రాతలు – కోతలు

జులై 5, 2009

ఇది నా చివరి పోస్టు!

ప్రచురించిన వర్గము నా రచనలు. — కస్తూరి మురళీకృష్ణ @ 5:08 పూర్వాహ్నం

అవును ఇది నా చివరి పోస్టు!

వివరాలు చెప్పేముందు, ఈవారం నా రచనల వివరాలు చెప్తాను.

ఈనెల విపుల మాస పత్రికలో నా కథ చట్టం దిద్దిన సంసారం వచ్చింది. నిజానికి ఈకథను మూడు సంవత్సరాల క్రితం నేను రాస్తూన్న వ్యంగ్యాస్త్రం శీర్షికలో ఒక అస్త్రం గా ఇచ్చాను. ఆ శీర్షిక ఆగిపోయినా వారి వద్ద రెండు అస్త్రాలు మిగిలిపోయాయి. అలా మిగిలిన వాటిలో ఒక అస్త్రం ఇది. అప్పుడే కొత్తగా ఏర్పరచిన గృహ హింస చట్టాన్ని వ్యంగ్యం చేస్తూ రాసిన కథ ఇది.

ఆదివారం వార్తలో కవర్ స్టోరీ మైకెల్ జాక్సన్ పైన నేను రాసిందే. కవర్ స్టోరీకి అనుబంధంగా బ్లాగ్ స్పాట్ లో కూడా జాక్సన్ కు సంబంధించిన బ్లాగులను పరిచయం చేశాను.

ఆంధ్రప్రభ సగటు మనిషి స్వగతంలో రేట్లు పెంచారని ప్రయివేట్ యాజమాన్యంతో పోరాడుతున్న తల్లితండృలను చూసి సగటుమనిషి ఆశ్చర్యపోయి ప్రత్యామ్నాయం సూచిస్తా
డు.

ఆంధ్రభూమిలో పవర్ పాలిటిక్స్ శీర్షికన ఉత్తర కొరియా రాజకీయాలాటల విశ్లేషణ వుంటుంది.
ఈనెల ఈభూమిలో నా రచనలు అక్షరాంజలి, రియల్ స్టోరీలపైన సమీక్షలు వచ్చాయి.
గురువారం చిత్రప్రభలో సినిమాలుగా మారిన నవలల చర్చ కొనసాగుతుంది.
ఇవీ ఈవారం నా రచనలు. చదివి మీ అభిప్రాయం చెప్పండి.

ఇక బ్లాగులో చివరి పోస్టు గురించి.

చావాకిరణ సహాయ సహకార సౌజన్యాలతో నేను ఒక వెబ్ సైటును ప్రారంభించాను. kasturimuralikrishna.com.

ఇక నుంచి నా రాతలు-కోతలన్నీ ఆ వెబ్ సైటులోనే జరుగుతాయి.

దాన్లో నా రచనలన్నిటినీ వుంచుతాను. అలాగే నా పుస్తకాల వివరాలన్నీ వుంటాయి. ఇవికాక నా రాతలెలాగో వుంటాయి.

నా బ్లాగును ఆదరించిన విధంగానే నా వెబ్ సైటునూ ఆదరిస్తారని ఆశిస్తున్నాను.

సెలవు

వెబ్ సైటులో కలుస్తూనేవుందాం!

అభిప్రాయములు »

  1. సొంత గూటికి చేరుతున్నందుకు అభినందనలు

    వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా కొత్తపాళీ — జులై 5, 2009 @ 10:48 పూర్వాహ్నం | జవాబు

  2. గృహప్రవేశానికి పిలవకుండానే?? శుభాభినందనలు

    వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా ramani — జులై 15, 2009 @ 9:09 పూర్వాహ్నం | జవాబు


ఆర్ యస్ యస్ ఈ జాబుపై వ్యాఖ్యలకు ఫీడ్ TrackBack URI

మీ ఉద్దేశ్యం…

WordPress.com లో Blog పెట్టుము.