నిజానికి విశ్వనాథ వారి సాహిత్యాన్ని పరిచయమ్ చేస్తూ సీరీస్ గా రాయాలని అనుకున్నాను. కానీ ఈలోగా ఇటీవలె ఒక బ్లాగులొ ఆయన గురించిన ఒక సమీక్శ చదివిన తరువాత ముందు అడుగు వేస్తే మంచిదనిపించింది. ఇనుము వేడిగా ఉన్నప్పుడే దెబ్బ వేయాలి. చర్చలు వాడిగా వున్నప్పుడే వాదించాలి.
విశ్వనాథ వారిని విమర్శించటం చాలా సులభమ్. అందుకోసమ్ కొత్త పదజాలాన్ని వెతకనవసరంలేదు. కొత్తగా పరిశొధనలు చేయనవసరం లేదు. ఆయనను విమర్శించటమ్వల్ల లాభాలే తప్ప నశ్టాలేవే లేవు. ఆధునిక వాదిగా గుర్తింపు పొందవచ్చు. అభ్యుదయవాదిగా, కుల, మత, వర్గ, వర్ణ సంకుచిత భావాలు లేని విశాలహ్రు్దయుడిగా అందరినీ నమ్మించవచ్చు. ఆయనను దూశించటమ్వల్ల మన లోపాలను, పాపాలను కప్పిపుచ్చుకోవచ్చు.
అందుకే తెలుగు భాశ రానివారయినా సరే, తెలుగు గురించి ఏమీ తెలియనివారయినా సరే, ఎంత సంకుచిత భావాలకు దాసులయిన వారయినా సరే విశ్వనాథ వారిని తిడితే వారి పాపాలన్ని పోయి పుణ్యాత్ములయిపోతారు. సర్వ జనామోదాన్ని పొందుతారు.
అయినా సరే విశ్వనాథ వారి సాహిత్యాన్ని చదివినవారు ఆయనని అభిమానిస్తారు. ఆయనను ఆరాధిస్తారు. ఎన్ని అడ్డంకులను, ప్రతికూలతలను ఎదుర్కొంటూ కూడా ఆయనను సమర్ధిస్తారు.
ఆయనను చాలా మంది పండితుడని కొట్టేస్తారు. బూజు పట్టిన పాత భావాలను అనుసరిస్తాడని ఈసడిస్తారు. కఠిన గ్రాంథికమ్ రాస్తారని. ఎవారికీ అర్ధంకాని రాతలు రాస్తాడని వెక్కిరిస్తారు. ఒకటొ, రెండో ఆయన రచనలు చదివిన వారు అన్నీ చదివేసినట్టు, ఇక చదవాల్సినవేవీ లెఅనట్టు మాట్లాడతారు.
కానీ, ఆయన వల్ల ప్రెఅరణ పొందిన వారు మాత్రమ్ ఆయనను గురుతుల్యునిగా భావించి పూజిస్తారు. ఆయన బాట అనితరసాధ్యమ్ అని తెలిసినా ఆ బాటలో తప్పటడుగులు వేయాలని ప్రయత్నిస్తారు. ఆ తప్పటడుగులవల్ల వారి ప్రతిభకు మించిన గుర్తింపు పోందుతారు. అలాంటి వారిలో నేనూ ఒకడిని. అందుకే పనికట్టుకుని ఆయనను పరిచయమ్ చెఅస్తున్నాను.
అందరూ ప్రయాణించే దారిలో ప్రయాణం చాలా సులభం. కొత్తదారి కనుక్కోవటం చాలా కశ్టమ్. కానీ, పాత దారిలో ప్రయాణిస్తూ, ఆ దారిని కొత్త పుంతలు తొక్కించటం సామాన్యులకు సాధ్యమ్ కాదు. అలాంటి అసామాన్యుడు విశ్వనాథ.
