అభీ న జావో ఛోడ్ కర్
               కె దిల్ అభీ భరా నహీన్
అహాహా!

పాట ఆరంభంలో రఫీ మృదువుగా,బ్రతిమిలాడుతున్నట్టుగా,హృదయంలోని ఆర్తిని స్వరంలో నింపుకుని,పదాలలో చిలికిస్తూ పై పంక్తులు పలుకగానే మనసు మధురంగా స్పందిస్తుంది.భీ అంటూ కాస్త దీర్ఘంగా పలికి జా దగ్గర వొత్తి చిలిపితనాన్ని చిలకరించి,ఛొ దగ్గర వదలివెళ్ళద్దన్న అభ్యర్ధనను  జాలిగా పలికించి,కర్ అంటూ దాదాపుగ చేతులో,కాళ్ళూ పట్టుకుని వేడుకుంటున్న భావాన్ని ప్రకటిస్తూ హృదయం లోని ప్రేమనూ,సృంగారాన్ని ప్రతి పదంలో ప్రదర్శిస్తూ రఫీ పాట ఆరంభించగానే తెలిసిపోతుంది,ప్రేయసీ ప్రియుల శృంగార భావనికి పరాకాష్ట ఈ పాట అని.
సినిమాలో,సాయంవేళ,అందమయిన తోటలో,ఆహ్లాదకరమయిన ప్రకృతి వొడిలో పరవశించి జగతిని మరచిన ప్రేమికులు కనిపిస్తారు.అప్పటికే చాలా ఆలస్యమయిందన్న తొందరలో ప్రేయసి ప్రియిడిని ఆ పరవశపు మత్తులోనే వుంచి శబ్దం కాకుండా వెళ్ళిపోవాలనుకుంటుంది.అతడి చేతిలో వున్న కొంగును తప్పించుకుని అడుగు ముందుకు వేస్తుంది.ఆమె ఎంత గడుసుదో,అతడంత అల్లరి వాడు.ఆమె కదలికకు లేస్తాదు.కొంగు పట్టుకుని వదలడు.ఆపయిన అప్పుడే విడిచి వెళ్ళొద్దని బ్రతిమిలాడుతున్నాడు.కరగని ప్రయసి హృదయం బండ.కానీ ఆవల నిర్దాక్షిణ్య సమాజం అవకాశం కోసం ఎదురుచూస్తఒంది.కాకుల్లా పొడిచి,కసాయిలా ప్రేమను కోసేందుకు సిద్ధంగా వుంది.పాపం అ అమ్మాయి ఏం చేస్తుంది?ప్రియుడిని కాదనలేదు.సమాజాన్ని ఎదిరించి నిలవలేదు.అతడిని వదిలి వెళ్ళాలని అమెకూ లేదు.కానీ వెళ్ళక తప్పదు.పైగా అతడలా బ్రతిమిలాడుతూంటే అతడి పయిన ప్రేమ పొంగి వరదలవుతుంది.కానీ,నిస్సహాయ స్థితి.
ఆ ప్రేయసి అందాల సాధనా అయితే,ప్రేమికుడు నిరుపమాన నీటుకాడు దేవానంద్ అయితే,ఇక ప్రేక్షకుల మనసులలో ఆనంద శృంగార రస ప్రవాహం పొంగి పొర్లటంలో ఆశ్చర్యం వుందా?
హందోనో,సినిమాలోని ఆరంభ సన్నివేశం ఇది.చెట్లలోంచి సంధ్య సమయపు ధూళి కలసిన పొగమంచు లాంటి వెలుతురు పడుతూంటుంది.చుట్టూ చల్ల గాలికి పూల గుత్తులు తలలూపుతూంటాయి.ప్రేమికుల కాల కొలతలే వేరు.ప్రపంచానికి గంటలు వారికి క్షణంలో వెయ్యవ వంతు.ఇరువురు కలసి వున్నప్పుడు వారి సమయం స్థంభించి పోతుంది.అదొక ఇతరుల అనుభూతికి రాలేని రసమయ ప్రేమ ప్రపంచంలో వారు విహరిస్తారు.ఎంత సమయం కలసి గడిపినా తనివి తీరదు.అదొక తీరని ఆనందకరమయిన దాహం.అదొక ఎంత తాగిన దాహం తీరని అమృత రస ప్రవాహం.ఆ అనుభూతి స్రవంతిలో ఓల లాడుతున్నంత కాలం మనిషి అమరుడవుతాడు.అలవికాని అమర సౌఖ్యాలు అనుభవిస్తాడు.తనలో తనకే అర్ధంకాని ఆనదలోకాల ఆకృతులు దర్శిస్తాదు.భవిష్యత్తు సుందర స్వప్నాల చిత్రాలను ప్రేయసి కన్నులలో చూస్తాడు.అంత అద్వితీయమూ.అమోఘమూ అయిన సుందర స్వప్నాన్ని భగ్నం చేసి ప్రెయసి వెళ్ళిపోతానంటే ఏ ప్రియుడు వూరుకుంటాడు.ఆమె వెళ్ళక తప్పదని అతడికి తెలుసు.కానీ ఇంకో క్షణం అధికంగా ఆమె సమ్కంలో గడపాలన్న కోరికను అణచుకోలేడు.ఇంకొంత సేపు,ఇంకొంత సేపు అంటూ జీవితాంతం అలాగే గడపాలని అతనికి వుంటుంది.అతని వుద్దేశ్యం ఆమెకి తెలుసు.వెళ్ళాలని లేకున్న,వెళ్ళక తప్పదనీ తెలుసు.అతను వేడుకోవటం,తాను కాదనటం,చివరకు అతి కష్టం మీద తాను విడిపించుకుని వెళ్ళటం ఇదంతా మధురమయిన ప్రేమ ప్రపంచంలో ఎన్నటికీ మరపుకురాని,మధురమయిన ప్రేమ ఆట అని అందరికీ తెలుసు.ఒక వేళ ఏ ప్రియుడయినా బ్రతిమిలాడకపోతే ప్రేయసి పడే నిరాశ కూడా అందరికీ తెలుసు.కానీ,శృంగార ప్రపంచంలో ప్రాణవాయువు లాంటిదీ ఆట.ఆ ఆటకు అందమయిన ప్రతిరూపం ఈ పాట.
       అభీ అభీతొ ఆయిహో,బహార్ బంకె ఛాయిహో
        హవా జరా మహక్తొ లే,నజర్ జరా బహెక్ తొ లే
        యె శ్యాం ఢల్తొ లేజరా,యె దిల్ స్మభల్ తొ లే జరా
        మై థోడి దేర్ జీతొ లూ,నషేకి ఘూంట్ పీ తొ లూ
        అభీతొ కుఛ్ కహ్హ నహీ,అభీ తొ కుచ్ సునా నహీ
పదడంబరమేలేదు.కేవలం ఉన్నది వున్నట్టు వర్ణిస్తున్నాడంతే.కానీ ఎంత మృదువుగా,మధురంగా,శృంగార రసప్లావితంగా వున్నాయో పదాలు.మామూలు పదాలే అయినా మనసులో శృంగార స్రవంతుల ధారలు పొంగి పొర్లేట్టు చేస్తున్నాయి పదాలు.
ఇప్పుడే వచ్చావు.వసంతంలా వచ్చావు. నీ రాక వల్ల పూచిన పూల పరిమళం ఇప్పుడిప్పుడేఅ గాలులు పీలుస్తున్నాయి.ఇంకాస్సేపు వుంటే గాలులు పూర్తిగా పరిమళ భరితం అవుతాయి.ఇంకాస్త చీకటి పడనీ.నా హృదయానికి కాస్త శాంతి దొరకని.న్వ్వొచ్చావన్న ఆనదం అనుభవించేలోగా వెళ్తానంటున్నావు.హృదయాన్ని కాస్త కుదుట పడనీ.నీ సాహచర్యం లోని మత్తును ఇంకాస్త అనుభవించనీ.ఇంకా అసలేమీ చెప్పలేదు.అసలేమీ వినలేదు.ఇది ప్రేయసీ ప్రియుల నడుమ ఎప్పుడూ వుండే ఫిర్యాదులే.కానీ వాటిలోనీ ఎంతో శృంగారం దాగి వుంది.ఒకరి కోసం ఒకరు ఎదురు చూడటం,విడిపోవటం,కలవటం,వెళ్ళిపోవటం…ఇదే అసలు శృంగారం.శృంగారం వేరు సెక్స్ వేరు.ఆ తేడా తెలియని సమాజం సెక్స్ వరదలో కొట్టుకు పోతూ సున్నిత శృంగార భావనలను మరచిపోతోంది.అందుకే ఈ కాలం ప్రేయసి ప్రియులలో ఆరాటం వుంది.ఆరాధన లేదు.తాపత్రయం వుంది.తపన లేదు.

    సితారె ఝిల్ మిల ఉఠె,చరాగ్ జగ్ మగా ఉఠె
    బస్ అబ్ న ముఝ్కొ టోక్ న,న బఢ్ కె రాహ్ రోక్ నా
    అగర్ మై రుక్ గయీ అభీ,తొ జా న పావుంగీ కభీ,
    యహీ కహోగె తుం సదా,కె దిల్ అభీ నహీ భరా
    జొ ఖత్మ్ హో కిసీ జగా యె ఐస సిల్సిలా నహీ

నాయిక కూడా వున్నది వున్నట్టే చెప్తోంది.తారలు వచ్చేశాయి.దీపాలు వెలిగాయి.అంటే చీకతి పడింది,ఆలస్యమయిపోయింది బబ్బూ అంటోందన్నమాట.ఇక నన్ను ఆపకు.దారికి అడ్డురాకు.ఇప్పుడు ఆగి పోతే,ఎప్పటికీ వెళ్ళలేను.అయినా నేకు ఎంత చేఇనా సంతృప్తి లేదు.ఎప్పటికీ నీ తనివి తీరదు.ఇద్ పూర్తయే కథ కాదు.ఎప్పటికీ ఇలాగే సాగుతింది,అంటోంది.గమనిస్తే ఈ చరణంలో ఆశా
ఎన్ని వగలు పోతుందో.ఉఠే అంటూ తీసిన రాగం అద్భుతం.టోక్నా,రోక్నా పద్దలను ఎంత వయ్యరంగా పలుకుతుందో గమనించండి.ఎటువంటి వాడికయినా ముద్దొస్తుంది.ముందే పోనివ్వడు.ఇలా పాడితే ఇంకా పోనిస్తాడా?పైగా నీకెప్పటికీ సంతృప్తి లేదు అంటూ మురిపెంగా అంటోంది.రెచ్చగొడుతోంది.అందుకే,
హా దిల్ అభీ భరా నహీ,అంటూ వగలు పోతాడు హీరో.
ఒక పక్క ఆనదిస్తూ,మరో పక్క గాభరా నటిస్తూ,నహీ నహీ నహీ నహీ ,అంటుంది నాయిక.ఈ నహీలో అణువణువునా,హ,వుంది.ఈ పంక్తులు పాడిన విధానం,దానికి నటన ఈ పాటను శృంగార ప్రపంచానికి రారాజును చేస్తాయి.
ఒక్క వెకిలి పదం లేదు.ఒక్క వెకిలి వూహ లేదు.ఒకరినొకరు ఎంతో గౌరవించుకోవటం వుంది.ఒకరి సాంగత్యంలోని మాధుర్యాన్ని మరొకరు అనుభవించటం వుంది.సున్నితంగా ఏడిపించుకోవటం వుంది.వారి సున్నిత శృంగారం మనల్ని శృంగార స్వర్గ ప్రపంచంలోని వున్నత భావాల శిఖరారోహణం చేయిస్తాయి.
    అధూరియాస్ ఛోడ్కే,అధూరి ప్యాస్ ఛోడ్కే
    జొ రోజ్ యూహి జావొగే,తొ కిస్ తర్హా నిభావొగీ
    కె జిందగీకి రాహమె,జవా దిలోకె చాహమె
    కహీ ముకాం ఆయెంగె,జొ హంకో ఆజ్మాయెంగె
    బురానా మానో బాత్ కా,యె ప్యార్ హై గిలా నహీ

ఆమె ఇలా రోజూ వచ్చి ప్రేమ భావనలు జాగృతం చేసి,అతడిని సగంలో వదిలేసి వెళ్తూంటే,ఏదో ఒక రోజు నిరాశలో అతడు మరొకరి వైపు మళ్ళవచ్చు.ఇదే అంటున్నాడు.ఒక రకంగా బెదిరిస్తున్నాడు.ఇదీ మనం ప్రేమలో అనుభవించేదే. బెదిరింపులు,సరసంలో ఒక భాగమే.అయితే,మళ్ళీ ఆమె తప్పు అర్ధం చేసుకుని పోతే ఫో అంటుందేమో అన్న భయం వుంది.అందుకే,తప్పుగా అనుకోకు,ఇది ప్రేమ తప్ప ఫిర్యాదు కాదు,నిష్ఠూరం కాదు అని సర్దుకుంటున్నాడు.
అతడి ఆటలు ఆమెకు తెలుసు.తనని వదిలి ఎక్కడికీ పోడని తెలుసు.అయినా అతడి అహాన్నీ సంతృప్తి పరచాలి.అందుకే,మళ్ళీ నహీ నహీ అంటుంది.ఇక్కడకూడా నహీ లో హా ఎక్కువగా వుంతుంది.
అభీనహీ అని జాలిగా బ్రతిమిలడుతున్న హీరో ను మురిపెంగా చూస్తూ అందంగా హయిగా వెళ్ళిపోతుంది.
అద్భుతమయిన అమలిన శృంగారానికి అద్వితీయమయిన తీపి గుర్తు ఈ పాట.ఇందులో దేవ్,సాధనాలు శృంగారానికి జీవంపోస్తే ఎలావుంటారో అలా వుంటారు.రఫి ఆశాలు శృంగార స్వరనికి ఆకృతులు.
జయదేవ్ సంగీతం శృంగార గంగా ప్రవాహంలో సుళ్ళు తిరిగే అలల ఉపరితలం పయిన తళ తళ లాడే కిరణాల ప్రేమికుల నర్తనానికి తాళం వేస్తున్నట్టుంటుంది.
పాట రాసిన సాహిర్ ప్రతి పదంలో తాను అనుభవించిన శృంగార భావనలను ఎంతో శ్రద్ధగా,ఆర్తితో,పొదగటం కనిపిస్తుంది.మామూలు మాటలకింత శక్తి సాహిర్ హృదయ లోతులలోంచి జనించటం వల్ల అబ్బింది.(సాహిర్ గురించి మరో సారి)
ఇంత మంది కళాకారులు మనస్ఫూర్తిగా తమ మనసులలోని సున్నితమయిన భావాల పుష్పాలను ఏర్చి కూర్చి కళామతల్లికి అమిత ప్రేమతో భక్తితో సమర్పించారు కాబట్టే ఆ పాటలు ఈ నాటికీ సజీవంగా వున్నాయి.బండరాతి హృదయాలలో కూడా సున్నిత శృంగార భావాల బీజాలు నాటుతున్నాయి.