ఈవేళ సాయంత్రం ఏఎస్ రావ్ నగర్ లో ఆరున్నరకు నా పుస్తకం, తీవ్రవాదం, ఆవిష్కరణ సభవుంది. అందరికీ ఆహ్వానం.
ఇవాళ్ళ వార్త ఆదివారం అనుబంధంలో బ్లాగ్ స్పాట్ శీర్షికన, హాంగ్ కాంగ్ దర్శకుడు కెన్నెత్ బీ బ్లాగు పరిచయం వుంటుంది. హాంగ్ కాంగ్ సినిమాను ప్రపంచానికి పరిచయం చేయటం ఈయన బ్లాగు వుద్దేశ్యం.
ఆంధ్రప్రభ సగటు మనిషి స్వగతంలో ఈవారం సగటు మనిషికి మరో సందేహం వచ్చింది. దేహాన్ని దేవాలయాలంత పవిత్రంగా వుంచాలంటారు. కానీ, మన దేవాలయాలను ఎంత పవిత్రంగా వుంచుతున్నాము? ఇదీ సగటుమనిషి స్వగతం ఈవారం.
చిత్రప్రభలో ప్రస్తుతం నవలలను సినిమాలుగా మార్చటం గురించి చర్చ జరుగుతోంది. ఈవారం వివిధ దేవదాసుల గురించి చర్చ కొనసాగుతుంది.
ఆంధ్రభూమి వార పత్రికలో పవర్ పాలిటిక్స్ శీర్షికన రాజకీయమ్షాల విశ్లేషణ వుంటుంది.
ఈ శనివారం అంటే, 27వ తారీఖున త్యాగరాయ గాన సభ మినీ హాలులో తీవ్రవాదం పుస్తక పరిచయ సభ జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ పత్రిక సంపాదకులు శ్రీ వల్లీశ్వర్ గారు పుస్తకాన్ని విశ్లేషిస్తారు. అందరికీ ఇదే ఆహ్వానం.
ఇవీ ఈవారం నా రచనలు. మీ అభిప్రాయాన్ని నిర్మొహమాటంగా తెలియచేయాలని ప్రార్ధన.