రాతలు – కోతలు

ఏప్రియల్ 4, 2008

క్రికెట్టూ-కనికట్టూ!

ప్రచురించిన వర్గము Uncategorized — కస్తూరి మురళీకృష్ణ @ 10:22 పూర్వాహ్నం

అయ్యో పాపం మనవళ్ళు పిట్టల కన్న ఘోరంగా రాలి పోయారు.  అతిరథ మహారథులు,హేమా హేమీలు అంతా ఆల్ ఔట్ అయిపోయారు.మొన్న మద్రాస్ లో జరిగిందంతా కలో నిజమో అర్ధమయ్యే లోగా మనవాళ్ళు నిజ రూపం చూపించేసారు.ఇంకా మద్రస్ లో ఆడిన ఆటల లెక్కలు పూర్తిగా తేలలేదు.రికార్డు బుక్కులు సవరించనే లేదు.మళ్ళీ రికార్డు పుస్తకాల వెంట పడాల్సి వస్తోంది.అప్పుడు పరుగులు తీసి రెకార్డులు చేస్తే,ఇప్పుడు పరుగులు తీయక రికార్డులు. అయితే ఎమి చేసినా మనము రికార్డులు బద్దలు కొడతాము.అందుకే,మనల్ని నెంబర్ వన్ జట్టుగా ఎల్లప్పటికీ నిర్ణయించేయాలి.మిగతా స్థానాలకోసం మిగత జట్లు పోతీ పడాలి. క్రికెట్ ఆటలో కూడా రిజర్వేషన్ ప్రవేశ పెట్టాలి.లేక పోతే మన బిసిసీఇ దగ్గర బోలెడు దబ్బులు వున్నాయికదా.మొదటి స్థానాన్ని కొనేస్తే పని అయిపోతుంది.కశ్ట పడి ఆడి.వికెట్ దగ్గర కుదురుగా నిలబడి జట్టును ఆదుకొనే వాడు లేడు.కనీసం అందరూ ఔట్ అవుతూంటే జాగ్రత్తగా ఆడే తెలివి లేదు.ఎవరికివారు ఒక ఆటలో పరుగులు తీస్తే పది ఆటల దాక ఆడకున్నా పరవాలెదు అనుకుంటున్నట్టు వుంది.సెహ్వాగ్ అయితే పది ఆటలలో పరుగులు తీయనవసరం లేదు. ఇలాగ ఆడితే మనము అత్యుత్తమ జట్టు ఎలా అవుతాము?ఎల్లప్పటికీ వుత్తమ ఆటను ప్రదర్శించే జట్టు కోసం వేట ఆరంభించాలి.అప్పటి వరకు రికార్డుల కనికట్టు ప్రభావంలో పడి మన జగజ్జట్టీలయిన ఆటగళ్ళకు లక్షలిద్దాము.అంతా కలసి వంద పరుగులు చేయలేకపోయినా పాత రికార్డుతో పోల్చి బెటరే అందాము.జై హింద్.

WordPress.com లో Blog పెట్టుము.