రాతలు – కోతలు

ఏప్రియల్ 15, 2008

పత్రికలూ-బ్లాగులూ-రచయితలూ!

ప్రచురించిన వర్గము Uncategorized — కస్తూరి మురళీకృష్ణ @ 10:41 పూర్వాహ్నం

ఇటీవలే ఒక బ్లాగులో ప్రతివారూ విమర్శకులయిపోతున్నారని చులకనగా రాసినది చదివాను.బాధ అనిపించింది.ఎందుకంటే,బ్లాగు రచనకు పత్రికల రచనకు తేడా వుంది.పత్రికలలో సంపాదకులుంటారు.బ్లాగులలో బ్లాగరే సంపాదకుడు.వ్యంగ్యంగా అన్నా ఎవరి బ్లాగుకు వారే సుమన్ అన్నది అక్షరాలా నిజం.
ఒక రచన పత్రికలో పడాలంటే ఎటువంటి పరిచయాలు లేని రచయిత ఎన్నో అవమానాలు ఎదుర్కోవాల్సివుంటుంది.ఎంతో అవేదనకు గురి కావాల్సివుంటుంది.ఒకోసారి ఇన్ని బాధలు పడుతూ ఎందుకు రాస్తున్నాడో రచయితకే అర్ధం కాదు.రాయటం మానేయాలనుకుంటాడు.కాని రచన అనేది ఒక తీరని దాహం.రాయకుండావుండలేను వాడే రచయిత అవుతాడు.రాయాలనుకున్నా అవరోధాలను అధిగమించలేనివారు రచయితలు కాలేరు.అందుకే ఎన్నో చేదు అనుభవాలను ఎదుర్కొంటూ కూడా రచయితలు రచనలు చేస్తూనే వుంటారు.
నేను రచనలు ఆరంభించిన కొత్తల్లో నా అనుభవాలు ఇప్పుడు గుర్తుకు తెచ్చుకుంటే ఆస్చర్యం వేస్తుంది.ఒకింత గర్వం కలుగుతుంది కూడా!
ముందుగా,ఒక చోట కూర్చుని ఏదయిన రాయగలగటం ఒక యఞానికేమీ తక్కువ కాదు.పెన్ను దొరకదు.కాగితాలు నచ్చవు.అన్నే కుదిరితే రాయాలనుకున్నది ఆవిరయిపోతుంది.ఎవరో వొస్తారు.ఏదో పని వస్తుంది.ఏదో చికాకు కలుగుతుంది.ఇవన్నీ దటుకుని రచన పూర్తి చేస్తే దాన్ని ఎవరికి పంపాలో అన్నది సమస్య.కొన్ని పత్రికలు సంవత్సరాల తరబడి రచనలు దగ్గర పెట్టుకుంటాయి.స్వీకరించరో,తిరస్కరించారో తెలపవు.ఒకటికి రెండు సార్లు అడిగితే,మీ కథ తీసుకుపొమ్మంటాడు.అందుకని ఎదురుచూస్తాం.మంచి మూడులో వుంటే స్వీకరించాం.వీలువెంబడి ప్రచురిస్తాం అంటారు.ఆ వీలు కోసం ఎదురుచూడాలి.ఏమయినా అంటే రచయిత కోపం కథకు చేటు.
ఇక కొందరువుంటారు వారికి ఏ కథ నచ్చదు.రచయితను నాలుగుమార్లు తిప్పుకుని,మార్పులు చేయించి,వాడి అహాన్ని అణగద్రొక్కితేగాని రచన ప్రచురించరు.చివర్లో మళ్ళీ వాళ్ళ స్వంత పయిత్యం చూపందే వారికి సంత్రుప్తిరాదు.వారు ఎంతకు ఎదుగుతారంటే అనువాద కథలో కూడా మార్పులు సూచిస్తారు.
ఒకసారి నేను తొలివేకువ అనేపదం వాడితే,మీరు సంస్క్రుతం రాస్తే ఎవరికి అర్ధమవుతుందండి?అని చీవాట్లు పెట్టి ఆ పదం స్థానంలో పల్లవించు అన్న పదం వుంచాడు.ఇది అసలు సంస్క్రుత పదం అన్నందుకు నా కథ పనికి రానిదయిపోయింది.
ఇంకా కొందరుంటారు.ఇదిగో వేస్తాం,అదిగో వేస్తాం అంటూ ఆరు సంవత్సరాలు గడిపి బాగాలేదండి అని వాపస్ ఇచ్చేస్తారు.అప్పటికి మనకు ఇంకా రాయాలని వుంటే మనం గొప్ప రచయితలమే!
ఇవన్నీ ఒకేత్తు,సంపాదించేవాడే సంపాదకుడు అనేవారు ఒక ఎత్తు.కథ వేస్తే నాకేంటట అంటారు?మనం తెల్ల మొహం వేస్తే మన కథ ఇంటికే.ఏమయినా సమర్పించుకోవాలి.బహుమతి దబ్బులు వద్దన్నవాడికి బహుమతులొస్తాయి.అన్నిటి పయిన మమకారాలు వదలుకుని,కేవలం అచ్చులో పేరు చూసేందుకు ఏమయినా చేసేందుకు సిద్ధంగా వున్న వారి కథలు పుంఖాను పుంఖాలుగా పడతాయి.జీ హుజూర్ భత్రాజులకు బాధలేదు.ఇజాలలో,వుద్యమాలలో,పెద్దవారి పరిచయస్తులు,మంచి వుద్యోగాలు వున్నవారు ఇటువంటి వారికి సమస్యలుండవు.ఈమధ్య ఎన్నారయిల రచనలను ప్రత్సహించటం ద్వారా విదేశీ ట్రిప్పులకెళ్ళవచ్చని వారికథల ప్రచురణ ఎక్కువవుతోంది.ఎన్నారయిలు కూడా స్వయంగా ఇక్కడకువచ్చి చూడలేరు కాబట్టి వారి పరిచయస్తులను నమ్ముతారు.డబ్బులిచ్చి టీవీలలో కనబడేవారు,డబ్బులుచ్చి కథలు నవలలు వేయించుకునేవారికి నో ప్రోబ్లెంస్.అలాకాక కేవలం ప్రతిభ పయిన ఆధార పడేవారికి చేదు అనుభవాలు మిగులుతాయి.

