మెదడు మగత మత్తులొకి జారుకుంటోంది. హాయిగా మత్తుగా వుంది. ఇంతలో హఠాత్తుగా మెదడు తలుపు భళ్ళున తన్ని, చెన్గున లోపలకు దోకాడు బ్రహ్మ బుధ్.
ఒరే అలా హఠాత్తుగా వచ్చి నన్ను చంపకురా, అని అందామనుకున్నా.
నాకు ఆ అవకాశమ్ ఇవ్వలేదు బ్రహ్మ బుధ్.
బహిర్భూమికి వెళ్ళె పొసిశన్ లోకూచుని, మల బద్ధకం తో బాధపడేవాడు అతి కశ్టంతో విసర్జిస్తూన్న ప్రయత్నాలు చెఅస్తున్నవాడిలా ముఖాన్ని ఎన్నెన్నో వంకరలు తిప్పుతూ, గొంతును కర్ణ కఠోరంగా అతి అసహ్యంగా, వొళ్ళు జలదరిన్చి వాంతి తన్నుకుని వచ్చేలా, చలి చలి గిలి గిలి ఎందుకో అసలేమిటో అని అదే పొసిశన్ లో వొళ్ళు ఊపుతూ పాడటం మొదలుపెట్టాడు.
చూడలేక, వినలేక, బ్రతకలేక, చావలేక, నిలవలేక, పరుగెత్తలేక చచ్చాను. కానీ చావలేదు.
ఏమిటిది, అని తన్నుకుని వస్తున్న వాంతిని అరచెఅత అడ్డుకుంటూ అడిగా.
ఇది డాన్సు, అది పాట. ఇది మాట. అది లోట.నాకు న్చ్చింది సూపర్ సినిమా అని మరో భయంకరమయిన పోస్ ఇచ్చాడు.
బాబూ, నువ్వు సినిమా చూసిన ప్రతిసారీ ఇలా నన్ను చంపటం బాగాలేదు. చెప్పాలనివుంటే కథ చెప్పిపో. అంతేకానీ ఇలా పాటలూ, పోసులతో నన్ను చంపకు, అని దీనంగా బ్రతిమిలాడుకున్నా.
నవ్వాడు నాగార్జునలా. అంతలో ఆయేశా తకియాలా కళ్ళు చికిలిన్చి, వొళ్ళు ఊపుతూ బంగారూ వీడేరా నా నిండు సెన్దురూడూ అంటూ పరుగెత్తటం మొదలుపెట్టాడు.
ఒక చోటా కూచుని చెప్పచ్చుకదా. ఇలా ఎందుకు పరుగులుపెడతావు, అని అడిగా.
పరుగులు పెడుతూనే వున్నాడు. ఆగి ఆగి బహిర్భూమి పోస్ ఇస్తూ, అసహ్యమ్గా బాధపడుతున్నట్టు చూపి, మళ్ళీ ఎటొఎందుకో తెలియకుండా పరుగులుపెడుతూనె వునాడు.
ఎఅమిటా పరుగులు నాయనా, ఎందుకా పరుగులు, అడిగా.
నాకు మోటార్ సైకిల్ కావాలి అడిగాడు.
ఎందుకని?
వీరుడిలా ఒక చక్రమ్ మీద నడపాలి. దారాలు కట్టుకుని ఎత్తునున్చి దిగి, కన్నుమూసి తెరిచేలోగా మోటార్ మీద ధూమ్ అంటూ పోవాలి.ఝూమ్ అంటూ ఎగరాలి అన్నాడు.
అవన్నీ ట్రిక్కులు, చేసేవి డూపులు, సినిమా అంటేనే భ్రమలు అన్నాను.
చీ పో, అన్నీ నన్ను నిరుత్సాహ పరచే ఆబద్ధాలు.. అసలా సినిమాలో ఇద్దరు వేరులున్నారు. ప్రధాన వీరుడు సూపర్. మోటార్ రేసులొ గెలిచి, ఓడిన వాడిని తన్ని నా బన్డి రిపేర్ చేసి తేసుకురా అనే గొప్ప సూపర్ వేరుడు. ఆడ వీరి డాక్టర్. మగవాడు మాటి మాటికీ శేక్ హాన్డ్ అంటూంటే ఎందుకొ తెలుసుకోలేదు. టీవీ కోసమై వీరుడి వలలో పడెనే పాపం పిచ్చి డాక్టర్, అయ్యో పాపం పిచ్చి డాక్టర్. అయ్యో పాపం తెలివి లేని డాక్టర్. ఇహిహి బుద్ధిలేని మొద్దు డాక్టర్ అని పాడాడు.
