రాతలు – కోతలు

మే 28, 2008

ఐ.పి.ఎల్ కప్పు ఎవరిది?

Filed under: క్రికెట్-క్రికెట్ — కస్తూరి మురళీకృష్ణ @ 5:23 ఉద.

మొత్తానికి ఐ.పి.ఎల్ క్రికెట్ పోటీల్లో సెమి ఫైనల్ ఆడే జట్లేవో తెలిసిపోయింది.రాజస్థాన్,చెన్నై,పంజాబ్,డిల్లీ జట్లు ఓడితే ఇంటి దారి పట్టే సెమి ఫైనల్ లో తలపడతాయి.ఒక్క బంతి,ఒక్క ఓవరు,ఒక్క షాట్ మొత్తం ఆట స్వరూపాన్ని మార్చి,అదృష్టాన్ని తల్ల క్రిందులు చేసే పోటీల్లో ఎవరు తప్పకుండా గెలుస్తారో చెప్పటం సాహసమే కాదు,మూర్ఖత్వం కూడా అవుతుంది.కానీ,ముందు జరిగే దాన్ని ఊహించటం మానవుడి బలహీనత.ఊహించినట్టు జరిగితే గొప్ప అనుకోవటం,ఊహించిన దానికి వ్యతిరేకంగా జరిగితే,తలచినదే జరిగినదా దైవం ఎందులకు?అనుకోవటం మనకొక అలవాటు.
సెమీస్ లోకి రావటానికి చెన్నై జట్టు చాలా కష్ట పడటమే కాదు,మంచి పట్టుదలను ప్రదర్శించింది.రాజస్థాన్ వారితో రెండువందల పరుగులను వేటాడిన విధం వారి పట్టుదలను చూపిస్తుంది.చార్గెర్స్ ఎలాగో చార్గి లేక నిర్వీర్యులయి ఉన్నారు.దాంతో గెలుపు మొదటి ఓవర్లోనే చెన్నై దని స్పష్టమయింది.చెన్నై గెలుపు ముంబై వీరులను పూత్రిగా నేల పైకి దించింది.సచిన్ పేరు విజయానికి రాచబాట కాదని,క్రికెట్ 11 మంది కలసి ఆడేదని ఈ పాటికి ముంబయ్ జట్టులోని వారికి అర్ధమయి వుంటుంది.ముంబయ్ జట్టులో అనుభవం ఉన్న వారుండి కూడా చివరి ఓవర్లలో ఉద్విఙ్నతలను తట్టుకోలేకపోవటం వారి పరాజయానికి ప్రధాన కారణం. పంజాబ్ వారితో,రాజస్థాన్ వారితో చివరి బంతిలో ఒక్క పరుగుతో ఓడటం వారి సెమీస్ అర్హతను దెబ్బ తీసింది.
పంజాబ్ జట్టు పట్టుదల,విజయోత్సాహం ముంబయ్ ఆటలో చివరి బంతిలో యువరాజ్ ప్రత్యర్ధిని రనౌట్ చేసిన విధం  నిరూపిస్తుంది. విదేశీ స్వదేశీ ఆటగాళ్ళు కలసికట్టుగా,ఒక జట్టులా ఆడుతున్న ఈ జట్టు ఫైనల్ కి వెళ్తుందనిపిస్తుంది.కానీ,యువరాజ్,సంగకార,జయవర్దనేలు ఆడకపోతే జట్టు దెబ్బతింటుంది.
డిల్లీ జట్టుకు గంభీర్,ధవన్,మెక్ గ్రత్,సెహ్వాగ్ లు నాలుగు స్థంభాలు.అయితే,వీరిలో సెహ్వాగ్ ఆట ప్రాణం పోకడా ఎవ్వరూ చెప్పలేరు.రాజస్థాన్ వారితో,ఓడిన విధం వీరి బలహీనతలను స్పష్టం చేస్తుంది.
ఉన్న వారందరిలోకీ పటిష్టమయిన జట్టులా కనిపిస్తోంది రాజస్థాన్ జట్టు.బాటింగ్లోనూ,బౌలింగ్లోనూ ఎటువంటి బలహీనతలూ చూపటంలేదు.గెలవాలన్న పట్టుదలలోనూ ఎక్కడా సడలింపు కనబడటంలేదు.అయితే,సాధారణంగా అన్ని ఆటలూ గెలుస్తూఅ వస్తున్న వాడు అసలు ఆటలో ఓడతాడు.అలా అదృష్టం అడ్డుపడితే తప్ప రాజస్థాన్ వారే గెలుస్తారనిపిస్తుంది.మిగతా జట్లనీ ఏదో ఒక బలహీనతను చూపాయి.రాజాస్థాన్ వారు ఇంకా బలహీనతలను చూపాల్సివుంది.చూపితే,మిగతా ముగ్గురిలో ఎవరయినా గెలవవచ్చు.చూపక పోతే సమస్యే లేదు.
నాకు మాత్రం ఎందుకో రాజస్థాన్ వారు దెబ్బ తింటారనిపిస్తోంది.సాధారణంగా బలవంతుడంటే ఒక రకమయిన వ్యతిరేక భావం వుంతుంది.అందుకేనేమో!కానీ,ఈ ఐ.పి.ఎల్ కప్పు నిజంగా గెలిచే అర్హత మాత్రం వార్న్ కే వుంది.
ఈ పోటీల వల్ల సెలెక్టొర్ల పని కఠినం అయింది.కొత్త ఆటగాళ్ళను విడవలేరు.పాత వారిని వదలలేరు.అయితే,సచిన్ తప్ప మిగతా పాత వారిని ఎలాగో వదిలేశారు.సమస్య అల్ల కొత్త వారిలో ఎవరిని వదలాలన్నది.యూసుఫ్ పఠాన్,అస్నోద్కర్,నాయర్,ధవన్,మిశ్రా,గోస్వామి ఇలా కొత్త కొత్త వారంత మేమున్నాం అంటూ వచ్చేసారు.ఎవరిని వదలాలి?ఎవరిని మరవాలి?
ఇక ద్రావిడ్,సచిన్,గంగూలీ,లక్ష్మణ్ ల జట్టులు ఓడటంలో వాళ్ళ బాధ్యత పెద్దగా లేదనవచ్చు.ఇది 20-20 ఆట.కొట్టు,పట్టు.అంతే!కానీ,ఈ ఆట యువకులదే అన్నది చేదు నిజం.వీళ్ళు ఆడలేరని కాదు కానీ,అదే పనిగా ప్రతి బంతినీ బాదటం వీరికి అలవాటులేదు.20-20లో పెరుగుతున్న యువకులు ఇకపై పుడుతూనే బాదుతూ పుడతారు.వాళ్ళతో 5 రోజుల ఆట ఆడించినప్పుడు అసలు ప్రతిభలు తెలుస్తాయి.అప్ప్టి వరకూ అబంతికో హీరో పుడుతూనే వుంటాడు.ద్రావిడ్,సచిన్,గంగూలీ లు ముసలివారిలానే అనిపిస్తారు. 

