అదేమిటో,ఒకో రోజు ఏమీ తోచదు.ఏ పనే చెయ్యబుద్ధికాదు.అటువంటప్పుడు టీవీలో చానళ్ళు తిప్పుతూ కూచుంటే సమయం హాయిగా,ఆనందంగా గడిచిపోతుంది.నాకయితే,పాటల చానళ్ళు,ముఖ్యంగా తెలుగు సినెమా పాటల చానళ్ళు,నోరు కట్టేసి,హీరో హీరోయిన్ల గెంతులు చూడటం సరదా.వాళ్ళ వెర్రి చేష్టలు,పిచ్చి గెంతులు,అర్ధం పర్ధం లేని కదలికలు చూస్తూంటే తెలుగు ప్రేక్షకులకు జోహార్లర్పించాలనిపిస్తుంది.మన టేస్టు అనితర సాధ్యం.ఇటువంటి వాటిఅదేమిటో,ఒకో రోజు ఏమీ తోచదు.ఏ పనే చెయ్యబుద్ధికాదు.అటువంటప్పుడు టీవీలో చానళ్ళు తిప్పుతూ కూచుంటే సమయం హాయిగా,ఆనందంగా గడిచిపోతుంది.నాకయితే,పాటల చానళ్ళు,ముఖ్యంగా తెలుగు సినెమా పాటల చానళ్ళు,నోరు కట్టేసి,హీరో హీరోయిన్ల గెంతులు చూడటం సరదా.వాళ్ళ వెర్రి చేష్టలు,పిచ్చి గెంతులు,అర్ధం పర్ధం లేని కదలికలు చూస్తూంటే తెలుగు ప్రేక్షకులకు జోహార్లర్పించాలనిపిస్తుంది.మన టేస్టు అనితర సాధ్యం.ఇటువంటి వాటి నుంచి వినోదం పిండుకోవటం మనకే సాధ్యం!
ఇలా ఒక రోజు చానళ్ళు తిప్పుతున్నా.అందులో హీరో ఓ హోటల్లో పనిచేస్తూంటాడు.ఒక లవ్ లెటర్ కాలేజీ అమ్మాయిల పుస్తకంలో పెట్టేస్తాడు,రహస్యంగా.తరువాత తెలుస్తుంది,ఒక అమ్మాయి బదులు హీరొయిన్ పుస్తకంలో పెడతాడు.ఆమె తండ్రి దాన్ని చూసి,ఆమెని తిట్టి పెళ్ళి నిశ్చయించేస్తాడు.ఇది తెలిసి హీరో బాధ పడతాడు.’నా వల్ల పొరపాటు జరిగింది.సరిదిద్దుతానంటాడూ.నేను సంతోషించా.తప్పును నిర్భయంగా ఒప్పుకునేవాడు గొప్పవాడు,సరిదిద్దుకునేవాడు మహాత్ముడు.యువతకు గొప్ప ఆదర్శం ఇది.అందరికీ చెప్పాలనుకున్నా.అయితే,నా సగటు బుర్రకు మన సినీ మేధావుల ఆలోచనలు ఎలా అందుతాయి? ఈ పెళ్ళీఅపుతా!అని కాలరెగరేశాడు హీరో!ఓరి దొంగ వెధవా వెళ్ళి నిజం చెప్తే అయిపోయేదానికి పెళ్ళి ఆపాలనే విధ్వంసపుటాలోచనలు చేస్తావేరా భడవా! అని లెంపలు వాయించాలనిపించింది.కానీ అదే సినిమాను మలుపు తిప్పే కీలక సన్నివేశం.ఇలాంటి మెలికల మలుపులు నా లాంటి సగటు మేధ మెచ్చదని చానల్ తిప్పా.
ఆ చానల్ లో ఆసక్తి కరమయిన సంఘటన వస్తోంది.నాయిక ఓ కంపెనీ మేనేజర్ లా వుంది.హీరోని చడామడా తిడుతోంది.వారెవా వుమెన్ పవెర్ అనుకున్నా.ఇంతలో హీరో పళ్ళు బిగించీఏమే నీవెంట తిరుగుతున్నానని నీకు తెలుసు కదే.నిన్ను ప్రమిస్తున్నానని చెప్పా కదే.నన్ను ప్రేమించక పోతే నిన్ను పొడిచి చంపుతానే.నే ముఖం మీద ఏసిడ్ పోస్తానే’అంటూ ప్రేమతో చేయబోయే రాక్షస ప్రేమకృత్యాలన్నీ వర్ణించసాగాడు.నాగుండె దడదడ లాడింది.’ఓరి వీడి పవిత్ర రాక్షస ప్రేమ కూలా!
వీడిలా తిట్టగానే అమ్మాయి గెంతుతూ పాటపాడి జలపాతాల్లో తడిసి ఉల్లిపొర తెల్లదుస్తుల్లో తన ప్రేమ ప్రకటించింది.ఇదా ప్రేమ పొందే విధానం!సగటు మనిషిగా సగం జీవితం గడిపిన నాకు ఙ్నానోదయమయింది.నన్నెవరూ ఎందుకు ప్రేమించలేదో తెలిసింది.’నా హృదయంలో నిదురుంచే చెలీ’ అని పాడితే ఎవ్వరూ పట్టించుకోలేదు.అందుకే మోస్ట్ మోడెర్న్ పాట తయారుచేసుకున్నా.’కాలాష్నికోవ్ తో కాలుస్తా,కోలాలో విషం కలిపి తాగిస్తా,కాల్చే ఆసిడ్ ముఖం మీద పోస్తా,నన్ను ప్రేమిస్తే ఓ సోడాబుడ్డి,నిన్ను నరకంలో రంభను చేసి ఆడిస్తా.లేకపోతే కత్తితో కసా పిసా పొడుస్తా’వహ్వా!ఈ పాటతో ప్రపంచంలో ప్రేమ నింపేస్తా!
ఇంతలో నా సగటు బుర్రకో ఆలోచన వచ్చింది.సినిమాలో హీరోయిన్ ను హీరో తిట్టినా,కొట్టినా,బెదిరించి భయపెట్టి రాక్షసుడిలా ప్రవర్తించినా,ఇంత కూడా గౌరవం ఇవ్వకుండా చులకనగా చూసినా అందరూ మెచ్చుకుంటారు.మరి నిజ జీవితంలో ఇలా చేసే కుర్రాళ్ళని ఉరితీయాలని,జైళ్ళలో తోయాలని డిమాండ్లెందుకు చేస్తారు?ఏమిటో,నా సందేహం విని ఇంట్లోవాళ్ళు,ఎవ్వరూ టీవీ చూస్తే ఆలోచించరు.ఆలోచిస్తే టీవీ చూడరు ‘అన్నారు.
ఆలోచిస్తాను కాబట్టే నేనున్నాను అని తత్వవేత్తలంటూంటే,ఆలోచనల్లేకుండా బ్రతకమంటారేమిటి?తిట్టుకుంటూ ఫారిన్ చానెల్ తిప్పా.ఈ విదేషీయులకు బ్రతకటం రాదు.జీవితాన్ని అనుభవించటం రాదు.మనమేమో ఎంచక్కా ప్రేమిస్తూ బతుకుతూంటే వీళ్ళు చెట్లెంట,పుట్టలెంట,పిట్టలెంట,గుట్టలెంటా పడి పరిశోధిస్తూ తిరుగుతారు.చెట్లు పుట్టలెంట తిరిగితే ప్రేయసి కోసమే తిరగాలని తెలియదు వీళ్ళకు.పాపం పురుగులు,పువ్వుల వెంట పడి జీవితాన్ని వ్యర్ధం చేసుకుంటున్నారు.ఏమిటో ఎంతవద్దన్నా ఆలోచనలు వస్తూనేవున్నాయి.ఎవరయినా ఆలోచనలు ఆపే అద్భుత యంత్రం కనుక్కుంటే బావుంటుంది.ఏమీ తోచక టీవీ నోరుకట్టి తెలుగు పాటల గెంతులు చూస్తూ కూచున్నా.ఇదే బాగుంది!
(25-5-2008 ఆదివారం ఆంధ్రప్రభ అనుబంధంలో ప్రచురితమయింది.)
మే 27, 2008
సగటు మనిషి స్వగతం-2
1 వ్యాఖ్య »
ఆర్ యస్ యస్ ఈ జాబుపై వ్యాఖ్యలకు ఫీడ్ TrackBack URI
I am agree with u, but who we shall make responsible for this, the producer of the movie, director, hero, heroin or other technicians or the government who issue certificate for its release. Not only movie, u can observe the TV serials, when ever u on a channel which telecost TV serial u will find more than 4 lady charecters among them three must be wiping, crying one charecter enjoying the situation, i dnt in real life the lady will do like this. I am not able to understand either we r following and encouraing the TV/film makers to go with such kind of movies or serials, or they make us to turn on to their production, god knows, any how ur comments on movie cld make some body to think of it.
వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా Vadthya Ramesh Naik — అక్టోబర్ 30, 2009 @ 7:24 పూర్వాహ్నం |