ఈ రోజు (30 మార్చ్ 2008) వార్త ఆదివారం అనుబంధంలో నేను రాసిన ‘ కాలయంత్రంలో క్లార్క్ ‘ అనే కథనం ప్రచురితమైంది. ఆ కథనాన్ని ఇక్కడ చదివి మీ వ్యాఖ్యలు రాయండి
మార్చి 30, 2008
మార్చి 27, 2008
కురిసింది వానా నా గుండె లోనా……
వరుసగా మూడు రోజులనుంచీ హైదరాబాదు లో వర్షం కురుస్తోంది.ఇన్ని రోజులూ ఇంట్లో కూర్చుని పడుతున్న వర్షాన్ని చూస్తూ గడిపాను.నిన్న వర్షంలో తడిసాను.ధారాపాతంగా వర్షపు నీటి చుక్కలు శరీరం మీదపడుతూంటే అప్రయత్నంగా,నా ప్రమేయం ఏమీ లేకుండా గుండె లోతుల్లోంచి అనేక పాటలు ఒకదాని వెనుక మరొకటి తన్నుకు వచ్చాయి.కరువుతీరా పాడుకుంటూ ద్రైవ్ చేసుకుంటూ వర్షంలో తడిసా.
ముందుగా పెదిమలపైకి వచ్చింది…కురుసింది వానా నా గుండె లోనా…అంతలో,ఒక జంట వర్షంలో నీడ కోసం పరుగెత్తుతూ కనిపించారు.చిట పట చినుకులు పడుతూ వుంటే…నవ్వుకుంటూ సంతోశంగా పాడుకున్నాను.
ఇంతలో, ముగ్గురు పిల్లలు వర్షంలో తదుస్తూ కనిపించారు.కళ్ళముందు రాజ్ కపూర్,నర్గీస్ లు మెదిలారు.ప్యార్ హువా ఇక్రార్ హువా……వహ్ ,నిజంగా ధన్యజీవులు అనిపించింది.రొమన్స్ కు నిర్వచనం ఇచ్చరు.
కాస్తముందుకు వెళ్ళగానే,ఒక చెట్టు చాటున ఒక యువ జంట రొమాన్స్ కనిపించింది.వెంటనే నా మన్సులో దెవానాంద్,వహీదా లు మెదిలారు.రింఝింకే తరానే లేకే అయీ బర్సాత్,యాద్ అయీ కిసీసే వో పహ్లీ ములాకాత్…అహాహా…బర్సాత్ మే బర్సాత్ మే హంసె మిలే తుం సజన్ తుంసె మిలే హుం బర్సాత్ మే…….
ఇంతలో సరిపొయీ సరిపొని షెల్టెర్ కింద ఓ జంట కనిపించింది.నా కళ్ళముందు,దెవానంద్,నూతన్ కదిలారు .యే బహారే యే పుహారే యే బరస్తా సావన్ ధర్ధర్ కాంపే తన్మన్ మొరె బయ్యా ధర్లో సాజన్ అంది నూతన్.అజీఅనా దిల్మే సమానా అన్నడు దెవ్.రొమన్స్ కి పరాకష్ట అది.చోడ్ దో ఆంచల్ పట అది.పేయింగ్ గెస్ట్ సినెమా లోది.
అయితే,ఇంతలో నాకోసం, ఇంట్లో, వర్షాన్ని చూస్తూ,ఒకో నీటి చుక్కన్ని చూస్తూ, ఎదురుచూస్తున్న అమ్మాయి గుర్తుకువచ్చింది.ఓ సజ్ఞా……..ముత్యలు జాలువారినట్టు జాలువారుతునా నీటి బిందువులను సంగీతం ద్వార కనిపింపచేస్తాదు సలీల్ చౌధరీ.ఓ సజ్ఞా,బర్ఖా బహార్ అయీ,రస్కీ పుహార్ లయీ,అఖియోమె ప్యార్ లయీ ఓ సజ్ఞా.ఇక నాకు మరో పాట గుర్తుకు రాలేదు.ఈ పాటలోని ప్రతి అక్షరం,ప్రతి పదం,ప్రతి శబ్దం తలుచుకుంటూ,వింటూ,పాడుకుంటూ,మైమరచి పోయాను.వర్షం తగ్గితే బాధ అనిపించింది.ఫిర్కే వొ సావన్ అబ్ క్యూ న అయే..అనిపించింది.
వర్షంలో నా అనుభూతిని మీతో పంచుకోవాలనిపించింది.అయితే,ఇంత ఆనందంలోనూ ఒక అలోచన వచ్చింది…ఒకవేళ ఈ సినెమాలు,పాటలు మనకు ఈ రొమాంటిక్ వూహలు ఇవ్వకపోయివుంటే?బహుశా,మనము స్వంతంగా మన మనసులోని భావాలను వ్యక్త పరిచే ప్రయత్నం చేసేవరమేమో?అరువుభవాలతో అలౌకిక అనాందం పొందే బదులు,స్వంత ఆలోచనలతో ఆనందించే వారమేమో?కానీ,దేవ్,రాజ్కపూర్లు లేకపోతే రొమాన్స్ ఏమయిపోతుంది?అందుకే ఆ అలోచనని పక్కకు నెట్టి హాయిగా ఓ సజ్ఞా అంటూ ఇంట్లో అడుగుపెట్టా.
మార్చి 25, 2008
నేను చదివిన మంచి పుస్తకం-1
మన తెలుగు సాహిత్య ప్రపంచములో విమర్శ అన్నది అంతగా విశాలం కాలేదు.దీనికి అనేక కారణాలు వున్నాయి.వుద్యమ సాహిత్యానికిచ్చిన ప్రాధాన్యం మానవతా విలువలున్న సాహిత్యానికి ఇవ్వటంలేదు.పేరున్న రచయితలకు ఇచ్చిన ప్రాధన్యం కొత్త రచయితలకు ఇవ్వటం లేదు.తెలిసినవారు,ఎవరినయినా పొగిడితే లాభం వుండేవారు,తాము నమ్మిన ఇజాన్నే నమ్మేవారు ఇటువంటి వారి రచనలను ఆకాశానికి అర్హత లేకున్న ఎత్తేయటం జరుగుతొంది.ఇవన్నే లేకపోతే మంచి రచన చేసినా అవి మరుగున పడిపోతున్నాయి.ఎందుకంతే విమర్శకులు వాటిని పాథకుల ద్రిష్టికి తేవటం లేదు.వారికి తమ లాభం తప్ప సాహిత్య అభివ్రుద్ధితో పని లేదు.అందుకే తెలుగు లో ఇప్పటికే కొంతమంది పాత రచయితల పేర్లే వినిపిస్తూంటాయి.కొత్త రచయిత పేరు వినిపిస్తే ఆ రచయిత పేరు వినపదటం వెనుకు బోలేడన్ని కథలుంటాయి.ఇంత ఉపోద్ఘాతం ఎందుకంటే రచయిత పేరుతో,పార్టీ తో, సామజిక స్థాయితో సంబంధం లేకుండా చూస్తే ఎక్కువమందికి తెలియని అనేక రచయితలు అద్భుతమయిన కథలు రచిస్తూ కనిపిస్తారు.అటువంటి రచనలను పరిచయం చేస్తాను నేను వీలున్నప్పుడల్లా.నా వాదనకు రుజువుగా పరిచయం చేస్తున్న మొదటి కథా సంకలనం “అమ్మకు అభినందనలు.రచయిత్రి పేరు “ం.హేమలత”.
ఈ సంకలనంలో కథలు చదువుతూంటే ఆశ్చర్యం కలుగుతుంది.ఎందుకని ఈ రచయిత్రి కథలగురించి చర్చలు జరగటంలేదు?ఎందుకని ఈమె పేరు మంచి రచయితల జాబితాలో వినిపించదు?ఎందుకని ఏ విమర్శకుడూ ఈమె పేరు ప్రస్తావించడు?
ఈ సంకలనం లోని కథలన్నీ ఒక ప్రయొజనం వున్నవే.ప్రతి కథలో నిత్యజీవితంలో మనము ఎదుర్కొనే సమస్యల చిత్రణ,వాటి వివరణ,పరిశ్కారాలూ ప్రతిభావంతంగా ప్రదర్శితమవుతాయి.సాద్గారణంగా మన రచయితలు కథాంశాలుగా ఎంచుకోని వైద్య సంబంధిత అంశాలు కేంద్ర బిందువుగా అనేక కథలు నడుస్తాయి.మన అపోహలు తొలగించి సరయిన ద్రుక్కోనాన్ని ఇస్తాయి.అల్జేమియర్,మ్ర్సీ కిల్లింగ్,హిస్టెరెక్టొమీ వంటి విశయాలను వివరించి సందేహాలు తీరుస్తాయీకథలు.ఇంత మంచి కథలగురించి ఏ విమర్శకుడూ విశ్లేశించడు.ఏ సంస్థా బహుమతులివ్వదు.కాబట్టి విమర్శకులతో సంబంధం లేకుండా పాథకులే మంచి కథలను వెతుక్కోవాలి.వాటిని బ్రతికించు కోవాలి.కథకులకు ఉత్సాహాన్నీ,ప్రోత్సాహాన్నీ ఇవ్వాలి.తెలుగు సాహిత్యాన్ని పరిపుశ్టం చేయాలి.