అనాది నుంచి మన దేశం ఎందరెందరికో ఆశ్రయమిచింది.ప్రపంచవ్యాప్తంగా అత్యాచారాలకు గురయిన ఎన్నెన్ని జాతులో భారత దేశంలో ఆశ్రయంపొందాయి.స్వేచ్చగా,గౌరవంగా వర్ధిల్లాయి. వినదగునెవ్వరు చెప్పినా అంటూ అన్నిరకాల అభిప్రాయలను గౌరవించాము.అందరినే ఆదరించాము.మనలను వ్యతిరేకించిన వారిని కూడ ప్రేమించాము.మనల్లో ఒకరిగా చేసుకున్నాము.గ్రేకులు,హూణులు,శకులు,దరదులు,బాహ్లేకులు,యూదులు,పార్సీలు ఒకరేమిటి భార్తదేశమనే మహా సముద్రంలో ఎన్నెన్నో ఉపనదులు మిళితమయి పోయాయి.దేశాన్ని సుసంపన్నం చేశయి.కాని ఇప్పుడిది ఏమిటి?భిన్నభిప్రాయలను వాదన ద్వారా,చర్చల ద్వారా,తర్కం ద్వారా ఎదుటి వాడి అభిప్రాయాన్ని తప్పని చూపించి ఒప్పించేవారు.వాదనలో ఓడిపోయినవారు సైతం ఎటువంటి అసూయలు,ద్వేశాలు లేకుండా నిజం ఒప్పుకునేవారు.కానే ఇదేమిటి,ఒక మహిళకు ఆశ్రయం ఇవ్వలేని దుస్థితిలో వున్నము మనము.కొందరి బెదిరింపులకు లొంగి పోయి ఒక స్రుజనాత్మక రచయిత్రిని మానసికంగా హింసించటం మన భారతేయులందరికి సిగ్గుచేటు.ఇంత పెద్ద దేశంలో అడిగిన వారికి రక్శణనివ్వటం కోసం ప్రాణాలనయినా ధారపోసే సంప్రదయం కల దేశంలో ఒక మహిళ భారం అయిపోవటం అన్యాయమయిన విశయం.ఇలా బెదిరింపులకు లొంగిపోతూవుంతే ప్రభుత్వం ఎంతగా చులకన అయిపోతుంది?ఎవరికయినా బెదిరింపులతో పనులు సాధించుకోవచ్చన్న అభిప్రాయం కలుగుతుంది.ఇక ప్రభుత్వాన్ని ఎవరు గౌరవిస్తారు?ఇప్పతికే కోర్కెల సాధనకు బెదిరింపులు,అల్లర్లు బందులు ఆనవాయితేలయ్యాయి.ఇలా కొందరి నిరసనకు ప్రభుత్వం తలవంచటం ఇలాంటి ఇంకెందరికో ధాఇర్యాన్ని ఇస్తుంది.నువ్వన్నదానితో ఎకీభవించకపోయినా నే అభిప్రాయాన్ని వ్యక్తపరిచే హక్కును గౌరవిస్తాననే మన సాంప్రదాయం పోయి,బెదిరిస్తే భయపది లొంగిపోయే పిరికి ప్రభుత్వాల కాలం మొదలయింది.ఇంత దేశం,ఇంత సైన్యం,ఇంతమంది పొలీసులు వున్నా ఒక మహిలకు భద్రత కల్పించలేకపోవటం సిగ్గుచేటు.రేపు ఇంకేవరయినా బెదిరిస్తే దేశన్నే అమ్మెసినా,మనం చూస్తూ వుండిపోయినా అశ్చర్యం లేదు.