రాతలు – కోతలు

మార్చి 16, 2008

జోధా అక్బర్-మరి కొన్ని ఆలొచనలు

ప్రచురించిన వర్గము Uncategorized — కస్తూరి మురళీకృష్ణ @ 6:58 పూర్వాహ్నం

జోధ అక్బర్ పైన నా అభిప్రాయం పైన మీ స్పందన చూసిన తరువాత ఇంకా కొన్ని విషయాలు ప్రస్తావించాలనిపించింది.చారిత్రాత్మక సినిమాలలో ఊహ తప్పనిసరి.కాని ఈ ఊహ వల్ల ఆయా పాత్రల పైన గౌరవం కలగాలి.పాత్రల వ్యక్తిత్వం మనకు అర్ధమవాలి.ఈ విషయం లొ మన చరిత్ర సినెమాలు వెనుకబడి వున్నాయి.అశోకా సినెమాలొ అశోకుడు పిచ్చి గెంతులు వేస్తాడు.మంగళ్పాండె నయితే అతి ఘోరంగ చూపారు. రామదాసు,అన్నమయ్యల గతి ప్రత్యేకంగా చెప్పల్సిన అవసరం లేదు.అంటే మెలో ద్రామా కోసం చరిత్ర తో ఆటలాడటం అలవాటయింది మనకు.ఇది మంచిది కాదు.సినెమా ఎంత శక్తివంతమయిన మాధ్యమం అంటే ఒక సినెమా లో ఒక అసత్యం చూపితే,అది సమాజం లో సత్యంగా స్థిరపడుతుంది.ముఘలేఅజం ప్రభావంతొ అకర్ భార్య జోధానే అన్న ఆలోచన స్థిరపడింది,చరిత్రతో సంబంధంలేకుండ.జోధా లో కూదా అనేక సంఘటనలు చరిత్రపైన తప్పుడు అభిప్రాయాలు కలిగించెట్టు వున్నాయి.రాజపుత్ర రాజుల ప్రవర్తన ఈ సినెమా లో వారి స్థాయికి తగ్గట్టు లేదు.మామూలు సినెమలలో లాగా రహస్యాలు అందరికీ తెలిసెటట్టు మాట్లాదటం హాస్యాస్పదంగా వుంది.అక్బర్ యుధ్ధానికి వెళ్తూ రాణికి చెప్పడు.జెనానా లో వుండె రాణి ఓ గుర్రం మేద యుధ్ధానికి వచ్చేస్తుంది. అక్బర్ వికేత.రాజపుత్ర రాజు స్వచ్చందంగా తన కూతురిని  పెళ్ళి చేసుకొమని అడిగాడు.అటువంటప్పుడు జోధ శరతులు పెట్టటంలో, అక్బర్  వాటికి ఒప్పుకోవటంలో ఔచిత్యం లేదు.నేపధ్య సంగీతం ఆకర్శణీయంగా వున్నా అది సందర్భోచితంకాదు.ఈ విశయంలో నౌశాద్ ముఘల్ సంగీతం గురించి చెప్పిన విశయాలు గమనించాలి.మనం అల్ప సంతోశులం కాబట్టి,వినోదానికి ఇచ్చిన ప్రాధాన్యం నిజాలకు ఔచిత్యానికి ఇవ్వం కబట్టి మన కళాకారులు బ్రతికిపోతున్నరు.

WordPress.com లో Blog పెట్టుము.