీఖులంటే చిన్న చూపే కదా!

ముందుమాటల పరామర్శ అయిపోయింది. ఇక తిన్నగా జాషువా సృజించిన అమృత రస ప్రవాహంలోకి అడుగుపెట్టటమే మిగిలివుంది.

ప్రకటనలు

వ్యాఖ్యానించండి »

ఇంకా వ్యాఖ్యలు లేవు.

RSS feed for comments on this post. TrackBack URI

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

వర్డ్‌ప్రెస్.కామ్‌లో ఓ ఉచిత వెబ్‌సైటు లేదా బ్లాగును సృష్టించుకోండి.

%d bloggers like this: