రాతలు – కోతలు

జనవరి 21, 2009

బ్రహ్మ బుధ్ అవార్డు సినిమాలు చూశాడు-2

Filed under: సినెమా రివ్యూ — కస్తూరి మురళీకృష్ణ @ 2:42 సా.

అవార్డు సినిమా అంటే అవార్డులు వచ్చిన సినిమానే కదా? అడిగాడు, బ్రహ్మబుధ్.

తల వూపాను.

సినిమాలో నటుదికి అవార్డు వచ్చినా అది అవార్డు సినిమానేకదా? మళ్ళీ అడిగాడు.

తల కాస్త గట్టిగా వూపాను.

అవార్డు సినిమా అంటే ఇతర సినిమాలకన్నా గొప్పగా వున్నట్టే కదా? అడిగాడు.

తల గట్టి గట్టిగా వూపాను.

ఒక సిన్మాలో నటుడికి ఉత్తమ నటుడి అవార్డు వచ్చిందంటే అర్ధం, ఆ సంవత్సరం సినిమాలలో నటించిన నటులందరి నటనలో ఈ నటుడు ఉత్తమ నటన చేసినట్టే కదా? అడిగాడు కాస్త సీరియస్ గా.

బ్రహ్మబుధ్ ప్రశ్నలు ఏవైపు వెళ్తున్నాయో నాకు అర్ధం కావటంలేదు. కానీ, తల గట్టి గట్టి గట్టిగా వూపక తప్పలేదు.

నేను తల ఎంత గట్టిగా వూపుతూంటే బ్రహ్మబుధ్ అంత సీరియస్ గా చూస్తున్నాడు.

నేను ఈ సంవత్సరం ఉత్తమ నటుడి సినిమా చూశాను. అన్నాడు.

ఎవరానటుడు ఏమా సినిమా అనడిగాను.

అది తరువాత, ముందు నాకిది చెప్పు. ఒక నటుడు ఒక సినిమాలో ఒక వేషం వేస్తాడు. ఇంకో నటుడు ఇంకో సినిమాలో ఇంకేదో వేశం వేస్తాడు. ఇద్దరు వేర్వేరు వేషాలు వేసినప్పుడు, ఇద్దరి వేషాల మధ్య సారూప్యత లేనప్పుదు, నటనలను ఎలా పోలుస్తారు? ఒకే రకమయిన విషయాలను పోల్చవచ్చు. విభిన్నమయిన నటనలను ఎలా పోల్చి, తేలుస్తావు? అడిగాడు.

చేతులు జోడించాను. బాబూ, మేము మనుషులము. ఏదో అధికారానికి తలవంచటం అలవాటయి, ఎవరేది చెప్తే అదే నిజమని నమ్ముతూ బ్రతుకుతున్నవాళ్ళం. నువ్వీ ప్రశ్నలతో నన్ను చంపకు. నువ్వు ప్రశ్నలడగటం కన్నా, సినిమా కథలు చెప్పటమే బాగుంది. చెప్పు నువ్వు చూసిన ఉత్తమ నటుడి సినిమా గురించి, అనడిగా.

నేను సినిమా కథ చెప్పను. నటుడి నటన చెప్తాను. ఎందుకంటే నాకు ఆ నటుడి నటన అద్భుతంగా నచ్చింది, అన్నాడు.

నాకు ధైర్యం వచ్చింది. చూశావా, ఏదో లేకపోతే వుట్టిగా అవార్డ్ రాదు, అని అన్నాను.

కానీ….ఈ సినిమాలో ఈ నటుడి లాంటి నటన, మరే సినిమాలో మరే నటుడు చేయలేదు. ఎంత గొప్ప నటన అనుకున్నావు.కంప్యూటర్ గురించి ఏమీ తెలియనివాడిలా కంప్యూటర్ ని పాడు చేసిన సంఘటనలో, వెర్రిని ముఖంలో ఎంత బాగా చూపాడో తెలుసా. రాత్రంతా కష్టపడి కంప్యూటర్ ని బాగు చేసి తెల్లారే సరికల్లా, అందరూ ఆఫీసుకు వచ్చేలోగా, పని పూర్తిచేసిన నటన ఎంతో గొప్పగావుంది. అబ్బ, నాయికను చూసే చూపుల్లో ఇంకేంతో గొప్పనటన వుంది. ఆతరువాత, నాయిక తనను ప్రేమించనని అన్నప్పుడు, ఆవేశంగా, నాయికను తిట్టి, ఆసిడ్ పోస్తా నని బెదిరించే సన్నివేశంలో జీవించాడు. మరి ఇంత గొప్పగా నటిస్తే, యువకులు అతడి ప్రభావానికి గురయి ప్రేమించనన్న ఆడపిల్లలమీద ఆసిడ్ పోస్తే మీరెందుకు గోల చేస్తారు? హీరోవీరుడని అవార్డివ్వచ్చుగా?

ఏమనాలో తోచలేదు.

ఇంక నాయిక నాయకుడి తండ్రి చెంప మీద కొట్టినప్పుడు, మన హీరో వీరుడి పళ్ళు పటపటలాడటం ఎంత గొప్పగా చూపాడో!
అదికాదుకానీ, తండ్రి కొడుకులు కలసి తాగిన దృష్యంలో నటన సూపెర్. తరువాత తండ్రి చనిపోతే, ఏమీ తోచనట్టు మిత్రులను పిలిచి ఎడ్డిగా నటిస్తాడు చూడూ, నవ్వాపుకోలేక చచ్చా. ఆతరువాత సీన్లో అయితే, ఫ్రెండ్స్ అన్నం తినిపించినప్పుడు, అన్నాన్ని ఎంత గొప్పగా నమిలేడనుకున్నావు. అన్నం తిననని తింటూంటే ఆ గొప్ప నటనకు నవ్వాగలేదనుకో.

తండ్రి చచ్చిన సీనులో నటనకు నవ్వొస్తే గొప్ప నటనా? అన్నమట నోటిదాకా వచ్చింది. కానీ అనుభవం నాకు మౌనంగా వుండటం నేర్పింది.

ఇప్పటిమటుకూ నటన ఒక ఎత్తూ, ఫ్రెండుతో రైల్లో వెళ్తూ, ప్రేమించిన అమ్మాయిని చూసి వెళ్ళిపోతాననటం, ఆపై పాట పాడటం, స్థిర నిశయంలేని, చంచల మనసూను చూపించేశాడనుకో.

పల్లెటూళ్ళో నటనయితే సూపెర్. నాకు అన్నిటికన్నా నచ్చింది, తెల్లారే బహిర్భూమికి వెళ్ళి, నీళ్ళు లేకపోతే, ఆకుతో తుడుచుకోవాల్సి వచ్చినప్పుడు, ముఖం ఎంత బాగా పెట్టాడో తెలుసా. ఆ ముఖం చూస్తేచాలు జరిగేది తెలిసిపోతుంది. ఈ సీనులో, నిద్ర ఆపుకోలేక అలా కూచునే నిద్రపోతాడు. ప్రొద్దున్న ఆడవాళ్ళు వచ్చి చూస్తే సిగ్గుతో పరుగెత్తుతాడు. అలా కూచునే, తుడుచుకోకుండా, కడుక్కోకుండా, నిద్రపోయే ద్రుష్యంలో నటనకే అవార్డిచ్చుంటారు. నేనయితే, ఆ సీనుకే వోటేస్తాను. ఎంత నాచురల్గా నటించాడనుకున్నావు….

నేనిక వినలేకపోయాను. కక్కోసుకువెళ్ళే సీనులో, కడుక్కోకుండా కూచుని నిద్రపోవటంలో గూప నటన చూసిన బ్రహ్మబుధ్ ని ఏమనాలో తెలియటంలేదు.

బాబూ, తెలుగు అవార్డు వదిలేయి. ఇంగ్లీషు అవార్డు సినిమా గురించి చెప్పు, అని దీనంగా బ్రతిమిలాడుకున్నా.

కరుణించాడు. హాలీవుడ్ అవార్డు సినిమా గురించి చెప్పటం ఆరంభించాడు.

అది రేపు. alien-45alien-46alien-47

ప్రకటనలు

2 వ్యాఖ్యలు »

  1. హ హ…బ్రహ్మ బుధ్ మాటలకు అర్ధాలే వేరులే

    వ్యాఖ్య ద్వారా radhika — జనవరి 21, 2009 @ 8:20 సా. | స్పందించండి

  2. బ్రహ్మ బుధ్ చెప్పే సినిమా కబుర్లు నిజంగా స్పెషల్!

    వ్యాఖ్య ద్వారా కె.మహేష్ కుమార్ — జనవరి 22, 2009 @ 4:52 ఉద. | స్పందించండి


RSS feed for comments on this post. TrackBack URI

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

వర్డ్‌ప్రెస్.కామ్‌లో ఓ ఉచిత వెబ్‌సైటు లేదా బ్లాగును సృష్టించుకోండి.

%d bloggers like this: