నిన్న ఒక టీవీ చానల్ వారు ఈ అంశంపయిన చర్చ నిర్వహించారు.అది చూస్తూంటే ప్రేక్శకులను ఆకర్శించటానికి మన చానళ్ళు ఎన్ని తంటాలు పడుతున్నాయో అర్ధమవుతుంది.వ్యక్తిగతంగా నాకు ద్రావిడ్ ఆట చాలా నచ్చుతుంది.డిస్కొ యుగంలో శాస్తీయ సంగీతంలాంటి వాడు రాహుల్.మండే ఎండల ఎడారిలో సేద తీర్చే చల్లని సమీరం లాంటి వాడు ద్రావిడ్.సచిన్ ఒక అందమయిన ప్రభంజనం లాంటి వాడు.అతని ఆట చూస్తూంటే ఒక అతి ప్తతిభావంతుడయిన శిల్పి,అతి సునాయాసంగా,బండ రాయిలో సరిగమలు పలికిస్తూ,మధుర భావనలు కలిగించే రమణీయ ఆక్రుతులను వెలయిస్తున్నట్టు తోస్తుంది.లారా ఆట,ఒక సంగీత దర్శకుడు,విభిన్నమయిన వాయిద్యాల శబ్దాలనుంచి,మ్రుదు మధురమయిన సింఫోనీ ని తయరుచేస్తున్న భావన కలుగుతుంది.మౌలికంగా ముగ్గురూ అంతిమంగా అందాన్నీ,అనందన్నీ కలిగించినా,భావానుభూతి ష్తాయీ తీవ్రతలు,సౌఖ్య భావనలు వేర్వేరు.ఒకరితో ఒకరిని పోల్చటం కుదరదు.గణాంక వివరాలు జీవం లేనివి.వాటి ద్వారా వ్యక్తి ప్రతిభను కొలవటం అర్ధ రహితం.కోయిల పాటా,జలపాత ఘొషా,తుఫాను వాయు మ్రోతా శబ్దాలే అయినా వాటిని పోల్చటం మూర్ఖత్వం.ద్రవిడ్,సచిన్,లారా లను పోల్చాలనటం కూడా అంతే మూర్ఖత్వం.పైగా ఇలా పోల్చటం వల్ల,వారి మధ్య లేని పోని స్పర్ధలు జనించే వీలుంది.అయితే,వారు పరిణతి చెందిన ఆటగళ్ళు కబట్టి సమస్య లేదు.చినిమా స్టార్లు కాదు కాబట్టి గొడవ లేదు.అదే,చిరంజీవి,నాగర్జునా,రజనీకంత్ లను ఇలా పోల్చి మాట్లాడితే………..కానీ,క్తికెట్ ఆట ద్వారా ప్రేక్శకులను ఆకర్శించాలంటే ఇటువంటివి తప్పవు.ఇందుకుబదులుగా,ద్రావిడ్ వ్యక్తిత్వం,ఆటలో మెళకువలు,అతని కమిట్మెంట్,టెంపర్మెంట్ వంతి వాటి గురించి చర్చించి వుంటే భావి క్రికెటర్లకు వుపయోగంగా వుండేది.
ఏప్రియల్ 1, 2008
అభిప్రాయములు »
ఆర్ యస్ యస్ ఈ జాబుపై వ్యాఖ్యలకు ఫీడ్ TrackBack URI
what u have expressed is very correct. there must be a healthy competition but not the comparision.
padma
వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా padma — ఏప్రియల్ 1, 2008 @ 11:32 పూర్వాహ్నం |
hmmm.. muggurini polchadaaniki meeru vaadina upamaanalu naaku baaga nacchayee. evariki evaru potee anekanna.. mugguru eka kaalamlO intha andamaina anubhavaalu andinchinanduku celebrate chesukovaali.. veelu unte!!
manaspardhalu vacche avakaasam kaadandi… nijamgaa raavalane chestunnaru emo.. a way of creating news
వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా Purnima — ఏప్రియల్ 1, 2008 @ 4:34 అపరాహ్నం |