ప్రకటనలు

4 వ్యాఖ్యలు »

 1. ipl vijtha rajastan royals

  వ్యాఖ్య ద్వారా charan — మే 28, 2008 @ 1:53 సా. | స్పందించండి

 2. A good review. But I want Delhi dare devils to win. సెహ్వాగ్ ఆట ప్రాణం పోకడా ఎవ్వరూ చెప్పలేరు. Right. But one cannot produce 25-30 matchwinning innings in international cricket without being great.

  Warne is an australian, and showed his grit with mostly unknown players. The way he handled an international captain, (Smith) who is already a legend of some sort, shows that he deserves that victorious team.

  With three worldclass pacers and a spin prodigy like Piyush Chawla, Yuvi got the idael bowling combination. All are Indians made his task more easy.

  I won’t comment about Chennai.

  Ganguly’s innings against KXIP is a prime example of How a captain should lead his team.

  One day team లోకి దాదా.

  వ్యాఖ్య ద్వారా Geethaacharya Vedala — మే 28, 2008 @ 2:48 సా. | స్పందించండి

 3. మా లచ్చుమయ్య ఓ వెలుగు వెలుగుతాడనుకుంటే చప్పున చల్లారి పోయాడు. వేణు బాబు గుడ్డిలో మెల్ల గా ఫాము లోకొచ్చాడు. కానీ ఏమి లాభం.

  రాజస్థాన్‌ రాయల్సుకే కప్పు రావాలి.

  — విహారి

  వ్యాఖ్య ద్వారా విహారి — మే 28, 2008 @ 7:15 సా. | స్పందించండి

 4. . విహారి గారు,రాములకి,లచ్చుమయ్యలకీ కాలం చెల్లిపోయింది.ఇది నవ యువకుల కాలం.వీళ్ళముందు ధోనీ కూడా ముసలివాడిలా అనిపిస్తున్నాడు.అయితే,బంతి కనబడితే కొట్టటం తప్ప మరొకటి తెలియని ఈ యువకులు జాగ్రతగా చాలా సేపు నింపాదిగా కూడా ఆడగలిగితే మంచి రోజులు వచ్చినట్టే!

  వ్యాఖ్య ద్వారా కస్తూరి మురళీకృష్ణ — మే 29, 2008 @ 6:27 ఉద. | స్పందించండి


RSS feed for comments on this post. TrackBack URI

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

వర్డ్‌ప్రెస్.కామ్‌లో ఓ ఉచిత వెబ్‌సైటు లేదా బ్లాగును సృష్టించుకోండి.

%d bloggers like this: