రాతలు – కోతలు

డిసెంబరు 20, 2008

పుస్తకాల అమ్మకంలో నా అనుభవాలు-1

Filed under: Uncategorized — కస్తూరి మురళీకృష్ణ @ 12:22 పూర్వాహ్నం

కాదేదీ రాతలు కోతలకనర్హం!

నిన్న నేను పుస్తక ప్రదర్శనలో నా పుస్తకాలను writer’s stall లో పెట్టి అమ్మకాలు ఆరంభించాను.

నేను వెళ్ళి 100/- కట్టి స్టాలు చేరుకునే సరికి ఒక కమ్మ పుస్తకాల ప్రచురణకర్తలు తమ సామ్రాజ్యాన్ని విస్తరించుకుని ఉన్నారు.

నిజానికి నేను రచయితలీ అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకుంటారనుకున్నాను. స్టాలులో జాగా కోసం తన్నులాటలూ, తోపులాటలూ వుంటాయనుకున్నాను.

మమ్మొలుగా ప్రదర్శనలో ఒక స్టాలును ఏర్పాటు చేయాలంటే 13000/- కట్టాలి. అలాంటిది, నిర్వాహకులే ఒక స్టాలును రచయితలకోసం, అదీ కేవలం 100/- కే కేటాయించటం అన్నది ఎంతగానో అభినందనీయమైన విషయం. ఈ మధ్య కాలం లో రచయితలు ఎవరి పుస్తకాలను వారే ప్రచురించుకోవాల్సి వస్తోంది. పెద్ద ప్రచురణకర్తలు ప్రచురించిన పుస్తకాలకు ప్రచారంలో కానీ, అమ్మకాల విషయంలో కానీ సమస్య లేదు. పెద్ద రచయితల పుస్తకాలకూ సమస్య లేదు. చిన్న రచయితలు, ఒకతో రెందో పుస్తకాలు ప్రచురించిన వారు తమ పుస్తకాలను ప్రచారం చేఉకోలేరు. ఎవరితో కొనిపించలేరు. కనీసం అలాంటి పుస్తకాలున్నాయని కూడా పదిమందికి తెలిసేట్టు చేసుకోలేరు. అందుకే, ఇంత మంచి అవకాశం దొరికితే రచయితలు తేనె చుట్టూ ఈగల్లా ముసురుతారని భయపడుతూ వెళ్ళాను.

తీరా చూస్తే, ఇంగ్లాండు ఖైదీలకోసం ఎదురుచూస్తున్న ఆస్ట్రేలియాలా వుంది ఆ స్టాలు. వెళ్ళినవాడు ఓ జండా పాతేసుకుని ఇది నాది అంటే చాలు అన్నట్టు వుంది.

కమ్మ ప్రచురణలవారు మొత్తం స్టాలులో తమ పుస్తకాలను పరచుకున్నారు. నెమ్మదిగా వారి పుస్తకాలను పక్కకు నెట్టి నా పుస్తకాలను పరిచా. కోనే వారికోసం ఎదురుచూపులు ఆరంభించా.

భలే మంచి చౌకబేరమూ అని పాడాలనుకున్నా. కుదరలేదు. అక్కడ మైకులో ఎవరో ఎవరూ వినకున్నా ఏదేదో మాట్లాడుతూన్నాడు.

చూస్తే స్టాళ్ళే జనాలకన్నా ఎక్కువున్నాయి. అయినా ఇది మొదతి రోజే కదా అని సర్దిచెప్పుకున్నాను.

ఇంతలో నా దృష్టి మన ఈ స్టాలు పై పడింది. వెళ్ళి పరిచయం చేసుకున్నా. పప్పు అరుణ గారు నన్ను గుర్తుపట్టారు. శ్రీధర్ కలిశారు. చావా కిరణ్ గారు చిరునవ్వులు చిందించారు. నన్ను ఫోటో తీయటమేకాదు, నాతో ఫోతో దిగారు. మా ఇద్దరి ఫోతో చూస్తూంటే మేము ముందే కలిసి కొన్ని జాగ్రత్తలు తీసుకునివుంటే లారెల్ హార్డీ జంట తలదన్నే వారమనిపించింది.

ఇంతలో నా మొదటి customar, నా పుస్తకాలను కొన్న ఏకైవ మహానుభావుదు కలిశాడు.

నిజానికి పుస్తకాలయితే పరచాను కానీ ఎవ్వరూ కొంటారని అనుకోలేదు. అందరూ దూరం నుంచి తొంగి చూసి పోతున్నారు. కొందరయితే ఈ వైపు చూడటం పాపం అన్నట్టు ముఖం తిప్పుకు పోతున్నారు. ఇంకొందరు దగ్గరకు వచ్చి, అలా అలవోకగా పైనుంచే వొంగి పుస్తకాలను ముట్టుకుంటే మైల పడతాయన్నట్టు చూసి ముక్కు తిప్పి పెదవి విరిచి పారిపోతున్నారు. మరి కొందరు సోమ శంకర్ మనీప్లాంట్ పుస్తకం చూసి మనీ ఎలా సంపాదించాలో రాసారా? అని ఆశగా అడిగితే, లేదు ఇతర భాషలలోని మంచి కథలను తెలుగులోకి అనువదించాడు అని సమాధానమిచ్చా. ఆయన వెంటనే అంటరాని అసుద్ధాన్ని చీదరించుకుని పారేసినట్టు ఆ పుస్తకాన్ని విసిరేసి వెళ్ళిపోయాడు. పోన్లే కనీసం చూశాడని సంతృప్తి పడ్డా. ఇంకొకాయన అంతర్మధనం పుస్తకం చూసి, నవలా? ఇంత పెద్దది చదవటం కష్టం, అని పారేసిపోయాడు. ఇంతలో ఒక ముసలాయన ఒక మూట పట్టుకుని వచ్చి గంటసేపు నా పుస్తకాలెవరికీ కనబడకుండా నుంచుని వచ్చిన వారందరికీ లెక్చరిచ్చి తన పుస్తకాలు అమ్మి పోయాడు. స్టాలులో పుస్తకాలు పెట్టమన్నా ఆయన అడ్డు తొలగించుకోవటానికి. ఎందుకంటే ఆయన ఎవరినీ దగ్గరకు రానెయటంలేదు. ఆయన అడ్డుండటంతో అందరూ కమ్మ పుస్తకాలు చూసి నెమ్మదిగా జారుకుంటున్నారు. చివరికి డబ్బులు కట్టమనగానే ఆ ముసలాయన వంద ఎందుకు దండగా! నేనిలాగే అమ్ముతా అంటూ మూట పట్టుకుని ప్రజల మీద పడ్డాడు.

ఆహా రచయితల బాధలూ అనుకున్నాను. పుస్తకం రాయటమొక తపస్సు అయితే, దాన్ని ముద్రించుకోవటం ఒక వేదన. అచ్చువేసిన పుస్తకాలను దగ్గరుండి అమ్మటం మరణ యాతన అనిపించింది.

ప్రతివాడూ పుస్తకాన్ని చూస్తూంటే కొంటాడేమో అన్న ఆశ కలుగుతుంది. పేజీలు తిప్పుతోంటే ఆశ పెరుగుతంది. పెదవి విరిచి పక్కన పెట్టి పోతూంటే ఎందుకునాకీ బాధలు హాయిగా ఉద్యోగం చేసుకుంటూ తిని పడుకోక, అనిపిస్తుంది.

అలా నుంచుని వచ్చి చూసి పోయే వారిని చూస్తూంటే, కూతురిని పెళ్ళి చూపుల్లో చూసి పెదవి విరిచేవారిని చూస్తూంటే తల్లి తండృల మనస్సుల్లో కలిగేవేదన అనుభవానికి వచ్చింది. ఎందుకంటే ఇక్కడ పుస్తకానికి తల్లి తండ్రి నేనే కదా!

ఇలాంటి ఆశ నిరాశల ఆలోచనల మధ్య ఊగిసలాడుతూంటే నా పుస్తకాలను కొని ఆశాదీపానికి నూనె పోసి మరింత ప్రజవలించేట్టు చేసిన ఆ వ్యక్తి వచ్చాడు.

బ్లాగులోని ఫోటో ప్రాణం ఓసుకున్నట్టున్నాడు. చూడగానే సులభంగా గుర్తుపట్టవచ్చు. కత్తి మహేష్ కుమార్ చక చకావచ్చి కత్తిలా రెండు పుస్తకాలు కొన్నాడు.

నేను , పుస్తకాలు కొన్న మొదటి వ్యక్తికి ఘనంగా సన్మానం చేయాలనుకున్నా. పూల మాల వేఇ సత్కరించి పూజ చేద్దామనుకున్నా. స్త్రోత్ర పాథం రాసి గానం చేద్దామనుకున్నా. అతని పేరు సువర్ణాక్షరాలతో లిఖించి, పుస్తక మహరాజ పోషకుడన్న బిరుదివ్వాలనుకున్న.

కానీ హఠాత్తుగా కత్తి పుస్తకాలను కొనేసరికి నిరుత్తరుడనయిపోయా!

ఆతరువాత మళ్ళే చూపులు, ఎదురుచూపులుఇ, నిరాశలు, నిట్టూర్పులు…….

దుకాణాలు కట్టేఅయమని ప్రకటించటంతో మూసేస్తూంటే ఒకాయన పరుగున వచ్చాడు. ఆశగా పుస్తకాలు చూపా. నవ్వి తెలుగు నహీ ఆతా అంటూ వెళ్ళిపోయాడు.

ఈ మొదటి రోజు పుస్తక విక్రయానుభవం నాకు మజ్రూహ్ గాజల్ ను గుర్తుకు తెచ్చింది.

హం హై మతాయె కూచవో బాజార్ కీ తర్హా
ఉఠ్ తీ హై హర్ నిగాహ ఖరీదార్ కీ తర్హా.

నేను బజారులో వస్తువులా నిలుచున్నాను. ప్రతీవాడూ నన్ను కొనేవాడిలానే చూస్తాడు.

ఇది ఒక వేష్య స్థితిని వర్ణిస్తూ రాసిన పాట. ప్రస్తుత సమాజంలో రచయితకేకాదు, ప్రతి ఒక్కరికీ ఏదో ఒక సందర్భంలో వర్తిస్తుందీపాట.

దుకాణం కట్టేసి కారు తీస్తూంటే పోలీసు చాయి డబ్బులడిగాడు. ఎలాగో అనిపించింది. డబ్బులిచ్చి బయటపడ్డా.

చల్లగాలి రివ్వు రివ్వున తాకింది. హాయిగా అనిపించింది.పెదవులపైకి పాట వచ్చింది.

దిల్పె ఆస్రా కియే హం తొ బస్ యుహీన్ జియే
ఎక్ కదం పె హస్ లియే ఎక్ కదం పె రోలియే
జోభి ప్యార్ సే మిలా హం ఉసీకె హోలియే
హుం హై రాహి ప్యార్ కే హం సె కుచ్ న బోలియే.

అమ్మకాల అనుభవాలను తలచుకుని నవ్వుకుంటూ ఇల్లు చేరాను. రాస్తే అచ్చువేసి అమ్ముతూ పడాల్సిన బాధలు మరచి రాత ఆరంభించాను.

దీవాన ముఝ్ కో లోగ్ కహే
మై సంఝూ జగ్ హై దీవానా!

అభిప్రాయములు »

  1. ఈ బ్లాగు టపాకు ధన్యవాదాలు.

    ఏ మూలనో పుస్తకం ప్రచురించాలనే కోరిక ఇంతటితో సరి.

    వ్యాఖ్య ద్వారా chavakiran — డిసెంబరు 20, 2008 @ 1:40 పూర్వాహ్నం | జవాబు

  2. మీ స్టాలు ఎక్కడుందో (నేను ఎక్కువ తిరిగి వెతుక్కోకుండా…) చెప్పండి! ముందు డైరెక్టుగా వచ్చేస్తాను.

    వ్యాఖ్య ద్వారా సుజాత — డిసెంబరు 20, 2008 @ 3:26 పూర్వాహ్నం | జవాబు

  3. సుజాత గారూ

    మా స్టాలు నంబరు ’0′.అడుగు పెట్టగానే ఎడమ వైపు వుంటుంది. మా శ్తాలులో నా పుస్తకాలతో పాటూ కోడిహళ్ళి మురళీ మోహన్ పుస్తకాలు, ఏ ఎస్ లక్ష్మి గారి అద్దంలో మనం కూడా వుంటాయి. అయితే, నేను ఇవాళ్ళ, రేపు వుండను. సోమ వారం నుంచి ప్రతి రోజూ వుంటాను.

    చావా కిరణ్ గారూ,

    భయపడితే ఎలా? పుస్తకాలు ప్రచురించి అమ్మటాన్ని చాలెంజిలా తీసుకోవాలి. ఇదీ మీ సాఫ్ట్ వేర్ ప్రోగ్రమింగ్ లాంటిదే.solutions సాధించాలి. ఒక్కరు దారి చూపితే మిగతా అంతా అనుసరిస్తారు. కలిసాముకదా, మనం మేధావులమంతా కలసి సమస్య పరిష్కారానికి బుర్రలను పదనుపెడదాము. మనము మన పని చేస్తే మన తరువాత తరాలవారు వారి పని చేస్తారు. make it a better place for u and for me and the entire humana race. సరేనా! పదండి మీరు ప్రచురించాలనుకుంటున్నదాన్ని కస్తూరి ప్రచురణల పేరిట ప్రచురిద్దాం.

    వ్యాఖ్య ద్వారా కస్తూరి మురళీకృష్ణ — డిసెంబరు 20, 2008 @ 5:01 పూర్వాహ్నం | జవాబు

  4. I have couple of questions about your writings here. You wrote “ఒక కమ్మ పుస్తకాల ప్రచురణకర్తలు “.
    1) Are you referring Kamma Caste? If yes. What is your Caste? Why you highlight the Caste here? Are you a hardcore Casteist?
    2) Are you a impersonation of Katthi?
    3) Can you provide list of your books? so people know what kind of books you write?
    4) Are you a Hindu Dalit? Are you a Christian Dalit?
    Answers to the above questions will reveal your identity?

    వ్యాఖ్య ద్వారా Ck rao — డిసెంబరు 20, 2008 @ 5:18 పూర్వాహ్నం | జవాబు

  5. రాయటం ఒక ఎత్తయితే, దానిని పదిమందికీ చేరవేయటం మరొక ఎత్తు.
    చాలా చక్కగా వర్ణిస్తున్నారు.
    ఇప్పుడు రచయితలు, తమ తమ పుస్తకాలను, అచ్చువేయించుకోవటం, మిత్రులకు, బంధువులకు బహుమతి ఇచ్చుకోవటము మినహా మరో మార్గం కనిపించటం. లేదు.
    విశాలాంద్ర వారికి పంపించినా, ఏరకమైన రెస్పాన్స్ ఉండటం లేదు.
    నాకు తెలిసి సొంతంగా ప్రచురించుకొన్న నామిత్రుల పరిస్థితి ఇదే.
    తెలుగునాడుకి గుండెకాయవంటి హైదరాబాదులోనే పరిస్థితి ఇలా ఉందంటే, మరి చిన్న చిన్న వూళ్ల పరిస్థితి ఊహించుకొనవచ్చును.
    ప్రచురుణ కర్తలకు ఇప్పటికీ ఇంకా 50 సంవత్సరాల నాటి రచయితల రచనలేతప్ప కొత్త తరం రచనలు కనిపించకపోవటం శోచనీయం. (నేను ఆఆ రచనలను తక్కువచేయటం కాదు)
    మీ ఈ పోస్టులలో ఆ ఆ పరిస్థితులను కళ్లకు కట్టినట్లు వర్ణిస్తున్నారు.
    గత సంవత్సరం “యానం విమోచనోద్యమము” అని చారిత్రిక అంశాలతో కూడిన పుస్తకాన్ని రచించి , మిత్రుడిచ్చిన డొనేషను మరియు కొంత సొంత డబ్బుతోనూ ప్రచురించాను. వాటి అనుభవాలు వీటికి భిన్నమైనవి ఏమీ కావు. probably we are sailing in the same boat
    కిరణ్ గారన్నట్లు ఇంకొంచెం ముందుకు వెళదామంటే భయమేస్తుంది.
    డా. వేమూరి గారిదీ ఇదే అనుభవం అంటున్న ఈ పోస్టు చూడండి
    http://lolakam.blogspot.com/2008/12/blog-post_15.html

    ఈ అంశంపై నాలో గూడుకట్టుకొన్న భావాలు పంచుకొనే మంచి ప్లాట్ ఫారం నిచ్చారు ధన్యవాదాలు.

    అభినందనలతో

    వ్యాఖ్య ద్వారా bollojubaba — డిసెంబరు 20, 2008 @ 7:54 పూర్వాహ్నం | జవాబు

  6. స్థల ప్రభావం కూడా అమ్మకాలపై ప్రభావం ఉంటుంది . తెలుగు పుస్తకాలు విజయవాడ , రాజమండ్రి లాంటి చోట్ల ఎక్కువ అమ్ముడవుతాయి అని అనుకుంటున్నాను .

    వ్యాఖ్య ద్వారా శివ బండారు — డిసెంబరు 20, 2008 @ 8:01 పూర్వాహ్నం | జవాబు

  7. నేను , పుస్తకాలు కొన్న మొదటి వ్యక్తికి ఘనంగా సన్మానం చేయాలనుకున్నా. పూల మాల వేఇ సత్కరించి పూజ చేద్దామనుకున్నా. స్త్రోత్ర పాథం రాసి గానం చేద్దామనుకున్నా. అతని పేరు సువర్ణాక్షరాలతో లిఖించి, పుస్తక మహరాజ పోషకుడన్న బిరుదివ్వాలనుకున్న.

    కానీ హఠాత్తుగా కత్తి పుస్తకాలను కొనేసరికి నిరుత్తరుడనయిపోయా!— ఎందుకో??

    వ్యాఖ్య ద్వారా రాజేంద్ర కుమార్ దేవరపల్లి — డిసెంబరు 20, 2008 @ 8:23 పూర్వాహ్నం | జవాబు

  8. ఈ పుస్తక ప్రదర్శన ముగిసే లోపు మీ పుస్తకాల్ని చదవాలి. ప్రస్తుతానికి అదీ నా ప్రయత్నం. అభినందనలు.

    వ్యాఖ్య ద్వారా కె.మహేష్ కుమార్ — డిసెంబరు 20, 2008 @ 9:16 పూర్వాహ్నం | జవాబు

  9. కుడిఎడమైతే పొరబాటు లేదోయ్ అని ఒక సినీకవి అంటే అన్నాడనుకోండి. అంతమాత్రాన సుజాతగారికి రాంగ్ డైరెక్షన్ ఇస్తే ఎలాగండి? అడుగు పెట్టగానే కుడివైపు కదా మీ స్టాల్ ఉంది. ఐనా కమ్మటి పుస్తకాల మధ్య ఈ కమ్మ పుస్తకాల గొడవేంది బాబోయ్?

    వ్యాఖ్య ద్వారా కోడీహళ్లి మురళీ మోహన్ — డిసెంబరు 20, 2008 @ 11:13 పూర్వాహ్నం | జవాబు

  10. బాగా చెప్పారు. కొంతవరకూ నేను ఊహించిందే. రచయితలు పుస్తకాలు ఎలా అమ్ముకోవాలన్నా ఘోరతపస్సే.

    వ్యాఖ్య ద్వారా malathi — డిసెంబరు 20, 2008 @ 12:46 అపరాహ్నం | జవాబు

  11. :) :) :( :(

    వ్యాఖ్య ద్వారా ramya — డిసెంబరు 20, 2008 @ 2:11 అపరాహ్నం | జవాబు

  12. ఇక్కడొక కామెంటు రాసాను మురళీ గారు కనిపించటంలేదు ??? :(

    వ్యాఖ్య ద్వారా రాజేంద్ర కుమార్ దేవరపల్లి — డిసెంబరు 20, 2008 @ 3:18 అపరాహ్నం | జవాబు

  13. ఎందుకు మహేష్, మళ్ళీ వెళ్ళి రిటర్న్ ఇచ్చేయడానికా?… :-) :-)
    That’s a joke. OK

    వ్యాఖ్య ద్వారా Kumar — డిసెంబరు 20, 2008 @ 4:25 అపరాహ్నం | జవాబు

  14. పుస్తక ప్రదర్శన ముగిసే లోపు మీ పుస్తకాల అమ్మకాలని సంతృప్తి కరం గా ముగిస్తారని ఆశిస్తున్నాను.

    స్టాలు నంబరు ’0′ నా? అదేమి నంబరు? ఒకటి నుంచి మొదలెట్టొచ్చుగా? :)

    వ్యాఖ్య ద్వారా ఉమాశంకర్ — డిసెంబరు 20, 2008 @ 8:25 అపరాహ్నం | జవాబు

  15. మురళీ కృష్ణ గారు,
    అమ్మయ్య, writers stall దొరకబుచ్చుకుని మీ పుస్తకాలు ఈ రోజు(ఆదివారం) కొన్నాను.

    వ్యాఖ్య ద్వారా సుజాత — డిసెంబరు 21, 2008 @ 4:52 అపరాహ్నం | జవాబు

  16. ” సోమ శంకర్ మనీప్లాంట్ పుస్తకం చూసి మనీ ఎలా సంపాదించాలో రాసారా? అని ఆశగా అడిగితే, లేదు ఇతర భాషలలోని మంచి కథలను తెలుగులోకి అనువదించాడు అని సమాధానమిచ్చా. ఆయన వెంటనే అంటరాని అసుద్ధాన్ని చీదరించుకుని పారేసినట్టు ఆ పుస్తకాన్ని విసిరేసి వెళ్ళిపోయాడు.”
    నిజమా?
    “మనీ ప్లాంట్” పుస్తకం వేయడం ఆర్ధికంగా నష్టమేనని నిర్ధారణకొచ్చి చాల రోజులయ్యింది. మొదట్లో బాధ పడేవాడిని. రెండేళ్ళు గడిచిపొయాయి. మీరు దాన్ని ప్రదర్శనలో పెట్టడం వల్ల పెద్దగా ఒరిగేదేమీలేదని నాకు తెలుసు.
    పుస్తకం అమ్ముడుపోవడం లేదని, నేను దాన్ని వికాసధాత్రి వారి సహాయంతో “ఈ-బుక్”లా తయారు చేసేసి ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకునే సౌకర్యం కల్పించి కూడా చాలా రోజులయ్యింది.
    జనాలు కొనకపోయినా ఇబ్బందేమీ లేదు. I’ve moved on.
    ఓ పబ్లిషర్‌గా, తోటి రచయితగా మీ ఆవేదన అర్ధమైంది…….. కానీ మీరు వాడిన పదాల ఎంపికే…
    నా పుస్తకం గురిచి నాలుగు మంచి మాటలు చెప్పినందుకు ఆనందం కలిగినా, దానిని కస్టమర్ చేతిలోకి తీసుకుని, తిరిగి పడేసిన తీరు గురించి చేసిన వర్ణన కొంచెం ఇబ్బంది పెట్టింది.
    ఏదేమైనా నెనరులు.

    వ్యాఖ్య ద్వారా సోమ శంకర్ — డిసెంబరు 22, 2008 @ 5:04 పూర్వాహ్నం | జవాబు

  17. [...] ప్రదర్శనలో తన పుస్తకాల అమ్మకాల అనుభవాన్ని సీరియలించారు కస్తూరి [...]

    పింగ్ బ్యాక్ ద్వారా పొద్దు » Blog Archive » 2008 డిసెంబరులో తెలుగు బ్లాగుల ప్రస్థానం — జనవరి 2, 2009 @ 4:36 పూర్వాహ్నం | జవాబు

  18. సమస్య ఎక్కడ వచ్చిందంటే మీరంతా అంతర్జాలంలో రాసే వాళ్ళు. ఇంకా రాటు దేలాల్సిన వాళ్ళు. దిన పత్రికల్లోనో వార పత్రికల్లోనో ప్రచురితం అయ్యాక వాటికి పుస్తక భాగ్యం కలగడం మంచి పద్దతి. ఎప్పుడు రాస్తారా అని పాటకలోకం ఎదురు చూసే అంత చేయి తిరిగిన రచయిత అయితే ప్రచురణ కర్తను వెతుక్కొనే పనే లేదు. ఆరోజు వచ్చే దాక అంతర్జాలంలో సాహితీ సేద్యం చేయండి.

    వ్యాఖ్య ద్వారా srinivas — ఫిబ్రవరి 10, 2010 @ 10:07 అపరాహ్నం | జవాబు


ఆర్ యస్ యస్ ఈ జాబుపై వ్యాఖ్యలకు ఫీడ్ TrackBack URI

ప్రత్యుత్తరమిమ్ము

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )

Theme: Rubric. WordPress.com లో Blog పెట్టుము.

Follow

Get every new post delivered to your Inbox.