బాబూ డాక్టర్ చదవాలంటే ఎన్టొ తెలివి వున్డాలి. ఎంతో కశ్ఃట పడితే కానీ డాక్టర్ చదవలేరు తెలుసా, అనడిగాను.
అదే, తెలివంతా చదువులో పెట్టింది. వీరుడిని చోడగానే మతి పోయి. చలి గిలి అంటూ చెడ్డీ వేసుకుని బహిర్భూమికి పరుగుపెట్టింది, అన్నాడు.
సరే సినిమా కథేమిటి? అనడిగా.
కథా, అదెవరికి కావాలి? వేరుడున్నాడు. వీరుడున్నాడు. వీరి వుంది. వేరుడు దొంగతనాలు చేస్తాడు. కానీ వీరుడు కదా, పోలీసులు వదిలేస్తారు, అని గంభీరంగా నావైపు చూశాడు.
భయపడ్డా.
మేరు తీవ్రవాదుల దాడులు అరి కట్టాలంటే చట్టాలు కావాలని అడుగుతున్నారు. ఈ సినిమా చూడండి. దొంగలు వీరులు. గొప్ప గొప్ప పథకాలు వేస్తారు. అదే పోలీసులు చూడు. తనమీద వార్త రాసాడని జర్నలిస్టుని కొడతాడు. దొంగలు పిల్లలు ఉచ్చ పోస్తారు అని పిచ్చిగా మాట్లాడతాడు. ఇంకెవడొ సలహా ఇస్తూంటే వాడిని కొడతాడు. ఎవడొ దొంగను చూశానంటే వాడిని కొట్టి బొమ్మ గీయమని ఎదురుగా కూచుంటాడు. దొంగ జాడలు వెతకకుండా లాకప్ లో ఆ జోకర్ ని పెట్టి హింసిస్తాడు. మీ పోలీసులు ఇళా పరిశోధన వదలి జోకర్లని పట్టుకుని వేలాడుతూంటే దొంగలు మంచిగా దొంగతనాలు చేస్తున్నారు. మేరంతా చట్టాలు కట్టుదిట్టం చేయాలని ఏడుస్తారు.అన్నాడు.
ఏమిటీ హీరో దొంగనా? అడిగా.
గొప్ప దొంగ. వేరుడే కాదు, వేరుడి వేరుడూ దొంగే, వేరుడి ప్రేయసీ దొంగే. పోలీసులు తప్ప అందరూ దొంగలే. పోలీసులే వెర్రివాళ్ళు. హిహిహిహిహి
బాబో నీ సినిమా సూపర్ గా వుంది. నన్ను వదిలెయ్ అన్నాను.
అప్పుడేనా, ఇంకా కథ మొదలుకానేలేదు. అన్నాడు.
నేను స్ప్హహ కోల్పోయాను.



అదిరింది. మీ సమీక్షలకన్నా, బ్రహ్మ బుద్ద్ సినిమాచూస్తేనే కిక్కొస్తోంది.
వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా కె.మహేష్ కుమార్ — జనవరి 4, 2009 @ 4:06 పూర్వాహ్నం |
సూపర్ ….
అప్పు తచ్చులు కొద్దిగా….
వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా ఉమాశంకర్ — జనవరి 4, 2009 @ 4:52 పూర్వాహ్నం |
meeku http://www.navatarangam.com thelusu anukuntanu ….kastha mee brahma budh ni kaastha akkada parichayam chesthe inka bavuntundani naa abhiprayam. telugu lo rayaleka pothunnanu….kshaminchandi. Katti garu meeru kontha chorava theesukuni veetini aa website lo pedithe bavuntundemo? …
వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా naren — జనవరి 4, 2009 @ 7:56 పూర్వాహ్నం |
he he…
వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా Aruna — జనవరి 4, 2009 @ 9:42 పూర్వాహ్నం |
హ హ
వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా వేణూ శ్రీకాంత్ — జనవరి 4, 2009 @ 4:20 అపరాహ్నం |
BRAMHA BUDH KI OKA PAATA CINEMA CHUPINMCHARU PLEASE.
వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా padma — జనవరి 6, 2009 @ 11:07 పూర్వాహ్నం |