రాతలు – కోతలు

నవంబర్ 6, 2008

నేను చదివిన మంచి పుస్తకం-14

Filed under: pustaka paricayamu — కస్తూరి మురళీకృష్ణ @ 2:28 సా.

స్వీయ జీవిత చరిత్రలు సాహిత్య పరంగానేకాదు, సామాజికంగా కూడా ప్రత్యేక స్థానాన్ని ఆక్రమిస్తాయి. ఒక వ్యక్తి ఎదుగుదల, మానసిక సంఘర్షణలతో పాటుగా ఆనాటి సామాజిక స్థితిగతులు, ఆచార వ్యవహారాలు, ప్రజల జీవన విధానాలు, మనస్తత్వాలూ మనకు పరిచయమవుతాయి. ఒక రకంగా చూస్తే, గతించిన ప్రపంచం తాలూకు ఘనీభవించిన అక్షర చిత్రాలు స్వీయ జీవిత చరిత్రలు.

ఏ వ్యక్తి కూడా తన చుట్టూ వున్న సమాజానికి స్పందిస్తాడు. అతడి పైన ఆ సమాజిక పరిస్థితుల ప్రభావం వుంటుంది. దాంతో స్వీయ జీవిత చరిత్రలు ఒక చారిత్రిక ప్రయోజనాన్ని కూడా సంతరించుకుంటాయి.

మన దేశంలో అనేక కారణాల వల్ల స్వీయ జీవిత చరిత్రలకు ఆదరణకరువు. గొప్ప నాయకులు, నటులు, ప్రముఖులు సైతం జీవిత చరిత్ర రాత పైన అంతగా ఉత్సాహం చూపరు. మన రాజకీయ నాయకులు కూడా జీవిత చరిత్రల రచన తమ రాజకీయ సోపాన అధిరోహణకు తోడ్పడే అమ్షంగా భావించరు. దాంతో జీవిత చరిత్రల రచన వ్యాపారంగా కాస్త ఎదిగినా స్వీయ జీవిత చరిత్ర రచన చాలా వెనుకపడిందనే చెప్పాలి. ఈ నేపధ్యంలో చూస్తే సుధా కౌల్ రచించిన the tiger ladies అత్యంత ప్రాధాన్యాన్ని సంతరించుకుంటుంది.

సుధా కౌల్ స్వాతంత్ర్యం వచ్చిన సంవత్సరంలో జన్మించింది. అంటే, ఇంకా కాష్మీర్ తీవ్రవాదుల క్రూర కరాళ నృత్య హేలావిలాసాలకాలవాలం కాకముందే అత్యంత సుందర ప్రదేశంలో అతి ప్రశాంతమయిన జీవితం అనుభవించిందన్నమాట. ఆమె బాల్యం, యవ్వనాలు కాష్మీర్ లోనే గడిచాయి. ఈ పుస్తకంలో అత్యంత ఆసక్తి కరమయిన భాగాలివి. మనకు అస్సలు పరిచయం లేని జీవన విధానం కనిపిస్తుంది. హిందూ, ముస్లీములు కలసి కట్టుగా కలసిపోయి సాగించే జీవన విధానం కనిపిస్తుంది. కాశ్మీర్ ఇస్లామీయులకేకాదు. పండితులకు కూడా జన్మ భూమి. ఇస్లామీయులకెలా కాశ్మీర్ తల్లియో, పండితులకూ అంతే. కానీ రాజకీయాలు ఎలా వారి జీవితాలను చిన్న భిన్నం చేశాయో ఈ పుస్తకంలో అతి సున్నితంగా రచయిత్రి చూపుతుంది.

we still enjoy being together, its the habit since the beginning of time, but for the first time we treat each other wearily. we donot discuss politics at all, and we are careful, we want to avoid any friction. god forbid i should have to choose between you and my child if there is a riot, i would naturally choose my child as you would

ఇది ఇంకా తీవ్ర వాదం కాశ్మీర్ లోయలో అడుగుపెట్టక ముందరి పరిస్థితి. అప్పటికి నిరసనలు మత కల్లోలాల రూపంలోనే వ్యక్త మయ్యేవి. కానీ నెమ్మదిగా పరిస్థితి మారింది. మత మౌడ్యం హింస రూపం దాల్చింది. కానీ అప్పటికి సుధా కౌల్ పెళ్ళి చేసుకుని అమెరికా చేరుకుంది.

కాశ్మీర్ ఎంత సుందర ప్రదేశమంటే ఒక్క సారి అడుగుపెట్టిన వారుకూడా జీవితాంతం మరచిపోలేరు. అటువంటిది అక్కడేఅ పుట్టి పెరిగిన వారికి ఆ ప్రాంతానికి దూరంగా వుండటమంటే వారికి మరణ సదృషమే. పైగా తమ సంతానానికి కాష్మీర్ గొప్ప చెప్పాలని వుంటుంది. తాము బాల్యంలో అనుభవించిన ఆనందాలను సంతానానికీ అనుభవానికి తేవాలనివుంటుంది. కానీ ఇప్పుదు ఆ స్థితి లేదు. ఏ ఆవేదనలు, ఆరాటాలూ, గతించిన అద్భుత కాలనికి సంబంధించిన ఙ్నాపకాలూ కలగలసి ఏ పుస్తకం చదవటం ఒక అద్భుతమయిని అనుభూతిని మిగులుస్తుంది. ఏ పుస్తకంలో ప్రధాన వ్యక్తులంతా మహిళలే. అందుకే ఆ పేరు. చివరలో ప్రస్తుత కాష్మీరీ వనితల ప్రస్తావన వుంటుంది.
 i flip open the pages of the crisp newspaper and look for the word kashmir. i find it just below a photograph of a beautuful pair of green-blue eyes. the rest of the face is covered with a veil.

i knoe the look

the young woman is a self avowed islamic fundamentalist and looks the part. she swears to the reporter that the status of woman in islam is equal to that of men. she is a leader of kashmiri muslim woman and has a small female child. the reporter asks her what kind of life she would like her daughter to have when she grows up.

she says, i would like her to be prime minister.

i smell a tiger and rose petals.

ఈ సంఘటనతో పుస్తకం పూర్తవుతుంది. కానీ మన ఆలోచనలు మొదలవుతాయి.

మతం మారితే ఏంటట అని తేలికగా మాట్లాడేవారు ఇలాంటి పుస్తకాలూ, దేశ విభజనకు సంబంధించిన పుస్తకాలూ తప్పని సరిగా చదవాలి. సంఖ్యాబలం వల్ల మతాలవారు జరపగల అనర్ధాలకు దేశ విభజన్, కాష్మీరు చేదు నిరూపణలు. అయినా నిజానిజాలు గ్రహించకపోతే, అందరమూ అనుభవిస్తాము. ఓపికవున్న వారు కరగిపోయిన స్వప్నాలగురించి కన్నీటి గాథలు రాస్తారు. అంతే.

ఈ పుస్తకం అమెరికాలో 2002 లో ప్రచురితమయింది. headline book publishing వారు ప్రచురించారు. వెల 400/-

ప్రకటనలు

వ్యాఖ్యానించండి »

ఇంకా వ్యాఖ్యలు లేవు.

RSS feed for comments on this post. TrackBack URI

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

వర్డ్‌ప్రెస్.కామ్‌లో ఓ ఉచిత వెబ్‌సైటు లేదా బ్లాగును సృష్టించుకోండి.

%d bloggers like this: