కొందరి అద్రుష్టం ఇంతే.వాళ్ళకు ప్రతిభ వుంటుంది కానీ ఎవ్వరూ గుర్తించేందుకు ఇష్ట పడరు.కానీ,అందరికీ వారి అవసరం వుంటుంది.అలాగని,వారి ప్రతిభ చూపించుకునే అవకాశం వస్తే,చిత్తుగా దెబ్బ తింటారు.అటువంటి దురద్రుష్టవంతుల్లో అగ్రస్థానం రాహుల్ ద్రావిడ్ దే.
రాహుల్ ఎప్పుడు బాగా ఆడినా అందరి ద్రుష్టి,వేరే మరో ఆటగాడిపయిన వుంటుంది.మొన్నకూడా,రాహుల్ పది వేల పరుగులను,సెహ్వాగ్,మూడు వందలు మింగేసాయి.అందరి ద్రుష్టి ప్రధానంగా,సెహ్వాగ్ పయినే వుండి పోయింది.ఇతర టెస్ట్ ఆటల్లో కూడా,అందరూ పిచ్చి షాట్లు కొట్టి అవుటయితే,రాహుల్ కు మాత్రం ఎవరయినా ఆడలేనంత అద్భుతమయిన బంతులొచ్చాయి.ముఖ్యంగా,అహ్మదాబాద్ రెండు ఇన్నింగ్స్ లోనూ,కాంపుర్ మొదటి ఇన్నింగ్స్ లోనూ ఆడలేనటువంటి బంతులొచ్చాయి.దాంతో,రాహుల్ వందకొట్టినా వుండే చిన్నచూపు సున్నాకు మరింత పెరిగింది.
నిన్న,20-20 ఆటలో కూడా,బ్రెండొన్ ఆట,జీవితంలో ఒక్కసారి అలా ఆడతారు.అదీ రాహుల్ జట్టుతో కావటం రాహుల్ దురద్రుష్టం.ఎందుకంటే,ప్రత్యర్ధి అలా ఆడినప్పుడు,ఎవరు మాత్రం చేసేదేమీ లేదు.ఎవరు ఓడిపోయినా,సానుభూతి తో చూస్తారేమో కానీ,రాహుల్ ఓడితే మాత్రం,నేరం రాహుల్ దే.
అతడు 20-20 కి పనికి రాడని,అతని పని అయిపోయిందనీ,వ్య్యాఖ్యలు వస్తున్నాయి.రాహుల్ అలోచనా పరుడయిన ఆటగాడు.కానీ మన దేశంలో,మాటలకు,అరుపులకు వున్న విలువా,మౌనానికి,ఆలోచనకు లేదు.అదీగాక,అతడికి అద్రుష్టం లేదు.గెలుపు అన్ని అవలక్షణాలను కప్పి పుచ్చుతుంది.ఓటమి,మంచిని కూడా,పనికిరానిదిగా చేస్తుంది.అందుకే,అంగట్లో అన్నీవున్నా,రాహుల్ గతి మాత్రం,అయ్యో పాపం!
ఏప్రియల్ 19, 2008
పాపం ద్రావిడ్!
అభిప్రాయములు »
ఆర్ యస్ యస్ ఈ జాబుపై వ్యాఖ్యలకు ఫీడ్ TrackBack URI
అద్రుష్టం కాదు మహాప్రభో … అదృష్టం…. లేఖిని లో adRshTaM….
వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా Mr Annonymus — ఏప్రియల్ 19, 2008 @ 7:53 పూర్వాహ్నం |
అనామకుడు గారూ,
బహు కృతఙతలు.అదృష్టం.అదృష్టం.ఈ తప్పు మరోసారి జరుగదు.
వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా కస్తూరి మురళీకృష్ణ — ఏప్రియల్ 19, 2008 @ 8:15 పూర్వాహ్నం |