మిగతావారు మమూలు కథ రాస్తే సరిపోతుంది.మాలాంటివారు అద్భుతమయిన కథ రాస్తే తప్ప ప్రచురణకు నోచుకోదు.దాంతో అద్భుతంగా రాయటం అలవాటయిపోతుంది.ఇక్కడే మామూలు రచయితకు అసలు రచయితకు తేడా తెలుస్తుంది.
అయితే కథ ప్రచురణతో కథ అయిపోదు.దాన్ని చదివి స్పందించే వారు దొరకరు.అందరూ కాంప్లిమెంటరీ అడుగుతారు.కథ పడ్డందుకు దబ్బులురావు.కొంప్లిమెంటరీలకు ఖర్చవుతుంది.ప్రచురితమయిన కథని బ్రతికించుకోవాలంటే కథల సంకలనం అచ్చు వేయలి.కథ రాస్తే ఒక్క పయిసా రాదుకాని,అచ్చుకి వేలు ఖర్చు అవుతాయి.మళ్ళీ అందరూ కొంప్లిమెంటరీ అడుగేవారే.చదివి అభిప్రాయం ఎవ్వరూ చెప్పరు.
నేను ఎంతో క్లుప్తంగా రచయితల బాధలు వివరించాను.
ఒక పత్రికలో తన కథకు వేసిన బొమ్మను చూసి రచయిత బాధ పడ్డడు.సంపాదకుడిని కలిసి తన భ్యంతరం చెప్పాడు.దానికి అతడి సమాధనం ఏమిటంటే,మీ కథకు తగ్గ బొమ్మ వేసే పత్రికలొ ఐక పయిన కథలు రాయండి.
మరో సందర్భంలో తన కథ అచ్చులో వచ్చిన తప్పులను రచయిత చూపాడు.దానికి సమాధానం మీ చేతిరాత బాగాలేదు.డిటిపి చేసి పంపండి.
ఇదిగో ,ఇలాంటి అనేక బాధలుంటాయి.ముఖ్యంగా మీ కథ ఎంత గొప్పదయినా ఆ కుర్చీలో కూచున్నవాడికి నచ్చక పోతే అది ఎందుకూ పనికి రానిదే.
బ్లాగులో ఇలాంటి బాధలు లేవు.నాకు నచ్చింది నేను రాస్తాను.మీకు నచ్చితే చదువుతారు.లేకపోతే పట్టించుకోరు.స్పందన నాకు వెంటనే తెలుస్తుంది.అందుకే వారానికి యేడు వేర్వేరు పత్రికలలో యేడు వేర్వేరు శీర్శికలు రస్తూకూడా వారానికి యేడు రఒజులు బ్లాగులో ఏదోఒకటి పోస్ట్ చేస్తున్నాను.ఇప్పుడే రాత కూడా ఏ పత్రికలోనూ రాయలేను.బ్లాగు కాబట్టి ఇంత స్వేచ్చగా రాస్తునాను.
ఇప్పుడు మీకు ఒక అనుమానం రావచ్చు.నావి ఇన్ని ఎలా ప్రచురితమవుతున్నాయని.దీని వెనుక పదహారేళ్ళ నిరంతర పోరాటం వుంది.అదీగక నా అద్రుష్టం బాగా   వుంది.నన్ను నా ప్రతిభను చూసి నిస్వార్ధంగా ప్రోత్సహించే వారు ఆ సమయానికి ఆయా స్థానాలలో వుండటం దైవికం.అందుకే రోజూ సరస్వతీ దేవికి నమస్కరిస్తూంటాను.నా బాధ్యతను,కర్తవ్యాన్ని సంక్రమంగా నిర్వహించేట్టు చేయమని ప్రార్ధిస్తూంటాను.నా పరిధిలో వీలయినంత రచయితలకు సహాయం చేస్తూంటాను.బాగారాసే రచయితలపయిన పాఠకుల ద్రుష్టి ప్రసరింపచేస్తూంటాను.కాబట్టి బ్లాగులలో ఎవరు రాయాలి,ఎందుకు రాయాలీ అని ఆక్షేపించేకన్న,వ్యక్తి కి సంపూర్ణ భావ వ్యక్తీకరణ వున్న బ్లాగులను ప్రోత్సహించాలి.నిర్మొహమాటమయిన అభిప్రాయాలతో సూచనలు చేయాలి.అయితే,ఎవరి బ్లాగుకు వారే సుమన్లయినా ఎవరికి వారు విచక్షణని సమ్యమనాన్నీ పాటించాలి.ఒకరికొకరు చేయూతనిస్తూ కలసి ముందుకు సాగాలి.

అభిప్రాయములు »

  1. Agree.

    వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా chavakiran — ఏప్రియల్ 15, 2008 @ 12:47 అపరాహ్నం | జవాబు

  2. Great blog!

    వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా Sarath — ఏప్రియల్ 15, 2008 @ 1:30 అపరాహ్నం | జవాబు

  3. మంచి చర్చనీయాంశాలు లేవనెత్తారు.అభినందనలు.

    వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా రాజేంద్ర — ఏప్రియల్ 15, 2008 @ 5:46 అపరాహ్నం | జవాబు

  4. బాగా చెప్పారు.
    అసలు అదీ కాకా .. మీరు మొదట్లో ప్రస్తావించిన ఆ టపా నేనూ చదివాను. వారు బ్లాగుల కనీసోద్దేశమే మరచినట్టున్నారు. నవ్వులాటగానో, ఎకసెక్కెంగానో అనుకున్నా – “నా బ్లాగుకి నేనే సుమన్” అనే నినాదం 100% కరక్టే. మన బ్లాగులో మన అభిప్రాయం – అది పుస్తకం గురించో, సినిమా గురించో, రాజకీయం గురించో, ఏవీ లేకపోతే ఏవీ లేకపోవడం గురించో – రాసుకోడానికి ఇంకోళ్ళకి సంజాయిషీ చెప్పాల్సిన పని లేదు.

    వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా కొత్త పాళీ — ఏప్రియల్ 15, 2008 @ 9:15 అపరాహ్నం | జవాబు

  5. మురళీగారూ,
    ఈ టపాలో మీరు వ్యక్తం చేసిన అభిప్రాయాలతో నేనూ ఏకీభవిస్తున్నాను. దాదాపుగా నేను ఇలాంటి పరిస్థితులనే ఎదుర్కున్నాను.
    ఫీల్డులో ఎటువంటి సపోర్టు, బాక్అప్ లేని రైటర్లందరు ఎదుర్కునే ఇబ్బందే ఇది. దీనికి విరుగుడు ఏంటంటే రాసే ప్రతి కథ అత్యుత్తమంగా ఉండాలి. అటువంటి కథ వచ్చినప్పుడు దాన్ని ప్రచురించకుండా ఎంతో కాలం ఉంచలేరు. ఇది పత్రికకి, రచయితకి win-win situation అవుతుంది.
    నెనరులు,
    సోమ శంకర్

    వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా kolluri soma sankar — ఏప్రియల్ 16, 2008 @ 3:39 పూర్వాహ్నం | జవాబు

  6. బాగుంది.

    వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా సత్యసాయి కొవ్వలి — ఏప్రియల్ 16, 2008 @ 5:29 పూర్వాహ్నం | జవాబు

  7. మురళి గారు,

    మీ రచనలు నేను చదువుతాను, బ్లాగులోనే కాదు, పత్రికల్లోనూ! రచయితగా నెగ్గుకురావడం ఎంత కష్టమో బాగా చెప్పారు. నేను ఒక దిన పత్రికలో సబెడిటర్ గా పని చేస్తున్న రోజుల్లో, ఇతర పత్రికలకు కథలు రాస్తే (అప్పట్లో నేను ఆంధ్ర జ్యోతి వారపత్రికకు కథలు రాసే దాన్ని) ఒప్పుకునే వారు కాదు. పోనీ వీళ్ళకే రాద్దామంటే, కథ సబ్జెక్టు (ఆదివారం ఎడిటర్ కన్నా కాదు) పత్రిక చైర్మన్ కి నచ్చాలి. స్వేచ్చ ఉండేది కాదు. వేరే పత్రికలకు రాస్తే కలం పేరుతో రాయాల్సి వచ్చేది. ఇక డబ్బులంటారా, బయటివాళ్ళకే గతి లేదు, స్టాఫ్ సంగతి చెప్పాలా? పైగా, ఒకసారి డిటిపి లో చేయడం అలవాటైతే, చేత్తో రాయడం నా వల్ల చచ్చినా కాలేదు.

    ఈ దేశం విడిచి వెళ్ళాక (కొన్నేళ్ళు) వెబ్ పత్రికలకు రాశాను. (ఇ-తెలుగు పత్రిక అని…ఇప్పుడు లేదు)

    తర్వాత, భవసాగరం ఈదుతూ, అసలే మానేశాను. ఇప్పుడు కేవలం చదవడమే!

    వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా Sujatha — ఏప్రియల్ 16, 2008 @ 5:58 పూర్వాహ్నం | జవాబు

  8. సుజాత గారూ ఇప్పుడు మరళా మీరు వ్రాయవచ్చు! సారీ బ్లాగవచ్చు :)

    వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా chavakiran — ఏప్రియల్ 16, 2008 @ 7:22 పూర్వాహ్నం | జవాబు

  9. మురళీ కృష్ణ గారూ,

    చాలా చక్కని టపా. పంటి కింద రాళ్లలా యూనికోడ్ ముద్రారాక్షసాలు తగులుతున్నాయి. కాస్త సరిచేయగలరు.

    దిలీప్

    వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా Dileep — ఏప్రియల్ 16, 2008 @ 8:02 పూర్వాహ్నం | జవాబు

  10. meeru nijanni nikkachiga rasaru. abinandanalu

    వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా padma — ఏప్రియల్ 16, 2008 @ 8:10 పూర్వాహ్నం | జవాబు

  11. kasturi garu chala avesham tho wrasaru. Rajendra garu cheppinatlu charchaneeasham.

    వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా pankuri — ఏప్రియల్ 16, 2008 @ 11:30 పూర్వాహ్నం | జవాబు

  12. అవును. blogs .. ఎవరి బ్లాగుకి వారే రాజు. మనిస్టం వచ్చింది రాసుకోవచ్చు. ఎవడకి colour tv లు, VCR లు, VCP లు (అప్పట్లో ఉండేవి లెండి) ఇచ్చే పని లేదు. ఎవరకి చెంచా గిరి, చెక్క బజనలు, చేయాల్సిన పని లేదు. ఎడిటర్ గాడి పెళ్ళం కి కొత్త సినిమా టిక్కెట్లు, పళ్ళు, పూలు, బిర్యానీలు సప్లై చేసే పని లేదు. వాడి కుక్కకి స్నానం, వాడి కొడుక్కి ఫీజులు, వాడికి మందు … ఇవేవి అవసరం లేదు. వాడి పెళ్ళం బట్టలు ఇస్త్రీ … అబ్బో చాల చాలా ఉండేవి లెండి. అవన్ని తప్పాయి చాల మందికి.

    వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా JALLIPALLIK KRISHNA RAO — ఏప్రియల్ 16, 2008 @ 6:58 అపరాహ్నం | జవాబు

  13. thanks to everyone for responding the way u all did.iam trying to lessen mistakes in the post.iam not yet completely used to unicode.in the times weekly issue of april 23,michael kinsley wrote his experiences both as an editor and as a freelance writer.here is an excerpts from his essay which i felt are pertinent to our discussion:
    this is my apology to any writers i may have treated callously over my years as an editor.if i didnt answer your email,iam sorry.if the check was late or the amount less than agreed on,please forgive me.if i shut my office door,turned off lights and hid under the desk when i heard you coming,i deeply regret such childish behavior.
    ON THE INTERNET,THEY DONT HAVE EDITORS.OR THEY DONT HAVE MANY.WRITERS RULE,AND A THOUGHT CAN GO STRAIGHT FROM YOUR GEAD ONTO THE NET.THAT USED TO SOUND HELLISH.NOW IT SOUNDS LIKE HEAVEN.

    may all indian editors display such magnanimity.MAY ALL NETIZENS TAKE NOTE OF THE LAST PARAGRAPH AND DESIST FROM BEHAVING LIKE AURANGAZEB OF THE NET.

    వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా కస్తూరి మురళీకృష్ణ — ఏప్రియల్ 17, 2008 @ 4:12 పూర్వాహ్నం | జవాబు

  14. [...] తన నిరసనను నేరుగానే తెలియజేసారు. పత్రికలూ బ్లాగులూ రచయితలూ అనే జాబులో కస్తూరి మురళీకృష్ణ తన [...]

    పింగ్ బ్యాక్ ద్వారా పొద్దు » Blog Archive » ఏప్రిల్ బ్లాగు విశేషాలు — మే 3, 2008 @ 2:09 పూర్వాహ్నం | జవాబు

  15. చాలా ఆలశ్యంగా ఈ చర్చను చూస్తున్నాను. నెటిజెన్ ఎందుకలా వాగారో (ఫ్రాయిడియన్ స్లిప్ ఆఫ్ టంగ్) నాకైతే అర్థం కావట్లేదు. పుస్తక పరిచయాలు చేసేవారిని హీనంగా చూశారు. నేనీ పుస్తకాన్ని చదివాను, నాకు నచ్చింది లేదంటే నచ్చలేదు. ఎందుకంటే… అని నాలుగు మాటలు రాసినంతమాత్రాన మేమంతా విమర్శకులమో, సమీక్షకులమో అయిపోయామన్న భ్రాంతులైతే లేవు. ఇదంతా బ్లాగుల హంతక పన్నాగంలా కనిపిస్తోంది. కాస్త సీరియస్ విషయలపై వచ్చిన పుస్తకాల పరిచయాలు ఈ మధ్య బ్లాగుల్లో కనిపించేసరికి కొదరికి సహజంగానే చిర్రెత్తుకురావడం సహజం. అదే మాస్ మసాలా అంశాలపై బ్లాగులు వండి వారుస్తుంటే సదరు బ్లాగరులకు ఏ అభ్యంతరాలు ఉండకపోవును. వీటిని మనం పట్టించుకోకుండా మన కృషి కొనసాగించుకోవడమే ఉత్తమం.

    వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా దుప్పల రవికుమార్ — మే 3, 2008 @ 5:43 పూర్వాహ్నం | జవాబు

  16. బాగా చెప్పారండీ. మన ఓరల్ లిటరేచర్ కి ప్రతిరూపం ఈబ్లాగులు. నేను బ్లాగు రాయడం మొదలుపెట్టినతరవాత పుట్టింటికి వచ్చినట్టుంది.

    వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా మాలతి — మే 3, 2008 @ 10:51 పూర్వాహ్నం | జవాబు


ఆర్ యస్ యస్ ఈ జాబుపై వ్యాఖ్యలకు ఫీడ్ TrackBack URI

మీ ఉద్దేశ్యం…

WordPress.com లో Blog పెట్టుము.