ఆయన ఎవరికీ అర్ధం కాని భాశలో రాస్తాడనే వారు విశ్వనాథ వారిని చదవలేదు.
విశ్వనాథ వారి సాహిత్యాన్ని చదివితే, ఏకవీర నాటి, ఆయన తెలుగుకూ, నందిగ్రామ రాజ్యమ్ నాటి తెలుగుకూ ఎంతొ తేడా కనిపిస్తుంది. పురాణ వైర గ్రన్థమాల తెలుగుకూ, పులుల సత్యాగ్రహం తెలుగుకూ తెఅడా వుంటుంది. రాజతరంగిణి తెలుగుకూ, విశ్ణు శర్మ ఇంగ్లీశు చదువుకూ తెఅడా వుంటుంది. వరలక్శ్మి త్రిశతి తెలుగుకూ కిన్నెరసాని తెలుగుకూ తెఅడా వుంటున్ది. ఆయన్ మధ్యాక్కరలకూ, కల్ప వ్రుక్శానికి తెడా వుంటుంది. జేబు దొంగలు నవలకూ, దమయంతీ స్వయంవరానికీ, చెలియలికట్టకూ తెఅడా వుంటుంది. అంటే, వీళ్ళంటున్నట్టు, ఆయన ఎదుగుదల, కదలిక లేని, మురుకిగుంట కాదు, నిరంతరమ్ ప్రవహిస్తూ, పరిణామశీలి అయిన అనంత జల ప్రవాహం. ఇది తెలుసుకోకుండా, తెలుసుకున్నా, నిజం చెప్తె, ఎక్కడ తమ నైచ్యం బయట పడుతుందో నన్న భయమ్తో, ఈనాటికి కూడా ఆయనను అవే విమర్శలతో, అదే రకంగా దూశిస్తూనె వున్నారు. ఇది గమనిస్తేనే, ఆయన గొప్పతనమ్ తెలుసుకోవచ్చు. ఒక వ్యక్త్యి మరణించి ఇన్నేళ్ళయిన తరువాత కూడా, పేరు చెప్తేనే ఉలిక్కిపడే వారింత మంది వున్నారంటే ఇక ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే.
ఇది ఆరంభం మాత్రమే. ఇక వీలు వెంబడి విశ్వనాథ వారి రచనలను పరిచయం చెఅస్తాను.
ఆయనను కుల తత్వ వాది అనేవారెందరో అనేక సందర్భాలలో ఇతర కులాల పైన ద్వెఅశాన్ని, తక్కువ కులాలవారి పైన చులకనను, స్వకులం వారి పైన ప్రేమను బహిరంగంగా చూపారు. అయితే, విశ్వనాథ వైపు వేలు చూపించి, ద్రుశ్టిని తమ వైపు నుంచి మళ్ళించుకున్నారు.
మన దేశం లో కుల భావనకు అతీతంగా ఎవ్వరూ లేరు. కానీ, అందరో విశ్వనాథ వారి వల్ల తమ నేరాన్ని కప్పిపుచ్చుకోగలుగుతున్నారు. చివరికి, జాశువా కూడా, మతం మారినా కులం మారలేదని వాపోయాడు. క్రీస్తును ఆశ్రయించినా, మాలా క్రీస్తు వేరు, మాదిగ క్రీస్తు వేరు అని ఖండికలు రాసి, వేదనను వెళ్ళ గ్రక్కుకున్నాడు.
కాబట్టి, విశ్వనాథను తిట్టటం మాని ఆయన సాహిత్యం గురించి. తెలుసుకుని, చదివి ఎవరికి వారు నిర్ణయించుకోవాలి. ఆదిశగా, ప్రోత్సహించేందుకు, నేను, నా వ్యాసాల ద్వారా, ఆయన రచనల పరిచయాల ద్వారా నా వంతు ప్రయత్నాలు చేస్తాను. అందుకు ఇది నాందీ ప్రస్తావన మాత్రమే!