రాతలు – కోతలు

ఏప్రిల్ 13, 2008

నేను చదివిన మంచిపుస్తకం-3

Filed under: pustaka paricayamu — కస్తూరి మురళీకృష్ణ @ 3:00 సా.

సాహిత్య ప్రక్రియలలో అతి కఠినమయినది,ఎంత బాగా చేసినా అందరి ఆమోదమూ పొందలేనిది అయిన ప్రక్రియ అనువాదం.కానీ,అనువాదం అత్యవసరమయిన ప్రక్రియ.ఒక భాశలోని రచనలు మరొక భాశవారికి తెలియాలంటే అనువాదం తప్ప వేరే గత్యంతరం లేదు.లేదా,ఆ భాషను నేర్చుకోవటం తప్ప మరో మార్గం లేదు.కాబట్టి అనువాదాల ప్రాముఖ్యం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
మూలం సూర్యుడయితే,అనువాదం చంద్రుడి వంటిది.మూలంలోని వాడి,వేడి లేకున్నా,ఆ కిరణాల లోని వెలుతురు ప్రసరింప చేయగలగాలి అనువాదాలు.వేడి కిరణాలను ప్రతిఫలిస్తూ,వాటిని చల్లగా అందరికీ అందించాలి.మూల భాషలోని నుడికారాలు,చమత్కారాలు,పలుకుబడులు పరాయి భాషలోకి తర్జుమా చేయటం అతి కఠిన మయిన పని.అందుకే ఎందరో అనువాదకారులు వుంటారు కాని,కొందరి అనువాదాలే మనలని అలరిస్తాయి.ఒకోసారి మూలంతో మనకు పరిచయం లేకున్నా,మూలాన్ని మించినవిగా అనిపిస్తాయి.మూల కథల్లాగే అనిపిస్తాయి.ఇలా అనువాదంచేసే వారిని వేళ్ళ మీద లెక్కించవచ్చు.అటువంటివారిలో ముందుగా గుర్తుకువచ్చే పేరు మన బ్లాగు మిత్రుదు,కొల్లూరి సోమశంకర్.
కొల్లూరి కథలు చదువుతూంటే ఒక విశయం స్పశ్టంగా అర్ధమవుతుంది.ఈయన కథలను ఎంచుకోవటంలో తనదయిన తూనిక రాళ్ళను వాడతాదు.రచయిత పెరునుబట్టి,ఆ కథ అనువాదం చేయటంవల్ల తనకు వచ్చే లాభాలను బట్టి కథలను ఎంచుకోడు.చదవగానే ఎద తలుపులను తట్టే కథలే ప్రధానంగా ఈయన సంకలనం మనీ ప్లాంట్ లో కనిపిస్తాయి.కొన్ని కథలు హ్రుదయలోతులలో చేరి తుఫాను అలలను ఎడతెగకుండా కలిగిస్తాయి.ఓ మైషీ ఎందుకిలా?అనే కథ ఇందుకు తిరుగులేని నిదర్శనం.పెరుగన్నం,సున్నాగాడు లాంటి కథలు గుండె తలుపులను మ్రుదువుగా తడతాయి.కానీ వాటి ప్రతిధ్వని తీవ్రత త్వరగా తగ్గడు.బొమ్మ,విశవలయం కథలు గొప్ప జీవిత సత్యాలను అతిసున్నితంగా చెప్తాయి.
ఇవన్నీ సోమశంకర్ స్వంత కథలు కావు.కానీ స్వంత కథలలా ఆ కథలను ఎంతో జాగ్రత్తగా తర్జుమా చేసాడు.ఆ కథలలోని భావం చెడకుండా,భావావేశం పలుచబడకుండా మనకు అందించాడు.అంటే చంద్రుడు చేస్తున్నా పనిని సమర్ధవంతంగా నిర్వహించాడన్నమాట.అందుకు రచయిత భినందనీయుడు.
సోమశంకర్ ఇతర అనువాద రచయితలకన్నా భిన్నంగా నిలవటంలో అతను ఎంచుకున్న కథలతో పాటు ఆ కథలపట్ల అతని నిజాయితీ,ఆప్యాయతలు కూడా తోడ్పడ్డాయి.ఒక పెరుపొందిన అనువాదకుడు,వంద పయిగా అనువాదాలు చేసినవాడు,సాహిత్య అకాడెమీకి అనువాదాలు చేసే రచయిత ఉదాహరణ చూస్తే మీకు సోమశంకర్ ప్రత్యెకత స్పశ్టమవుతుంది.ఆ అనువాదకుడు కుశ్వంత్ సింగ్ కథ బాటం పించెర్ ను తెలుగులో పిర్ర గిచ్చు గా చేసాడు.ఇదిచాలు మనీ ప్లాంట్ విలువ మనకు తెలియటానికి.

ప్రకటనలు

2 వ్యాఖ్యలు »

  1. సోమశంకర్ మనీ ప్లాంట్ ని ప్రస్తావించడం చాలా సంతోషం. మీరు టపా శీర్షిక లోనే పుస్తకం పేరు కూడా రాస్తే పాఠకులకి ఒక సూచనగా ఉంటుంది.

    వ్యాఖ్య ద్వారా కొత్తపాళీ — ఏప్రిల్ 14, 2008 @ 10:29 ఉద. | స్పందించండి

  2. నా గురించి నాలుగు మంచి మాటలు రాసినందుకు నెనరులు

    వ్యాఖ్య ద్వారా కొల్లూరి సోమ శంకర్ — ఏప్రిల్ 16, 2008 @ 9:14 ఉద. | స్పందించండి


RSS feed for comments on this post. TrackBack URI

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

వర్డ్‌ప్రెస్.కామ్‌లో ఓ ఉచిత వెబ్‌సైటు లేదా బ్లాగును సృష్టించుకోండి.

%d bloggers like this: