రాతలు – కోతలు

జనవరి 20, 2009

బ్రహ్మ బుధ్ అవార్డు సినిమా చూశాడు-1

Filed under: sinemaa vishleashaNaa. — కస్తూరి మురళీకృష్ణ @ 2:44 సా.

ఎప్పుడూ మాస్ సినిమాలు చూస్తే మాసులో మాసయిపోతావు, కాబట్టి అప్పుడప్పుడు అవార్డు సినిమాలు చూడమని నా ఖర్మతోపాటూ సర్వం కాలి ఓ పిచ్చి సలహా ఇచ్చాను. చేసుకున్న వారికి చేసుకున్నంత మహదేవా అన్నట్టు, చేసిన కర్మము చెడని పదార్ధము, వదలదు నిన్నెప్పుడూ అన్నట్టు, ఉచిత సలహా ఇచ్చినందుకు అనుభవించక తప్పటం లేదు.
alien-21
నేను ఆ సలహా ఇచ్చినప్పుదు, బ్రహ్మబుధ్ నన్నో ప్రశ్న అడిగాడు.
అవార్డు సినిమాలంటేఅ ఏమిటి? అని.

బుద్ధిల్;ఏక వివరించాను.
అవార్డు సినిమాలంటే ఉన్న సినిమాలలోకీ అత్యుత్తమముగా భావించిన సినిమాలు, అన్నాను.

ఏవిషయములో అత్యుత్తమము? అడిగాడు.

సినిమా అనేది ఒక కళ. ఒక కళకాదు, అనేక కళల కలయిక. కాబట్టి, నటనలో ఉత్తమ నటన చూపిన హీరోకు, హీరోయిన్ కూ, విలన్ కూ, జోకర్ కూ, సహాయ నటీ నటులకు, సంగీతానికి, పాడినావాళ్ళకు, నేపధ్యసంగీతానికి, స్క్రిప్టుకు, మాటలకు, ఎడిటింగ్ కూ, దర్శకత్వానికి, ఓలు మొత్తంగా సినిమాకూ…..

ఆయసం వచ్చి ఆగాను. కానీ బ్రహ్మబుధ్ ముఖం చూసిన తరువాత నానోట మాట రాలేదు.

విచిత్రంగా చూస్తున్నాడు నావైపు.

ఏమిటి? అడిగాను గొంతు తడారిపోతూంటే.alien-41

అన్ని అవార్డులు చూసిన వారికేనా?

సినిమాను విమర్శించిన క్రిటిక్ లకు కూడా……

అన్ని అవార్డులు సినిమాను చూసిన వారికీ, క్రిటిక్కులకేనా…
చూసిన వారికి లేవా? అరిచాడు.

లక్షలాది ప్రజలు చూస్తారు. ఎవరికని అవార్డిస్తారు.

ఇదన్యాయం. అన్నాడు. చాలా సేపు మౌనంగా వున్నాడు. మరి ఈ అవార్డులు ఎవరిస్తారు? ఎవరు నిర్ణయిస్తారు? అడిగాడు.

కొందరు నిపుణులుంటారు. ఇంకొందరు నిపుణులు సినీఅలలొంచి, వారికి ఉత్తమమయిన వారిని నామినేట్ చేస్తారు. అలా నామినేట్ అయిన వారి కళను పరిశీలించి నిర్ణయిస్తారు. చెప్పాను.

తలాడించాడు. ఎవరి కళ ఉత్తమమో నిర్ణయించటానికి, నిర్ణయించేవారెవరు ఉత్తములో ఎవరు నిర్ణయిస్తారు. దానికి కొలబద్దలు ఏమిటి? కళలో ఉత్తమము, అధమము నిర్ణయించటానికి కొలబద్దలేమిటి? కొలబద్దలకు కొలబద్దలు నిర్ణయంచేదెవరు? ఆ కొలబద్దలు సరయినవేనని నిరూపించేదెవరు? ఇప్పుడు ఉత్తమంగా అనిపించినది రేపు ఉత్తమము కాకపోవచ్చు. అప్పుడెలాగ? ఇలా అరగంట అనర్గళంగా అడ్డూ అదుపూ లేకుండా ఏవేవో సందేహాలడిగాడు. ఆప్రవాహ ధాటికి వాడడిగినవి సగం మరచిపోయాను.
alien-22
అన్ని ప్రశ్నలడిగితే సమాధానాలివటానికి సమయం సరిపోదు. అయినా, సందేహించేవాడు, ఏమీ నేర్వడు అంటుంది మా శాస్త్రం, కాబట్టి ముందు కొన్ని అవార్డు సినిమాలు చూడు, తరువాత మాట్లాడుకుందాం. అన్నాను.

సరే, అవార్డు సినిమాలు చూస్తా కానీ, అవార్డులిచ్చేవారిని కూడా ప్రజలు వోట్లేసి ఎంచుకుంటారా? ఉత్తమ సినిమాలను కూడా ప్రజలు వోట్లేసి ఎంచుకుంటారా? అయినా, ప్రజలు డబ్బులుపెట్టి ఏ సినిమాను అధిక సంఖ్యలో చూస్తారో అదే ఉత్తమ సినిమా ఎక్కువ వోట్లు వచ్చినట్టుకదా? లేక, ప్రజలు ఉత్తమమూ, అధమమూ నిర్ణయించుకోలేరా? అది నిర్ణయించేదెవరు? మరి, ఇంత మంది బాగుందని చెప్పిన తరువాత, కాదన్న వాడు, తనకు కళ గురించి సామాన్యుల కన్నా ఎక్కువ తెలుసని నిరూపించుకుంటాడా? నాకు నచ్చిన సినిమా నీకు నచ్చకపోవచ్చు. అలాంటప్పుడు, నామినేట్ చేసిన సభ్యులకు నచ్చిన సినిమానే ఉత్తమమని ఎలా ఒప్పుకుంటాము? ఇలా ఎవేవో ప్రశనలు అడగటం మొదలు పెట్టాడు.
alien-3
నేను పొర్లి, పొర్లి దణ్ణాలు పెట్టాను. శాంతించి, ఏమిటీ గోలా? అన్నట్టు చూశాఅడు.

బాబూ, అవార్డు సినిమా చూసిరా, మాట్లాడుకుందాము, అన్నాను, జాలిగా.

ఏకళన వున్నాడో మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. రాత్రి నేను గాఢ నిద్రలో వుండగా, మెదడు చీల్చుకుని వచ్చి తిష్టవేశాడు.

ఏమయింది? అనడిగా.alien-5

రెండు అవార్డు సినిమాలు చూశా. ఒకటి తెలుగు, రెండు ఇంగ్లీషు అన్నాడు, నన్ను చంపేసేట్టు చూస్తూ.

నా ప్రాణాలు, అంతరిక్షంలో, బహుశా, బుధ గ్రహం దాకా వెళ్ళి వచ్చివుంటాయి. ఎలావున్నాయి? భయాన్ని అణచుకుంటూ అడిగా.

ముందు తెలుగు చెప్పాలా? ఇంగ్లీషు చెప్పాలా?

మేక మెడ కోసేముందు, కత్తితో, కోస్తూ చంపాలా, నెళ్ళలో ఉడకబెట్టి చంపాలా, అని అడిగినట్టు అడిగాడు.
alien-31
తెలుగు ముందు చెప్పు, అన్నాను. పెద్దలు చెడు వార్త ముందు వినేస్తే, మంచి వార్త తరువాత వినవచ్చు అంటారు. రెండూ చెడు వార్తలే అనిపిస్తున్నప్పుడు, ఎక్కువ చెడు ముందు వినేయమన్నారు. అందుకే, తెలుగు అవార్డు సినిమా గురించి ముందు చెప్పు, అన్నాను.

చెప్పటం ఆరంభించాడు బ్రహ్మ బుధ్.

అదేమిటో తెలుసుకోవాలంటే రేపటి దాకా ఆగాలి.

alien-42alien-43

ప్రకటనలు

3 వ్యాఖ్యలు »

  1. మీ సమీక్ష బాగుంది

    వ్యాఖ్య ద్వారా padma — జనవరి 20, 2009 @ 3:46 సా. | స్పందించండి

  2. బాగుంది.

    వ్యాఖ్య ద్వారా chavakiran — జనవరి 20, 2009 @ 4:17 సా. | స్పందించండి

  3. చివరికి నేనెలా తయారయ్యానంటే ఏదైనా సినిమా థియేటర్ కెళ్ళి చూస్తున్నా, టీవీలో చూస్తున్నా ” ఈ సినిమా బ్రహ్మబుదు చూస్తే ఏమంటాడో! జోస్యుల అయితే దీనికి రివ్యూ ఎలా రాస్తారో “అని ఆలోచిస్తున్నా!

    వ్యాఖ్య ద్వారా సుజాత — జనవరి 20, 2009 @ 4:37 సా. | స్పందించండి


RSS feed for comments on this post. TrackBack URI

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

వర్డ్‌ప్రెస్.కామ్‌లో బ్లాగండి.

%d bloggers like this: